సబ్ ఫీచర్

నిలిచిన పిహెచ్‌డి నోటిఫికేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, వాణిజ్య, కమ్యూనికేషన్ వ్యవసాయ, వైద్య, కంప్యూటర్, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తాజాగా వస్తున్న మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి విశ్వవిద్యాలయం ఏటా పిహెచ్‌డి, ఎంఫిల్ సీట్ల భర్తీకి ప్రతిఏటా నోటిఫికేషన్ ఇవ్వాలి. 2009నుంచి పిహెచ్‌డి ప్రవేశాల్లో యుజిసి కొత్తవిధానాన్ని ప్రవేశపెట్టింది. దీనితో రీసెర్చ్ స్కాలర్‌లకు ఉత్సాహం కలిగింది. గతంలో ప్రవేశ పరీక్ష ఉండేది కాదు. ఏదైనా గుర్తింపు పొందిన పరిశోధన జర్నల్స్‌లో రెండు రిసెర్చ్ వ్యాసాలను ప్రచురించి, పర్యవేక్షకుడి అనుమతి వుంటే ఇంటర్వూలు నిర్వహించి ప్రవేశాలు ఇచ్చేవారు. దీనిలో గైడ్లకు దగ్గరి వారికి, అనర్హులకు డాక్టరేట్ వశం అయ్యేవి. నాణ్యత, పెద్దగా గుర్తింపు లేని జర్నల్స్‌లో రెండు వ్యాసాలు ప్రచురించిన వారికి గతంలో డాక్టరేట్ అడ్మిషన్లు ఇచ్చేవారు. దీనివల్ల పరిశోధనల్లో నాణ్యత లోపించి పైరవీకార్లకే పిహెచ్‌డి అడ్మిషన్లు పొందేవారని విమర్శలు వచ్చాయి. దాంతో దేశవ్యాప్తంగా పిహెచ్‌డి ప్రవేశాల విషయంలో భారీ సంస్కరణలను చేపట్టారు. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో పిహెచ్‌డి అడ్మిషన్లను ప్రవేశ పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని యుజిసి దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతిఏటా నోటిఫికేషన్ విడుదల చేసి ప్రవేశాలు ఇవ్వాలని సూచనలు చేసారు. ఇందులో తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలు ప్రవేశ పరీక్షల విషయంలో మార్గదర్శకాలు రూపొందించడంలో అస్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రతిఏటా నోటిఫికేషన్ రావడం లేదు.
రోజురోజుకు పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశోధనలు చేయాల్సిన సమయం వచ్చింది. ఇందుకోసం పరిశోధనలు కొత్త పుంతలు తొక్కాలి. దీనికి యూనివర్సిటీలు వేదికలుగా మారాలి. ఇంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పరిశోధనా రంగం ఇరు రాష్ట్రాల్లో కునారిల్లుతోంది. ప్రతి సంవత్సరం ప్రవేశాలు జరగక పరిశోధన అటకెక్కింది. యుజిసి పరిశోధనల కోసం ఎన్నో ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారు. యుజిసి నెట్ సీనియర్ రీసేర్చ్ ఫెల్లోషిప్, రాజీవ్‌గాంధీ జాతీయ ఫెలోషిప్, తదితర పది అంశాల్లో ఫెల్లోషిప్‌లు అందిస్తున్నారు. ఎంపికైన రీసెర్చ్ స్కాలర్లకు పరిశోధనలకోసం నెలకు 25 వేలనుంచి 35 వేలవరకు చెల్లిస్తు న్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఏటా భారీ ఎత్తున ప్రోత్సాహకాలను ఇస్తున్నాయి. ఐతే పిహెచ్‌డిలో ప్రవేశాలు ఉన్నవారికే ఇవి వర్తిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 75 శాతం విశ్వవిద్యాలయాలు ప్రతిఏటా పిహెచ్‌డి నోటిఫికేషన్‌ను జారీ చేయడంలేదు.
ఉదాహరణకు కాకతీయ విశ్వవిద్యాలయం 2009, 2012లో మాత్రమే నోటిఫికేషన్‌ఇచ్చారు. గత ఎనిమిదేళ్లనుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏ విశ్వవిద్యాలయం కూడా ప్రతి ఏటా నోటిఫికేషన్ విడుదల చేయడంలేదు. ఒక్క కాకతీయ విశ్వవిద్యాలయంలో 1500 పిహెచ్‌డి, 408 ఎంఫిల్ సీట్లు వున్నాయి. ఒక్కో విశ్వవిద్యాలయంలో 25నుంచి 40 విభాగాల్లో పీజీ కోర్సుల్లో విద్యనందిస్తున్నారు. ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త విధానం అమలులోకి వచ్చినప్పటినుంచి 4సార్లు ప్రవేశ నిర్వహించింది. కాకతీయ విశ్వవిద్యాలయం 2008, 2012ల్లో నోటిఫికేషన్లు ఇచ్చి ప్రవేశపరీక్ష నిర్వహించింది. ఎంఫిల్‌కు ఏడాదిన్నర, పిహెచ్‌డి పూర్తి చేయడానికి రెండున్నర ఏళ్ల కాల పరిమితి వుంటుంది. పర్యవేక్షణ అర్హత ఉన్న ఒక్కో ప్రొఫెసర్ దగ్గర ఆరుగురు పిహెచ్‌డి, ఎనిమిది మంది ఎంఫిల్ చేయడానికి అవకాశం ఉంది.
ప్రభుత్వాలు వెంటనే స్పందించి పిహెచ్‌డి నోటిఫికేషన్‌ఇచ్చి పరిశోధకులను ప్రోత్సహించాలి. అటకెక్కిన పరిశోధనలవల్ల విద్యార్థులు ఫెలోషిప్‌లు అందుకోలేక నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రతి ఏటా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పీజి విద్యార్థులు కోరుతున్నారు.

-రావుల రాజేశం