సబ్ ఫీచర్

బతుకు.. నిత్య నృత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిభ, కళ.. రెండూ ఒక్కచోట చేరడం దైవదత్తమైన వరం. ఆ వరాన్ని అందిపుచ్చుకుని అనేకమందికి సేవచేస్తూ తరించడమూ పుణ్యఫలమే. నిరంతర కృషికి మూలసాధనమైన ప్రతిభ -జీవితానికి ఓ పరమార్థత చేకూరుస్తుంది. కూచిపూడి నృత్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోనేకాక దేశ విదేశాల్లో ప్రదర్శించి.. శిష్యపరంపరను ప్రపంచానికి పరిచయం చేస్తోన్న నాట్యబ్రహ్మ ఆమె.
అలాంటి నృత్య సరస్వతిని -వేదికమీద చూసిన అక్కినేని అబ్బురపడ్డారు. ఆమె మోములో, హావభావల్లో -తనకు కావాల్సిన కళనేదో వెతుక్కున్నారు. ‘సంఘం అంటే ఏమాత్రం లేక్కలేని ఓ అమ్మాయి పాత్ర.. అదీ నా సినిమాలో’ చేస్తావా? అంటూ అడిగేశారు. సినిమా అంటే ఏమాత్రం సదభిప్రాయం లేని ఆమెకు ‘జీవిత సత్యాన్ని’ చెప్పారు. మన పరిధిలో మనమున్నపుడు -ఎలాంటి భయాలకూ తావివ్వాల్సిన అవసరం లేదని ఆమె తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఆ సందర్భం నుంచే ఓ సంప్రదాయ నృత్యకారిణి స్క్రీన్ ఆర్టిస్ట్‌గానూ వెలిగింది. ఆమె ఎవరో కాదు, ప్రసన్న రాణి. ఈవారం వెనె్నలకు తన అనుభవాలను జ్ఞానగుళికలుగా అందిస్తోన్న పుంభావ సరస్వతి -ప్రసన్నరాణి.

రాజమండ్రిలో రాయపరెడ్డి రామానుజరావు, అమృతవల్లిల ముద్దుల తనయ -ప్రసన్నరాణి. నలుగురు అన్నదమ్ముల నడుమ ఎదిగిన గారాలపట్టి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నాలుగో ఏటనుంచే నృత్యంలో అడుగులేసింది. రాజమండ్రిలో సప్ప సత్యనారాయణ వద్ద శాస్ర్తియ నృత్యం నేర్చుకుంది. తరువాత హైదరాబాద్‌లో భాగవతుల రామకోటయ్య, వేదాంతం జగన్నాధం శర్మల వద్ద నిష్ణాతురాలైంది. మద్రాసు నగరంచేరి వెంపటి చినసత్యం వద్ద తను అభ్యసించిన కళకు మెరుగులద్దుకుంది. దేశం నలుమూలలా వేయి నృత్య ప్రదర్శనలిచ్చిన అనుభవం ఆమెది. ఇవన్నీ నృత్యరంగానికి సంబంధించిన విశేషాలు.
**
కళ -కుదురుగా ఉండనివ్వదు. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే మారు రూపంలో వచ్చి చిటికెన వేలు అందించి చేరాల్సిన చోటుకి అడుగులేయిస్తుంది. ప్రసన్నరాణి -వెండితెర అడుగులు కూడా అలాంటివే. ఒకసారి రవీంద్రభారతిలో నృత్య రూపకం ప్రదర్శిస్తున్న సమయం. అగ్రనటుడు అక్కినేని నాగేశ్వరరావు, అగ్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆ నృత్య రూపకాన్ని తిలకించారు. ప్రసన్నరాణిలో హావభావాల్లో ప్రతిభను గమనించారు. కొత్తగా నిర్మించబోయే ‘సుడిగుండాలు’ చిత్రంలో -సంఘమంటే ఏమాత్రం లెక్కలేని అమ్మాయి పాత్రలో నటించమని అడిగారు. అందుకు రాణి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. సినిమా పరిశ్రమ అంటే ఏవేవో చెడు భావాలతో ప్రేక్షకులు ఆలోచిస్తారని, పరిశ్రమలోవారు హేళనగా మాట్లాడతారని భయపడ్డారు. అందుకు ఆదుర్తి, అక్కినేని కలిసి -‘ఏదైనా మన ప్రవర్తనలోనే ఉంటుంది. మనం అజాగ్రత్తగావుంటే ఇలాంటివన్నీ ఎదురవుతాయి. మన పరిధిలో మనం పనిచేస్తే ఎవరికీ భయపడాల్సిన పని లేదు. కళ ఎక్కడైనా కళే’నన్న జీవిత సత్యం చెప్పారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. అలా -స్క్రీన్‌కు వచ్చిన ప్రసన్నరాణి తొలి చిత్రం సుడిగుండాలు. ‘నృత్యం అంటేనే ఒక సన్నివేశాన్ని అభినయించి చూపించటం. సహజంగానే నాట్యగత్తెను కనుక, సినిమా రూపొందించే సమయంలో ఫస్ట్‌టేక్‌లోనే ఏ భావాన్నైనా పలికించేదాన్ని. అందుకేనేమో ఏఎన్నాఆర్ ‘గట్టిపిండం’ అంటూ ఓ బిరుదిచ్చేశారు’ అంటారామె ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ. తరువాత మరోప్రపంచం, నా తమ్ముడు, రైతుబిడ్డ, శ్రీకృష్ణవిజయం, పూజ, బలిపీఠంలాంటి చిత్రాల్లో వరుస అవకాశాలొచ్చాయి. కానీ ప్రసన్నరాణికి నృత్యంపైనే మక్కువ ఎక్కువైంది. ‘నటనారంగం కూడా కళే. కాకపోతే పాత్రలు నృత్యానికి సంబంధం లేకుండా హాస్యంగా, శృంగారాత్మకంగా ఉండటంతో అటువంటి పాత్రలు చేయకూడదని అప్పట్లోనే నిర్ణయించుకున్నా’ అంటారు ప్రసన్నరాణి. తరువాత హైదరాబాద్ వచ్చి రామ్‌కోటిలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల్లో అధ్యాపకురాలిగా చేరారు. అలా దాదాపు 30 ఏళ్లపాటు సేవలందించి పదవీ విరమణ చేశారు. అయినా -ఆమె విశ్రాంతికి సిద్ధపడలేదు. ‘కళకు విశ్రాంతేంటి’ అంటూ ప్రశ్నిస్తారామె. తనుకు భగవదత్తంగా అబ్బిన కళను నలుగురికీ పంచాలన్న దీక్షతో నారాయణగూడలో నృత్య శిక్షణ కేంద్రం స్థాపించారు. ‘1967లో తొలి చిత్రంతోనే ఉత్తమ కథానాయికగా నంది అవార్డు రావడం బహుశ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆనందదాయక విషయమేమో’ అంటారామె. ‘్భర్తది వ్యాపారం. ఇక పిల్లలంటారా.. వేలాదిగా నా దగ్గర శిక్షణపొందిన వాళ్లంతా నా పిల్లలే’ అంటూ నవ్వేస్తారామె.
‘పరిశ్రమలో మంచి పాత్రలు రావాలంటే మస్కాలు కొట్టాలనేవారు కొందరు. అలాంటివి నాకు చేతకాదు. మస్కాకొట్టడం, లేని ప్రేమలు ఒలకబోయడం, ఎదుటివారి తప్పున్నా ఏమీలేనట్టుగా మాట్లాడడం నాకు చేతకాని విషయాలు. అందుకే ఎక్కువ అవకాశాలు రాలేదేమో. అయినా నేనెప్పుడూ ఆ పాత్రలకోసం వెంపర్లాడలేదు కూడా. నాకు నచ్చిన నృత్యంలోనే జీవితం సాగించాలనుకున్నా. అలాగే నృత్యంతోనే సుదీర్ఘ జీవితాన్ని సాగించాను’ అంటారు ప్రసన్నరాణి. ‘సుడిగుండాలు విడుదలైన తరువాత ఎక్కడికి వెళ్లాలన్నా చిన్న ఇబ్బంది ఉండేది. ఎక్కడికెళ్లినా సుడిగుండాలు ప్రసన్న వచ్చిందంటూ చుట్టూ మూగేవారు. కనీసం ఏదైనా షాపింగ్ చేయాలన్నా వీలయ్యేది కాదు. ఇది ఒక్కోసారి నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. స్వేచ్ఛను కోల్పోతున్నామా? అన్న భావన కలిగేది’ అంటూ గుర్తు చేసుకున్నారు ప్రసన్న రాణి. ‘మరో ఇబ్బందికరమైన విషయమేంటంటే, హీరోయిన్ పాత్రలు కాకపోయినా ప్రధానమైన అంశాలతోవున్న క్యారెక్టర్స్ వస్తే చేసేదానే్నమో. కామెడీ ట్రాక్‌లోకి లాగాలని ప్రయత్నించారు. చిన్న చిన్న కాస్ట్యూమ్స్ వేసుకోమని డిమాండ్ చేసేవారు. వాటికి ఒప్పుకునేదాన్ని కాదు. అది నాకు నచ్చని విషయం అని చెప్పేసేదాన్ని. నేను పైకి సున్నితంగానే కనిపించినా, సుడిగుండాలు సినిమాలో నా పాత్రలాగే చాలా ఏరోగేంట్‌గా ఆలోచించేదాన్ని. అందుకే తృణప్రాయంగా వాటిని తీసేశాను. ఒకరకంగా పరిశ్రమలో నాలాంటివారు ఇమడలేరని నిర్ణయానికి వచ్చాకే -నాకిష్టమైన నృత్యాన్ని ఎక్కువ ఎంచుకున్నానేమో’ అంటూ అప్పటి పరిస్థితిని వివరించారు ప్రసన్నరాణి. మొదట చెప్పేటప్పుడు దర్శక నిర్మాతలు చాలా మంచి పాత్ర అంటారు. మంచి పేరొస్తుందనీ చెబుతారు. తీరా అక్కడికి వెళ్లాక.. ఆ పాత్ర నా ఆలోచనలకు, ఊహలకు భిన్నంగా ఉండేది. నచ్చేదికాదు. అలా ఒక్కరోజు షూటింగ్ చేసి వదిలేసిన అవకాశాలూ ఎన్నో ఉన్నాయి. దర్శక నిర్మాతలు ఆ రోజుకి షూటింగ్ పూర్తవ్వడం కోసం, వాళ్లపని ముగించడం కోసం వాళ్ల ధోరణిలో వాళ్లు చెప్పేవారు. కానీ, అదంతా నాకు నచ్చలేదు. బీ ఫ్రాంక్‌గా ఉండటం, నాపని నేను చేసుకోవడం నాకిష్టం. అది నృత్యకళలో నాకు దొరికింది. ఒక్కసారి పరిశ్రమను వదిలేశాక మళ్లీ ఇంతవరకూ ఎవ్వరినీ కలవలేదు. ఇటీవల ఓ వేడుకలో నటి గీతాంజలి నన్ను చూసి గట్టిగా కావలించుకుని ఎనె్నన్నో విషయాలు గలగలా మాట్లాడేసింది. కానీ నాచుట్టూ వున్నవారికి ఇవన్నీ తెలియవు. వాళ్లుకూడా ఆశ్చర్యపోయారు. ఓరకంగా సినిమా పరిశ్రమను మర్చిపోయాననే అనుకుంటాను.. అంటారు ప్రసన్నరాణి.
ఇక ఇప్పటి సినిమాల గురించి చెప్పడానికే పెద్దగా ఆసక్తి లేదు. కొన్ని బావుంటున్నాయి. ఇంకొన్ని సినిమాలు ఎందుకు తీస్తున్నారో అర్థంగానంత అయోమయాన్ని సృష్టిస్తున్నట్టు అనిపిస్తాయి. ఏం తీస్తున్నారో తీసేవాళ్లకీ తెలీడం లేదా అన్న భావన ఒక్కోసారి కలుగుతుంది. చూసేవాళ్లూ అలాగే చూసేస్తున్నారు. నిజానికి సుడిగుండాలు విజయం సాధించిన సినిమా కాకపోవచ్చు. కానీ అది అవార్డు చిత్రం. ఇపుడు జరుగుతున్న అనేక అనర్థాలు దాదాపు 30ఏళ్ళ క్రితమే ఆదుర్తి సుబ్బారావు ఆలోచించి సినిమాలో రూపొందించారు. అంటే వారు ఎంత క్రాంతదర్శులో అర్థం చేసుకోవచ్చు. అది ఒకరకంగా వారి గొప్పదనమే. నేను పొగరుబోతునే. అలాగని ఎవరినీ ఏనాడూ నొప్పించలేదు. అలా ఇతరుల మనసు నొప్పించి బాధపడే తత్వం నాదికాదు. మా నాన్న చివరిరోజుల్లో నా భర్తను ఓ కోరిక కోరారు. ‘అమ్మాయి ప్రదర్శనలు ఇవ్వకపోయినా ఫర్లేదు, ఆమె నాట్యకళను మాత్రం నలుగురికీ బోధించే ప్రక్రియను మాత్రం ఆపొద్దని’ కోరారు. అదేవిధంగా ఇప్పటికీ నా కళను నలుగురికీ పంచుతున్నా. అదే నా ఒరిజినాలిటీ -అంటూ ముగించారు ప్రసన్నరాణి.

సరయు శేఖర్, 9676247000 సహకారం: గంగారామ్ నాయక్, కడెం