సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

920. జ్ఞానాజ్ఞానములకు అతీతుడవుకమ్ము. అనేకత్వము యొక్క స్ఫురణయే అజ్ఞానము,- అనగా ఏకత్వమును గ్రహింపక- అద్వితీయ బ్రహ్మము నెఱుగక- భిన్నత్వమును జూచుటయే అజ్ఞానము. ‘నేను విద్యావంతుడ’నను నహంకారము అజ్ఞానమువలన గలుగును. భగవంతుడు సర్వాంతర్యామియను ఎఱుక, అట్టి నిశ్చయము,- అనేకత్వమునం దేకత్వము కలదను వాస్తవదృష్టి- ఐక్యజ్ఞానమనబడును. భగవంతుని చక్కగా దెలిపికొనుటయే విజ్ఞానము.
నీ కాలికి ముల్లుగ్రుచ్చుకొనిన దనుకొనుము. దాని నూడదీయుటకు మఱియొక ముల్లు కావలయునుగదా? ఊడదీసిన తర్వాత రెంటిని ఆవల బాఱవేయుదువు. కాబట్టి అజ్ఞానమను ముల్లు ఊడదీయుటకు జ్ఞానమను ముల్లుతెత్తువు; పిమ్మట అఖండ బ్రహ్మసాక్షాత్కారమునకై జ్ఞానాజ్ఞానములు రెంటిని గూడ త్రోసిరాజందువు. బ్రహ్మము జ్ఞానాజ్ఞానములు రెంటికిని అతీతముగదా!
లక్ష్మణుడు తన దివ్యసోదరుడగు శ్రీరామచంద్రునితో ఇట్లనియెను: ‘‘అన్నా! వసిష్ఠ దేవునివంటి బ్రహ్మజ్ఞాని తన కుమారులు మరణించినందులకై విలపించుచు నోదార్పబడకుండుట ఆశ్చర్యముకాదా?’’ రామచంద్రుడిట్లు సమాధానమొసగెను: ‘‘లక్ష్మణా! సాపేక్షమైన (బ్రహ్మ) జ్ఞానముగలవానికి సాపేక్షమైన అజ్ఞానముగూడ నుండునని మదినుంచుకొనుము.’’
వస్తుతః అట్టివానికి బ్రహ్మము విషయమై అజ్ఞాన(లేక)ము ఉండక మానదు. ఏలన, ఇందు జ్ఞానాజ్ఞానములు సాపేక్షములు- పరస్పర సంబద్ధములు, ఎట్లన, లోకమున ఏకత్వమునుగూర్చిన జ్ఞానమనగానే భిన్నత్వమును గూర్చిన జ్ఞానము స్ఫురించుచునే యుండును; వెలుతురును గూర్చిన ఎఱుకగలవానికి చీకటిని గూర్చిన ఎఱుకయు నుండుడుగదా?
నరుడు తన పరిమితశక్తిననుసరించి చూచిన యెడల బ్రహ్మము జ్ఞానాజ్ఞానములకును, పుణ్యపాపములకును, సుకృత దుష్కృతములకును, శౌచాశౌచములకును (సమస్త ద్వంద్వములకును) అతీతమై కన్పట్టును.
ఒక జిజ్ఞాసువు: దేవా! తాముచెప్పు జ్ఞానాజ్ఞానములను ముండ్లను రెంటిని త్రోసిరాజనిన పిమ్మటనేమి మిగులును?
శ్రీగురుదేవుడు: ఏమున్నది? నిత్యశుద్ధ బుద్ధస్వరూపమే మిగులునది. కాని నీకు నేను దానిని బోధపఱచుటెట్లు? నేతి రుచి యేమని నిన్నొకరు అడుగుదురనుకొనుము. దానిని పూర్తిగా బోధపఱచుట నీకు సాధ్యమగునా? ‘‘నేతి రుచి సరిగా నేతి రుచియే’’యని చెప్పుడయేగదా నీవు చేయగలిగినపని? ఒక కన్య తన స్నేహితురాలినొకప్పుడిట్లడిగెను: ‘‘నీ మగడు వచ్చినాడుగదా, వానిని కలిసికొనునప్పుడెల్ల నీకు గలుగు నానందమెట్టిదో నాకు చెప్పవా?’’ అందులకు పెండ్లియాడిన బాలిక యిట్లు సమాధానమొసగెను: ‘‘ఓసీ! నీ మగడు వచ్చిన పిమ్మట నీకంతయు బోధపడునులెమ్ము; నేనిప్పుడు దానిని
నీకు బోధపఱచుటెట్లు?’’

- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి