క్రీడాభూమి

ఎంతో నిరాశ చెందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింహామ్, జూన్ 13: న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం తమను ఎంతో నిరాశకు గురిచేసిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూశామని, కానీ, ఒక్క బంతి కూడా ఆడలేకపోవ డం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. అయితే, ఔట్‌ఫీల్డ్ బురదమయంగా మారిన పరిస్థితుల్లో ఆటను కొనసాగించకపోవడమే మేలని అభిప్రాయపడ్డాడు. తడిగా మారిన మైదానంపై ఆటగాళ్లు గాయాల బారిన పడే ప్రమాదం ఉంటుందన్నాడు. రెండు విజయాలతో తాము మెరుగైన స్థితిలో ఉన్నామని, పాకిస్తాన్‌తో ఆదివారం జరిగే పోరుకు సిద్ధమవుతామని చెప్పాడు. ఒకటి రెండు నెట్ సెషన్లతో తగినంత ప్రాక్టీస్ లభిస్తుందన్నాడు. ధావన్ ఎడమ బొటనవేలికి హెయిర్‌లైన్ ఫ్రా క్చరైందని, అతను పట్టీతోనే ఉన్నాడని చెప్పా డు. సెమీ ఫైనల్స్ మొదలయ్యే సమయానికి ధావన్ పూర్తిగా కోలుకొని, అందుబాటులో ఉంటాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మాట్లాడుతూ నాలుగు రోజులుగా తాము ఇక్కడే ఉన్నామని, ఒక్క రోజు కూడా సూర్యుడిని చూడలేదని వ్యాఖ్యానించాడు. వాతావరణం ఆటకు ఏ మాత్రం సహకరించలేదని వాపోయాడు. టిమ్ సౌథీ, హెన్రీ నికోల్స్ గాయాల నుంచి కోలుకుంటున్నారని, వారు త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తారన్న నమ్మకం తనకు ఉందనీ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరగబోయే తర్వాతి మ్యాచ్ కోసం అన్ని విధాలా సిద్ధమవుతామని చెప్పాడు. ఈ టోర్నీలో ఆడుతున్న బలమైన జట్లలో దక్షిణాఫ్రికా ఒకటని అన్నాడు. స్పష్టమైన వ్యూహాలతోనే ఆ జట్టును ఢీకొనాల్సి ఉంటుందని విలియమ్‌సన్ అన్నాడు.
ఇలావుంటే, ఈసారి వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌కు ఇది నాలుగో మ్యాచ్. వరుసగా 3 మ్యాచ్‌లను కైవసం చేసుకొని మంచి ఊపుమీద ఉన్న ఆ జట్టుకు నాలుగో మ్యాచ్ రద్దుకావడంతో పాయింట్లను పంచుకోవాల్సి వ చ్చింది. కాగా, భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లో లనూ విజయాలు నమోదు చేసి, కివీస్‌తో పో రుకు సిద్ధమైంది. వర్షం వెంటాడంతో, ఒక పాయింటుతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ