సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుడే దొంగను పోయి దొంగతనము చేయుమని ప్రేరేపించును; మరియు దొంగనుగూర్చి జాగ్రతపడుమని గృహస్థుని ఆతడే హెచ్చరించును. సర్వమునకు ఆతడే కర్త.
పదునెనిమిదవ ప్రకరణము
బ్రహ్మసాక్షాత్కారము
మనస్తత్త్వము: బ్రహ్మసాక్షాత్కారము
900. పంచభూతాత్మకమైన రుూ శరీరము స్థూల శరీరము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము- అనువానితో గూడుకొనునది సూక్ష్మ శరీరము. బ్రహ్మసాక్షాత్కారమును బడసి బ్రహ్మానందముననుభవించుట కనువగునదియే కారణ శరీరము. తంత్రములలో నిదియే ‘్భగవత తనువు’అని చెప్పబడుచున్నది. వీనియన్నిటికిని అతీతమగునదొకటి కలదు. అదియ ‘మహాకారణము.’
901. బాహ్యప్రపంచ స్ఫురణతో బద్ధమైయున్నప్పుడు మనస్సు స్థూల విషయములనే గమనించుచు, అన్నమయ కోశమున నెలకొనియుండును. ఈ కోశము అన్నముపై నాధారపడుజీవుని స్థూల కోశము. మనస్సు అంతర్ముఖమైనప్పుడు ఇంటి ద్వారమును బంధించి లోపలి గదులులోనికి బ్రవేశించినట్లగును; అనగా స్థూల శరీరమునుండి సూక్ష్మశరీరములోనికిని, అందుండి కారణ శరీరములోనికిని బ్రవేశించును; తుదకు మహాకారణమునుజేరును. ఆ స్థితియందు మనస్సు బ్రహ్మమున లయమగును- దానినిగూర్చి యేమియు జెప్పజాలము.
902. శ్రీచైతన్య దేవునకు మూడు విధములైన స్థితులుండెడివి: 1) మనస్సు స్థూలశరీరమునను సూక్ష్మశరీరమునను నెలకొనియుండునట్టి బోధావస్థ, 2) మనస్సు కారణశరీరమున కెగసి ‘కారణానందము’ననుభవించునట్టి యర్థబోధావస్థ 3) మూలమగు ‘మహాకారణము’న మనస్సు పూర్తిగా లయించునట్టి యంతర్ముఖ బోధావస్థ. లేక తురీయావస్థ.
ఈ స్థితులకును వేదాంతమున జెప్పబడు పంచకోశములకును మంచి పోలికగలదు. స్థూల శరీరమగునన్నమయ ప్రాణమయకోశములు, సూక్ష్మ శరీరమగు మనోమయ విజ్ఞానమయ శోకములు, కారణ శరీరమగు నానందమయ కోశము ననునవియే పంచకోశములు. మూల కారణము ఈ కోశములన్నిటికిని అతీతము. మనస్సు మూలకారణమున లయించునప్పుడాతడు (శ్రీ చైతన్యుడు) సమాధిస్థితుతగువాడు; ఇదియే నిర్వికల్పసమాధి, లేక జడ సమాధియని చెప్పబడును.
కుండలినీ శక్తి: ఆత్మప్రబోధము
903. కుండలిని ప్రబోధముగాంచినగాని ఆత్మప్రబోధముగలుగదు. కుండలినీశక్తి మూలాధార కమలమున నిద్రాణమైయుండును. ఆమె మేల్కాంచినప్పుడు సుషుమ్నయందు బ్రవేశించి స్వాధిష్ఠాన మణిపూరకాది పద్మములగుండాపోయి తుదకు సహస్రారమును జేరును. అప్పుడు సమాధిస్థితి లభించును. దీనినంతయు ప్రత్యక్షముగా గంటిని.
904. ‘మహావాయువు’మేల్కాంచి, చెంగున శిరస్సున కెగిరి వెడలుట బ్రహ్మసాక్షాత్కార లక్షణములలో నొకటి. అపుడు సమాధిస్థితి గలుగ బ్రహ్మదర్శనమగును.
905. కుండలినీ ప్రబోధమును వర్ణించుచు శ్రీ గురుదేవుడొకప్పుడిట్లు తెల్పెను: ‘‘ఒడలు జల్లుమన నొకానొకశక్తి పాదములనుండి శిరస్సున కెగయును. అది మెదటిని జేరకుండునంతవఱకు నాకు బాహ్యస్ఫురణ ముండును, కాని యది మెదటిది జేరినంతనే బాహ్య ప్రపంచ స్ఫురణ శూన్యమగును. చూచుటయు వినుటయు నాగిపోవునప్పుడిక మాటలాడుట మాట చెప్పెడిదేమి? ఇక మాటలాడువారెవరు? ‘నీవు, నేను’ అనువిచక్షణయే అదృశ్యమగును. (హృదయమున కంఠమును జూపుచు) ఇంతవఱకును, లేదా ఇంతవఱకును గూడ ఆ మహాశక్తి వెలువడి వచ్చునప్పుడు నాకు గోచరించునట్టియు ననుభూతమగునట్టియు విషయములనన్నిటిని మీకు జెప్పవలెనని నేనొక్కక్కప్పుడనుకొనుచుందును. ఆ స్థితిలో నేను మాటలాడగలను- మాటలాడుచుందును. (కంఠమును జూపుచు) కాని దీనిని దాటి యాశక్తి(ఇంకను పైకి) వెడలినంతనే ఎవ్వరో నా నోటిని మూసినట్లగును.

- ఇంకాఉంది