సబ్ ఫీచర్

నియామకాలపై నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పారదర్శకత, స్పష్టత లోపిస్తున్నది. ఉద్యోగ నియామక ప్రక్రియలలో ప్రభుత్వ విధానం రానురాను మోసపూరితంగా మారుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ప్రభుత్వం అసలు ఎటువంటి నిబంధనలు, నియమాలు పాటించడం లేదు. ఉద్యోగ నియామక ప్రక్రియలలో చివరకు నోటిఫికేషన్ ప్రక్రియ కనుమరుగవుతున్నదంటే మన ప్రభుత్వాల పనితీరు, చేతగానితనం ఇట్టే అర్ధమవుతుంది. తీవ్రమైన లొసుగులతో నిరుద్యోగులను మోసపుచ్చేలా ప్రభుత్వ ఉద్యోగ నియామక బోర్డులు పనిచేస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
ఉన్నతచదువులు చదివినా, తెలివీ, నైపుణ్యత కలిగినా నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులుగానే మిగిలిపోవలసిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ విధానాల్లో లోపాలు, బాధ్యతా రాహిత్యం వలన సర్కారీ కొలువులు నిరుద్యోగుల దరి చేరడం లేదు. చాలావరకు ప్రభుత్వ సంబంధిత ఉద్యోగ నియామకాలు అసలు నోటిఫికేషన్ వెలువరించకుండానే జరుపుతుండటం విశేషం. ఒక వేళ నియామకపు పరీక్షలు నిర్వహించినా అర్ధాంతర న్యాయపర చిక్కులు, లొసుగులతో ఉంటున్నాయి. నియామక తతం గం సంవత్సరాలపాటు సాగదీయడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారుతోంది.
ఫలితాలు ప్రకటించి గుట్టుగా నియామకాలు జరుపుతున్నారు. ప్రభు త్వం ఉద్దేశ్య పూర్వకంగానే నిరుద్యోగులతో చెలగాటమాడుతోంది. ప్రభు త్వం తన అసమర్ధతను కప్పిపుచ్చుకొనేందుకు నిరుద్యోగులతో చెలగాటమాడే చట్టాలను అమల్లోకి తెస్తుండటం విడ్డూరం. కష్టపడి పిజీ, వృత్తి విద్యాశిక్షణా డిగ్రీలు పూర్తిచేసినా ఉద్యోగ అర్హతా పరీక్షలు, ఎలిజిబిలిటి సెట్‌లు నిర్వహిస్తుండటం దారుణం. ప్రస్తుత కాలంలో ఉద్యోగ సాధన గగనంగా మారిపోయింది. ప్రభుత్వ అధికార మరియు రాజకీయ ప్రభుత్వ పెద్దల పలుకుబడి కలిగిన అక్రమార్కులకే ఉద్యోగాలు అందుతున్నాయి. ఉన్న ఉద్యోగాల్లో కోత విధిస్తుండటం, ప్రత్యక్ష నియామకాలు జరపక పోతుండటం నిరుద్యోగుల సంఖ్యను పెంచుతోంది. వివిధ శాఖల ఉద్యోగులను ప్రమోషన్ల పేరుతో సంబంధం లేని శాఖల ఉద్యోగాలలో వాటాలు కల్పిస్తుండటం దారుణం. ఒప్పంద పద్ధతి (కాంట్రాక్టు) నియామకాలతో నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. కావున ప్రభుత్వాలు బాధ్యతతో వార్షిక పట్టికకు అనుగుణంగా చట్టపర చిక్కులు, లొసుగులకు తావులేని స్పష్టతతో కూడిన ప్రభుత్వ నియామకాలు జరపాలి.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు పేరుకుపోతున్నా వాటి భర్తీకి సత్వరం చర్యలు చేపట్టకపోవడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయ. పదవీ విరమణ చేసిన వారి స్థానే కొత్తవారి నియామకాలు జరగకపోవడం వల్ల, సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గిపోయ, వివిధ ప్రభుత్వ కార్యకలాపాలు సత్వ రం పూర్తికాకపోవడం సహజమైపోయంది. ప్రభుత్వం చేస్తున్న తప్పిదా లకు ప్రజలు బాధలు పడాల్సి వస్తున్నది. ప్రభుత్వ పరంగా అందాల్సిన సేవలు సత్వరం అందకపోవడానికిగల కారణాల్లో సిబ్బంది కొరత ప్రధానమైంది. దీనికి పరిష్కారం ఎప్పటికప్పుడు అవుతున్న ఖాళీలను సత్వరం భర్తీ చేయడమే. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందేది ఉద్యోగుల ద్వారానే కాబట్టి, ప్రభుత్వం వీరి నియామకాలు తనకు భారమని భావిం చడం తగదు. ప్రభుత్వమున్నదే ప్రజల సేవకు. అందుకు తగిన యం త్రాంగం ఉద్యోగులే. మరి వీరి నియామకాల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, పారదర్శకంగా వ్యవహరించకపోవడం వల్ల నిరుద్యోగులకు ఉపాధి లభించకపోవడం ఒక నష్టం కాగా, తగిన సేవలందక ప్రజలు ఇబ్బందులు పడటం మరో నష్టం. అందువల్ల ఉద్యోగ నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదు.

- డి.చాంద్ బాష