సబ్ ఫీచర్

‘కాళేశ్వరం’ రూపశిల్పి కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ తీసుకొంటున్న సత్సంకల్ప నిర్ణయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కొత్త ఆశలు చివురింప చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరు కానుండడం, గోదావరి, కృష్ణానదీ జలాలను సుహృద్భావ వాతావరణంలో ఉభయ రాష్ట్రాలూ వినియోగించుకోవటానికి అడుగులు ముందుకు పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం, తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుల స్వరూప స్వభావ ఆకృతులు వేరైనా, గోదావరి మిగులు జలాల సద్వినియోగానికి సంబంధించి అంతర్రాష్ట భారీ నీటిపారుదల ప్రాజెక్టులుగా గుర్తింపు పొందుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో లభించిన హక్కుగా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరానికి జాతీయ హోదా లభించినా, గత ఐదేళ్లలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత సమయోచితంగా దీక్షాదక్షతలతో నెట్టుకొచ్చినా 2019 నాటికి నిరాశే మిగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత చాకచక్యంగా 2016 ఆగస్టులో మహారాష్ట్ర ప్రభుత్వంతో కాళేశ్వరం నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోవడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ఎత్తిపోతల పథకానికి సెంట్రల్ వాటర్ కమిషన్- అంతర్రాష్ట్ర అంశం కావడంతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సంప్రదించి మంజూరు చేసింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి కూడా అనుమతులు లభించటంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది.
తెలంగాణ జీవనాడి...
తెలంగాణ ప్రాంత వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు దశాబ్దం నాటి తొలి ఆవిర్భావ చరిత్ర వుంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టు ‘డా. బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి’. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు 2008 నవంబరు 19న వై.ఎస్. శంకుస్థాపన చేసారు. 2007 జనవరి 31న ప్రాజెక్టు ప్రణాళికను జాతీయస్థాయిలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా, భారీ వ్యయమైనా వెనకడుగు వేసేది లేదని వై.ఎస్. ప్రకటించారు. నాడు రూ.40,300 కోట్లు అంచనా వ్యయంతో 16.4 లక్షల ఎకరాలను నీటితో తడపాలని నిర్ణయించారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో కరువుపీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే సత్సంకల్పంతో 2008లో మహారాష్ట్ర నుంచి సూత్రప్రాయంగా అంగీకారం వచ్చిన తరువాత కాల్వలు, సొరంగాలు, లిఫ్ట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు రు.1600 కోట్లు ఖర్చుచేసింది. వై.ఎస్. ఆకస్మిక మరణంతో ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వెనుక పడింది. 2012 మేలో ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ కార్యాలయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, పృథ్వీరాజ్ చవాన్ ఒప్పందంపై సంతకాలు చేసారు. అది తొలి అడుగు మాత్రమే.
నవ తెలంగాణ అస్తిత్వం, పునరుత్తేజం లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరీ జలాల సద్వినియోగానికి జీవనాడిగా కాళేశ్వరం ప్రాజెక్టును సాఫల్యం చేశారు. ఈ ప్రాజెక్టుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల ఒప్పందం చరిత్రాత్మకమైంది. కేసీఆర్ దీక్షాదక్షతలను ప్రతిబింబింపచేస్తున్న కాళేశ్వరం ప్రపంచంలోనే అగ్రగామి ప్రాజెక్టుగా అద్భుత విజయం నమోదు చేసింది. సమీకృత బహుళార్థ సాధక ప్రాజెక్టుగా జాతీయాభివృద్ధిలో భాగస్వామిగా, తెలంగాణ పేద రైతాంగం కలల సాఫల్యంగా నేడు వెలుగులు విరజిమ్ముతోంది. 2020 నాటికి తెలంగాణ రాష్ట్ర బడ్జట్ రు.2 లక్షల కోట్లు సంపన్నత సాధించే అద్భుత లక్ష్యసాధనకు కేసీఆర్ సారధ్యం వహిస్తున్నారు.
జాతీయ హోదా...
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినట్టుగా, తెలంగాణ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. రు.80,500 కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులతో ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇస్తూ, 90 శాతం వ్యయం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న విధంగానే- తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించే ప్రయత్నంలో తలమునకలవుతోంది. ఈ ప్రాజెక్టుకు నిధులను అందుబాటులో పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా పరిణమించినా, కేసీఆర్ ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. తెలంగాణలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే వాటి నిర్వహణకు 11,500 మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరమని, వాటికి కరెంటు బిల్లు 10వేల కోట్లు పైబడినా వెనుకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి అంటున్నారు.
కేంద్ర జల వనరులశాఖ క్లియరెన్స్ ఇవ్వడంతోపాటు సాంకేతిక సలహా మండలి (టిఏసీ) సిఫారసు చేస్తే మార్గదర్శకాల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటిస్తామని నాటి కేంద్ర జల వనరులశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ రాజ్యసభలో అప్పటి తెరాస ఎంపీ డి.శ్రీనివాస్‌కు లిఖిత పూర్వక సమాధానం యిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్‌లను పరిశీలించిన జలసంఘం వాటిని ప్రాజెక్టు అథారిటీ వర్గాలకు పంపింది. ఇక ప్రధాని మోదీ కరుణ తెలంగాణపై ప్రసరించాలి.

-జయసూర్య