సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ దృష్టాంతమును వివరించునెడల, సమాధి స్థితిలో గోచరించు బ్రహ్మమే ఇందులకు మూలమైన పాలు, సగుణ నిర్గుణ స్వరూపమగు బ్రహ్మమే ఇందలి వెన్న, ఇరువదినాలుగు తత్త్వములతో గూడిన ప్రపంచమే మజ్జిగ.
851. ‘‘నా వాదమే సరియైనది, హేతుబద్ధమైనది; సగుణ బ్రహ్మమును నమ్మువారు పొరపడుతున్నారు’’అని యద్వైతి పలుకకుండుగాక. మనశ్శరీలములకంటెను బాహ్య ప్రపంచముకంటెను బ్రహ్మముయొక్క సగుణ రూపములు ఎంతమాత్రము సత్యత్వమున తీసిపోవు, సరికదా, వానికంటె కోటిరెట్లు వాస్తవమైనవి.
852. నీవు అద్వైతమునుగూర్చి మాటలాడినంతనే ద్వైతమును ప్రతిపాదించిన వాడవగుచున్నావు. బ్రహ్మమును గూర్చి ప్రస్తావించునపుడు ద్వైత ప్రపంచమునంగీకరించినవాడనే యగుచున్నావు. ఏలన నీ బ్రహ్మము సమాధి స్థితిలో నీకు అనుభూతము కాకుండునంతవఱకు- కేవల శబ్దాడంబరము కానిచో- ద్వైత జగత్తుతో సంబంధించినదే. యథాస్థితిలో బ్రహ్మమెట్టిదో ఎన్నటికిని నీవు నిర్వచింపజాలవు, నిర్వచించినతోడనే నీవ్యక్తిత్వమను (అన్యమైన) రంగునొకదానిని బ్రహ్మమునకు వేయుచునే యున్నావు.
853. నాలో ‘నేను’అనునది యున్నంతవఱకు సగుణబ్రహ్మము దివ్యరూపముల మూలమున నేమి, జీవజగద్రూపముల మూలమున నేమి, భాసించుచు నాయెదుటనే యుండును.
ఈశ్వరుడనియు మాయయనియు శక్తియనియు జెప్పబడు సుగుణబ్రహ్మము
854. పరమాత్ముని నిష్క్రియునిగా, అనగా సృష్టిస్థితి లయ కర్మములు లేని వానినిగా భావించునప్పుడు నేను వానిని బ్రహ్మమనియు పురుషుడనియు జెప్పుదురు. సృష్టి స్థితిలయ కర్మములను జేయుచు, కర్మతంత్రుడై యున్నటుల భావన చేయునప్పుడు వానినే శక్తియనియు మాయయనియు ప్రకృతి యనియు జెప్పుదును.
855. జగత్తు ప్రకృతి పురుషులవలన జనించినదని తెలుపు సాంఖ్యతత్త్వమును వివరించుచు శ్రీ గురుదేవుడిట్లు పల్కెను. ‘‘పురుషుడు అకర్తయనియు ప్రకృతియే సమస్తము చేయుచున్నదనియు సాంఖ్యతత్త్వము తెలుపును. పురుషుడు ఈ ప్రకృతి వ్యాపారములన్నిటికిని కేవల సాక్షీభూతుడు. ఐనను పురుషుడు లేనిదే ప్రకృతి గూడ స్వయముగా ఏ కార్యమును జేయజాలదు. పెండ్లి జరుగునపుడు ఇంటిలో కార్యములన్నియు ఎట్లు జరుగునో మీరు చూడలేదా? యజమానుడు ఒకచోట గూర్చుండి, హుక్కాపట్టుచు, ఆజ్ఞల నొసగు చుండును. కాని వానియిల్లాలు పసపుబొట్టు పెట్టిన చీర కట్టుకొని యింటిలో సంచరించుచుండును. పెండ్లి యేర్పాటులన్నిటిని పరిశీలించుచు, స్ర్తిలను పిల్లలను అందఱను ఆమె ఆదరించుచుండును. తన భర్తయగు యజమానునియొద్దకు అప్పుడప్పుడు వెడలుచు, వ్యవహారములు ఎట్లు సాగుచున్నవో అభినయించి చెప్పుచుండును. ఆమె తెలియజేయనెంచు దానినంతయు గ్రహించి యజమానుడు అంగీకారసూచకముగా కేవలము తలనూపుచుండును. ప్రకృతి పురుషుల విషయము కూడ నిట్టిదే.’’
856. నిష్క్రియమగు బ్రహ్మమును క్రియాయుక్తమగు ప్రకృతియు నొక్కటియే. ఎవ్వడు సచ్చిదానందమయుడో ఆతడే సర్వజ్ఞయు, చిచ్ఛక్తియు, ఆనందమయియు నగు అల జగజ్జనని. రత్నమును దాని ప్రకాశము నొక్కటియే. ఇవి రెండును పరస్పర సంబంధములు గావున ఒక దానిని విడిచి మఱియొక దానిని మీరు భావింపజాలరు.
857. సగుణబ్రహ్మమును నిర్గుణ బ్రహ్మమును (తుదకు) ఒక్కటియే. నీవు ఒక దానిని నమ్మినచో, రెండవ దానినిగూడ నమ్మినట్లే. దహనశక్తివినా అగ్నిని భావింపజాలము; ఇట్లే అగ్ని వినా దహనశక్తిని భావింపజాలము. ఈ రీతిగనే సూర్యుని కిరణములకు భిన్నముగా సూర్యుని, సూర్యునకు భిన్నముగా సూర్యునికిరణములను ఊహింపజాలము. తెల్లదనమును విడిచి పాలను, పాలను విడిచి తెల్లదనమును తలపజాలము.
- ఇంకాఉంది