సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇట్లే సగుణబ్రహ్మము వినా నిర్గుణ బ్రహ్మమును నిర్గుణ బ్రహ్మము వినా సగుణ బ్రహ్మమును చింతింపజాలము.
858. బ్రహ్మమునకును శక్తికిని గల భేదము పేరునకే గాని వాస్తవముగాదు. అగ్నియు దహనశక్తియు నొక్కటియే యగురీతిని బ్రహ్మమును శక్తియు నొక్కటియే. రెంటికిని అభేదము. పాలును తెల్లదనమును ఒక్కటియే యగునట్లు బ్రహ్మమును శక్తియు నొక్కటియే. రత్నమును తత్కాంతియు నొక్కటియే యగురీతిని బ్రహ్మమును శక్తియు నొక్కటియే. ఒకటి విడిచి రెండవ దానిని మీరు ఊహింపజాలరు. రెంటికిని భేదమును గల్పింపజాలరు.
859. సృష్టి స్థితిలయములను వ్యాపారము లెచటనున్నవో శక్తియు అచటనే యున్నది. చలించుచన్నను చలింపకున్నను నీరు నీరే కదా? ఈ ‘కాప్టెన్’ ఒకప్పుడేపనియులేక ఊరక యుండును. మఱియొకప్పుడు పూజ చేయుచుండును; లేదా, పని మీద రాజప్రతినిధిని జూడబోవును. ఐనను కాప్టెన్ ఎప్పుడును కాప్టెనే ఐయుండురీతిని సచ్చిదానంద స్వరూపమగు బ్రహ్మము ఎప్పుడును సృష్టి స్థితిలయ కారణమగు చిచ్ఛక్తియే. అతడెప్పుడును కాప్టెనే; ఇవి కేవలము అతని యొక్క ఉపాధులు, స్థితులు.
860. ఒకప్పుడు నేను బట్టలు కట్టుకొని మఱియొకప్పుడు దిగంబరుడనుగా నుండు రీతిని బ్రహ్మమొకప్పుడు సగుణముగను మఱియొకప్పుడు నిర్గుణముగను నుండును. సగుణబ్రహ్మమనగా శక్తితో గూడియున్న బ్రహ్మము. దానినపుడు ఈశ్వరుడందురు.
861. నా జగన్మాత ఏకమనియు అనేకమనియు మఱియు రెంటికిని గూడ అతీతమనియు గ్రహింతురుగాక.
862. నా జగజ్జననియే అనేకమై గోచరించు ఏకైక తత్త్వము, ఆమె యనంతశక్తిమయి కావున శారీరకము, మానసికము, నైతికము, పారమార్థికమునగు నానావిధ శక్తులతో నొప్పజీవజగత్తులుగా గోచరించుచున్నది. వేదాంతులు బ్రహ్మమనునది నా జగజ్జననియేగాని వేఱుగాదు. నిర్గుణబ్రహ్మము యొక్క సగుణస్వరూప మామెయే.
సర్వం ఖల్విదం బ్రహ్మ లేక సర్వం విష్ణుమయం జగత్
863. పృథక్కరణమనియు, సమీకరణమనియు విచారము రెండు విధములు. మొదటిది దృశ్య ప్రపంచమునుండి మనలను బ్రహ్మము కడకు గొనిపోవును; రెండవ దానివలన బ్రహ్మమెట్లు ప్రపంచముగా వ్యక్తమగునో తెలియనగును.
864. సమాధిస్థితిలో బ్రహ్మసాక్షాత్కారము పొందినవారు సైతము సామాన్యమైన బహిఃప్రజ్ఞకు దిగివచ్చి సగుణబ్రహ్మానుభవము నొందుటకు దిగినంత మాత్రము అహంకారము గలిగియుందురు. సప్తస్వరములలో ‘‘ని’’ అను ఉచ్చైస్స్వరమునందే సదా కంఠ ధ్వని నిలుపుట కష్టసాధ్యము. కావుననే సగుణదైవతమున భక్తియొక్క ఆవశ్యకత.
865. సమాధి స్థితినుండి బహిఃప్రజ్ఞకు దిగివచ్చువానికే తన దివ్య చక్షువును నిలుపుకొన జాలినంత మాత్రము అహంకారము రేఖామాత్రముగ నిలిచి యుండును. ఇయ్యది రివానిని తనతో గూడ జీవజగత్తుల నొకే బ్రహ్మముయొక్క వివిధ రూపములుగా గాంచుటకు సమర్థుని జేయును. జడ సమాధియందు, లేక నిర్వికల్పసమాధియందు నిరాకార నిర్గుణ బ్రహ్మసాక్షాత్కారమును.
చేతన సమాధి యందు. లేక సవికల్ప సమాధి యందు సాకారసగుణ బ్రహ్మసాక్షాత్కారమును బడసిన వానికి మాత్రమే ఈ భవ్యదర్శనము లభించును. అహంకారముతో నీవొక వ్యక్తివై యున్నంతవఱకు- నేను ఫలాని వ్యక్తిననుభావము కలిగియున్నంతవఱకు- భగవంతుని నీ వొక వ్యక్తిగా దప్పమఱియొక విధమున భావన చేయజాలవు. దర్శింపజాలవు; అంతవరకు నిరుపాధిక (నిర్గుణ) బ్రహ్మమునకు బాహ్యాభ్యంతరములందు సోపాధికముగ- సగుణబ్రహ్మముగ- గోచరింపక తప్పదు. ఈ సుగుణ బ్రహ్మస్వరూపములు నీ మనశ్శరీరములకంటెను బాహ్యప్రపంచముకంటెను సత్యత్వమును దీసిపోవునవి కావు. సరికదా, వీనియన్నిటికంటెను కోటిరెట్లు వాస్తవములు.

- ఇంకాఉంది