సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

866.బ్రహ్మమునకు జీవజగత్తులకునుగల సంబంధము అనులోమ విచారమునకును విలోమ విచారమునకును గల సంబంధము వంటిది. జీవ జగత్తులను విడిచి పరబ్రస్మము వైపునకు మరలినచో, నీ వ్యక్తిత్వము బ్రహ్మమున లయించును. ఇదియే సమాధి. బ్రహ్మజ్ఞానముతో- ఈ దివ్య వ్యక్తిత్వముతో- నీవు బయలుదేరినచోటికే మరలితివా,
జగత్తును నీ వ్యక్తిత్వమును గూడా ఆ పరబ్రహ్మమునుండియే వ్యక్తమగుచున్నవని- బ్రహ్మము, జీవుడు, ప్రకృతియు తుదకొక్కటియేయని- వీనిలో దేనిని తత్త్వతః తెలిసికొనినను మిగిలిన వానినన్నింటిని దెలిసికొనినట్లేయని- నీకు అనుభూతమగును.
867. ఈ జగల్లీల ఎవనిదో నిత్యత్వమును వానిదే. మరియు నెవ్వడు నిత్యుడో వాడే లీలారూపుడు. లీలామూలముననే నీవు నిత్యుని గనుకొనగలవు. మరియు నిట్టి సమ్యగ్దర్శనము లభించినంతనే లీల యిక నెంతమాత్రము మిథ్యగా గాన్పింపదు. దృశ్యప్రపంచమున నిత్య స్వరూపమై గోచరించును.
868. పండునందలి గుజ్జు, చిప్ప, గింజలు- ఇవన్నియు నొకే విత్తనమునుండి పుట్టుచున్న రీతిని చేతనము, అచేతనము, భౌతికము, ఆధ్యాత్మికమునగు నీ సృష్టి జాతమంతయు నొకే బ్రహ్మమునుండి యుద్భవించుచున్నది.
869. శ్రీగురుదేవుడిట్ల వచించువాడు: ‘‘నేను సర్వము అంగీకరింతును. తురీయము, జాగరము, స్వప్నము,సుషుప్తి, బ్రహ్మము, జీవుడు,సృష్టి- వీనినన్నిటిని నేనంగీకరింతును. లేనిచో పరిపూర్ణతకు లోటు కలుగును. కావున నాకు బ్రహ్మమును దృశ్య ప్రపంచమును కూడా సమ్మతములే.’’.
870. బ్రహ్మమొక్కడే సత్యమైన పక్షమును జీవులచే గలుగు నీభేదములతోడను తారతమ్యముతోడను గూడిన రుూ జగత్తు ఎట్లు సంభవించినది? ఈ రహస్యమును దెలుపుచు శ్రీగురుదేవుడిట్లు వచించును: ‘‘ఇది వానిలీల, మహాలీల! రాజునకు నలువురు కుమారులుండవచ్చును. వారందరును రాజకుమారులే- యువరాజులే. కాని వారు ఆడుకొనునపుడొకడు మంత్రియగును. ఒకడు (పోలీసు) జవానగును, మరియొకడు మరియొకడగును. రాజకుమారుడే ఐనను జవాను వలె నటించుచున్నాడు.
సాకార బ్రహ్మము: నిరాకార బ్రహ్మము
871. ‘‘అయ్యా, ఏది గొప్పది? సాకార బ్రహ్మమా, నిరాకార బ్రహ్మమా?’’అని యొకరు ప్రశ్నింప, శ్రీగురుదేవుడిట్లు సమాధానించెను. ‘‘నిరాకార తత్త్వజ్ఞానము పక్వమని, అపక్వమని రెండు విధములుగానున్నది.ఇందు ప్వమగునదే గొప్పది. దానిని సాకార బ్రహ్మమూలముననే పొందవలయును.
బ్రహ్మమతస్థులవలభించు అపక్వమైన నిరాకార బ్రహ్మ భావన కేవలము కండ్లు మూసికొనుటచే గోచరించు చీకటి వంటిది.
872. సాకారుడాతడే, నిరాకారుడు నాతడే. మరియు నాతడు సాకార నిరాకారాతీతుడు. వాని తత్వమంతయు వానికే తెలియును.
873. బ్రహ్మముయొక్క సాకార స్థితి ఎట్టిదో మీకు తెలియునా? అది నీటినుండి బుడగలు వచ్చుటవంటిది. వివిధ రూపములన్నియు చిదాకాశమునుండి వెలువడుచున్నట్లు ప్రత్యక్షముగా గాంచవచ్చును. ఈ రూపములో భగవతారమొకటి.
874. భగవాన్ సాక్షాత్కారము నొందిననేకాని ఇదియంతయు బోధపడదు. భక్తుల నిమిత్తము భగవానుడు వివిధ రూపములను దాల్చును. (రంగుల) అద్దకమున చిత్రమైన పద్ధతి నవలంబించువాడొకడుండెను. అద్దకముకోసము తనయొద్దకు వచ్చువారితో అతడు, ‘‘మీ బట్టల కేరంగు అద్దవలయును?’’అని యడుగువాడు. ఎఱ్ఱరంగు కావలయునన్నచో, తన తొట్టెలో అతడు బట్టను ముంచి, ‘‘ఇదిగో, మీ బట్టకు ఎఱ్ఱరంగువేసినాను’’అని వెలికిదీసి చూపువాడు. మఱియొకడు పచ్చరంగు వేయవలయుననిన, ఆతడదే తొట్టెలో బట్టను ముంచి పైకి దీయుసరికి అది పచ్చగా నుండెడిది. ఇదేవిధమున నీలి, నారింజ, ఊదా, ఆకుపచ్చ మొదలైన ఏ రంగు వేయవలసినను ఆతడు అదే తొట్టెను అదే ప్రకారము వినియోగించువాడు.

- ఇంకాఉంది