సబ్ ఫీచర్

కూతుళ్ళకు కోపమొస్తే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది తల్లిదండ్రులు తమ పుత్రరత్నాల చేత బాధించబడటం, వేధించబడటం చూస్తూంటాము, వింటుంటాము. అలాగే తమ కుమార్తెల చేత బాధించబడుతున్న తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. కానీ కొడుకులపై పితూరీలు చేసినంత సులభంగా కూతుళ్ళపై చెయ్యలేరు. బాహాటంగా చెప్పుకోలేరు.
తమ అలుళ్ళ ప్రభావంతో అలా కొంతమంది కూతుళ్ళు ప్రవర్తిస్తే, మరికొన్నిచోట్ల అల్లుళ్ళు మంచివాళ్ళయినా స్వార్థంతో కూతుళ్ళు తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు.
అలాగని అందరూ అలా చెడుగా వ్యవహరిస్తారనిగాదు. కానీ కొంతమంది కూతుళ్ళు దురాశతో చేసే ఆగడాలను చూశాక ఇలా అభిప్రాయపడవలసి వచ్చింది.
కొడుకుల చేత నిరాదరించబడిన తల్లిదండ్రులను ఆదరించి, అక్కున చేర్చుకుని పూజిస్తున్న కూతు ళ్ళు ఉన్నారు.
వారి మాట అటుంచితే- ఆస్తులకోసమో, మర్యాదల కోసమో, కానుకల కోసమో తల్లిదండ్రులను క్షోభకి గురిచేస్తున్నవాళ్ళూ ఉన్నారు.
పెట్టి పోతల్లో తక్కువ చేశారని కొందరు; తమ భర్తలకు పుట్టింట్లో సరైన మర్యాదలు జరగలేదని మరికొందరు, తల్లి దగ్గర వున్న బంగారం ఇవ్వలేదని కొందరు, ఆస్తిపాస్తుల పంపకంలో అన్నదమ్ములకు తమకంటే కొంత శాతం ఎక్కువ ఇచ్చారని మరికొందరు కన్నవాళ్ళపై కినుక వస్తుంటారు.
ఇదంతా కొంత విడ్డూరంగా కన్పిస్తుంటుంది. కష్టానష్టాలను ఎదుర్కొంటున్న తమ సోదరుణ్ణి ధనరూపంలో ఆదుకున్నారని మరికొందరు కక్ష సాధింపు చర్యలు చేబడుతుంటారు.
వాళ్ళు వృద్ధాప్యంలో చావుబ్రతుకులమధ్య ఉన్నారని తెలిసినా, కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళని కఠిన హృదయులు. ఏళ్ళతరబడి తమ పుట్టింటి గడప త్రొక్కకుండా, కన్నవాళ్ళని తమ గడపలోకి రానివ్వని కూతుళ్ళు ఉన్నారు. తమ ప్రవర్తనతో వృద్ధులైన కన్నవాళ్ళకి మానసిక క్షోభకి గురిచేస్తుంటారు. కన్న తల్లిదండ్రులకంటే వారికి మాట పట్టింపులే ఎక్కువైనట్లున్నాయి.
ఎప్పుడో ఏదో చేశారని మనస్సులో పెట్టుకుని అసలు తల్లిదండ్రుల పొడే గిట్టనివాళ్ళున్నారు. పుట్టింటిపైగల మమకారాన్ని చంపుకుంటున్నారు. వారి ఆదరణను కోల్పోతున్నారు. తమ ఇంట జరిగే శుభకార్యాలకు వారిని పిలవటంలేదు. పుట్టింట జరిగే శుభకార్యాలకు వెళ్ళటంలేదు. వారిని దూరంగా ఉంచుతున్నారు.
పుట్టింటివాళ్ళు ఆదరించినా ఆదరించకపోయినా కానుకలు గట్రా ఇచ్చినా ఇవ్వకపోయినా.. ఆడపిల్లలు పుట్టింటివారిపై ఎంతో అపేక్షను కలిగి ఉండటం సహజం.
కాని అదేమిటో కాల ప్రభావమో ఏమిటోగాని యిలా స్వార్థబుద్ధితోనూ, ప్రేమాభిమానాల లేమితోను విచక్షణారహితంగా తల్లిదండ్రులపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమరహితంగా జీవిస్తున్నారు.
ఒక్కసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే.. తమ బాల్యంలో తల్లిదండ్రులు తమపట్ల చూపించిన ప్రేమ, చేసిన సేవలు, చదువులకోసం, తమ పెళ్ళిళ్ళకోసం పడిన బాధలు.. చేసిన త్యాగాలు ఒక్కసారి గుర్తుచేసుకుంటే ఇలా ప్రవర్తించరేమో. రేపు తమ పిల్లలు కూడా ఇలాగే ప్రవర్తిస్తే తమ పరిస్థితి ఏంటో ఆలోచించాలి మరి.

- పి.షహనాజ్ 93462 63070