సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదియంతయు గనిపట్టుచుండిన యొకడు రంజకుని యొద్దకు వచ్చి యిట్లనెను: ‘‘మిత్రుడా, నాకేరంగునందును ప్రీతి లేదు. నీయభిరుచిని దెలిసికొని నాబట్టకు నీ యిచ్చవచ్చిన రంగు వేయించుకొనుటయే నాయభీష్టము’’. భక్తుని యభీష్టము నుసరించి సాకారుడుగా గాని, నిరాకారుడుగా గాని భగవానుడు వానికి సాక్షాత్కరించును. దివ్యదర్శనములు సాపేక్షములు, అనగా వివిధ పరిస్థితులలోనున్న వివిధ వ్యక్తుల మనోభావముననుసరించి యవి యథార్థములై యొప్పుచుండును. తన రంగేదియో ఆ దివ్య రంజకునికొక్కనికే తెలియును. వాని దివ్యరూపములకెవ్వరును పరిమితిని గల్పింపజాలరు- ‘్భగవంతుడు ఈ రూపమున ప్రత్యక్షము అగును, ఆ రూపమున కానేరడు’అని యెవ్వరును నిర్ణయింపజాలరు.
875. ఒక బైరాగి (పూరీ) జగన్నాథదేవాలయమును దర్శించెను. భగవంతుడు సాకారుడా, నిరాకారుడాయని వాని సంశయము, జగన్నాథుని దివ్య విగ్రహమును పరీక్షించి యాతడు తన సంశయమును నివర్తించుకొనదలచెను. అంతనాతడు తన దండమును ఎడమవైపునుండి కుడివైపునకు బోనిచ్చి విగ్రహమును తాకునేమోయని చూచెను. కొంత సేపు వానికేమియు గోచరింపలేదు, దండముతో దేనిని తాకలేకపోయెను: దానివలన భగవంతుడు నిరాకారుడని నిశ్చయించుకొనెను. కాని మఱల కుడినుండి యెడమవైపునకు దండమునుబోనిచ్చి చూచినంతనే అది విగ్రహమును తాకెను. అంతనాతడు భగవంతుడు సాకారుడు, నిరాకారుడు కూడనని నిశ్చయించుకొనెను.
876. గంట వాయించునప్పుడు వినవచ్చు గణగణ ధ్వనులను ఒక దానినుండి మఱియొకదానిని వేర్వేరుగా దెలిసికొనవచ్చును. ఎట్లన, అయ్యని ప్రత్యేక రూపములు గలవియో యనునట్లుతోచుచుండును. కాని వాయించుట మానినంతనే నిరాకారమై తోచు సస్పష్టమైన ధ్వని కొంతసేపటివఱకు వినవచ్చి క్రమముగా సమసిపోవును. గంటయొక్క రుూ ధ్వనులవలెనే భగవంతుడు సాకారుడు, నిరాకారుడుగూడనై వెలయుచున్నాడు.
877. సాకారబ్రహ్మము దర్శనీయము. ఔను, మన ప్రాణ స్నేహితునితోవలెనే భగవానునితో ముఖాముఖమున సంభాషింపవచ్చును, వానిని స్పృశింపవచ్చును.
878. బ్రహ్మము నిరాకారమని భావించుట మంచిదే, కాని ఆ భావన మాత్రమే సమంజసమనియు తదితరమంతయు విరుద్ధమనియు మాత్రము తలపరాదు. బ్రహ్మమును సాకారముగా భావించి ధ్యానించుటయు తత్తుల్యముగా సమంజసమే. కాని నీవు బ్రహ్మసాక్షాత్కారము పొందువఱకును నీ విశిష్ట్భావమునే నిలుపుకొనియుండుము. అటు పిమ్మట సర్వము నీకే విశదముకాగలదు.
879. భగవండుడే నిరామయము, నిత్యమునగు బ్రహ్మము, మఱియు నాతడే జగజ్జనకుడు. కాని శుద్ధసచ్చిదానందమయ మగు నఖండబ్రహ్మము అపారసాగరమువలె దుర్ర్గాహ్యము, దానిని మనము గ్రహింపబోయినచో, కొట్టుకొని తుదకందు మునిగిపోవలసినదే. కాని లీలామయమగు సాకారబ్రహ్మమునుగూర్చి భావించునెడల నీట మునిగిపోవువాడు మెల్లగా ఒడ్డునకు జేర్పబడునపుడు శాంతినిబొందు రీతిని సులభముగా మనము ప్రశాంతిని బొందగల్గుదుము.
880. భక్తిమార్గమున సాధకుకు ఒకానొక దానిలో భగవానుని సాకారునిగా భావించి సంతుష్టుడగును. అతడే మఱియొక దశలో భగవంతుని నిరాకారునిగా భావించుటచే సంతుష్టుడగును.
881. భగవానుడు భక్తునకు వివిధ రూపములతో సాక్షాత్కరించును. కాని సమాధి స్థితియందు అత్యుత్తమ జ్ఞానమును బొందగనువానికి మఱల ఆ భగవానుడే అఖండ నిరాకార బ్రహ్మమై గోచరించును. భక్తి జ్ఞానముల కిచట సామరస్యమమరుచున్నది.
882. మంచుగడ్డ ఘనీభూతమైన నీరే. అటులనే పరమాత్ముని దర్శనీయ రూపము భౌతికాకృతిని దాల్చిన అఖండ నిరాకారబ్రహ్మమే, వేఱుకాదు.

- ఇంకాఉంది