సబ్ ఫీచర్

సంస్కృతి పరిరక్షణకే పుష్కరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలం జీవనాధారం. మన శరీరంలో 90 శాతం నీరు, మిగతా 10 శాతం సేంద్రియ, కార్బనిక పదార్ధాలే ఉన్నాయ. తాగడానికి నీరు కావాలి. శరీరం వాడుకునే వస్తువులకు, శుభ్రతకు నీరు కావాలి. మనం ఇంటి నిర్మాణం దగ్గరనుంచి ఏ పనులు చేపట్టాలన్నా నీరు కావాలి. నాణేనికి రెండో ప్రక్క చూస్తే- నీరు మలినమైతే ఎన్నో అనారోగ్యాలు వచ్చి, ప్రాణాంతకమూ కావచ్చు. అపరిశుభ్ర నీటి ద్వారా అనారోగ్యాలు విస్తరిస్తాయి. మనల్ని రోగాలపాలు చేస్తే సూక్ష్మజీవులు, కాటకాలు లాంటివి పెరుగుతాయి. అందుకే నీరు జీవానికే కాదు, నిర్జీవం కావడానికి కారణమవుతోంది. నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు! అన్నట్లు నీరు ఎతె్తైన పర్వతాల మీద నుంచి నేలమీదికి, నేలమీద పల్లపు ప్రాంతాలకూ ప్రవహిస్తుంటుంది. ప్రవాహ వేగంలో అడ్డంగా వున్నవన్నీ కొట్టుకుపోవడం సహజం. ప్రకృతి వైపరీత్యాలు.. వరదలు లాంటి ఉపద్రవాలు తప్పవు. నది నీరు తగ్గిందని, దాని ప్రవాహ ప్రాంతాలలో నివాసాలు కట్టుకుంటే, ఎప్పుడైనా ప్రమాదమే. దాని దారులు దాని దారులే!!
అప్పట్లో నీరు సమృద్ధిగా లభించే నదీ తీర ప్రాంతాలలో జన జీవనం ఎక్కువగా ఉండేది. సంస్కృతి, సంస్కారాలు కూడా తీర ప్రాంతాలలో బాగా వృద్ధి చెందాయి. చాలా రాజ్యాలకు ముఖ్య పట్టణాలు నదీ తీరంలోనే ఉన్నా. నదీ తీరాలలోనే ఎన్నో రాజ్యాలు విలసిల్లాయి. అందుకే ఇప్పటికీ చరిత్రని చెప్పే ఆయా రాజుల, రాజ్యాల జ్ఞాపక చిహ్నాలు నదీ పరివాహ ప్రాంతాలలో ఎన్నో! ఆధ్యాత్మికతకు పుట్టిళ్లు పర్వతాలు, నదులు! నదీ గమనంలో మనకు ఎన్నో దేవాలయాలు దర్శనమిస్తాయి. ఆ దేవాలయాలలో పూజలు జరపడమంటే ఆ నదుల్ని పూజించడమే! మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి శుచి అయ్యేది ఆ నదులలోనే. దేవుళ్లని అభిషేకం చేసేది ఆ నీటితోనే.. మనం తీర్థంగా తీసుకునేది ఆ నీరే! ఆ నీటినే మనం మళ్లించుకుని భూమిని సస్యశ్యామలం చేసుకుంటున్నాం, ఆనకట్టల ద్వా రా, కాలువల ద్వారా నీటిని మళ్లించుకుంటూ. నీటిని మన ప్రాంతాలకు చేర్చేవి నదులే. మన దేశంలో ముఖ్యమైన నదులు పనె్నండున్నాయి. ఒక్కోదాని గురించి ఒక్కో సంవత్సరం పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ వెళ్లడానికి పనె్నండేళ్లు పడతాయి. పనె్నండేళ్లకోసారి ఒక్కో నదిని పరిపూర్ణంగా తలచుకుంటున్నాం. పరిపూర్ణంగా అనే మాటని మనం బాగా గుర్తుంచుకోవాలి. నదీ ప్రవాహం, నీటి శుభ్రత, చుట్టూ వుండే చారిత్రక, ఆధ్యాత్మిక గుర్తుల్ని కాపాడడంతోబాటు మన నమ్మకాల్ని నిర్విఘ్నంగా నిర్వర్తించుకోవచ్చు. వాటన్నింటినీ వదిలేసి మన నమ్మకాలతోనే పుష్కరాలని నడిపేస్తామనుకోవడం సరైన ఆలోచనా పద్ధతి కాదు.
నదీ ప్రవాహాన్ని దేవతగా కొలవడమంటే ఆ నీటి పవిత్రతని కాపాడాలి. ఎటువంటి కాలుష్యాలకు లోనుకాకుండా చూడాలి. అంతేగాని ... కాలుష్యాలతో నింపేయడం సబబా? దేవాలయాల్ని ఎంత పవిత్రంగా చూసుకుంటున్నామో నదీ ప్రవాహాన్నీ అంతే పవిత్రంగా చూసుకోవాలి. పూజించటమంటే పవిత్రతని కాపాడడమే! మనకి ఎంతో చరిత్ర ఉంది. చరిత్రహీనులం కాము. ఆ విషయాన్నీ నదీ పరివాహక ప్రాంతాలు చెబుతున్నా. చరిత్ర చిహ్నాలు చెరిగిపోతే చరిత్రని మన చేతలతో మనం చెరిపేసినట్లే! ఆ తర్వాత ఆ విషయాలు చెప్పినా ఆధారాలు లేకపోవడంతో కల్పిత కథలే అవుతాయి. కొన్ని నిర్మాణాలకు, పుష్కర సంబరాలు వస్తున్నాయని సున్నాలు, రంగులు పూసేస్తున్నారు. దాంతో క్రింద శాసనాలు, ప్రాచీనత మూసుకుపోతోంది. ఘాట్లని నీళ్లున్న ప్రాంతాలలోనే కట్టాలి. ఆ ఘాట్లని బట్టే ప్రజలలు ఆ ప్రాంతాలలో స్నానానికి వెళ్లాలి. స్నానాలు శుభ్రత కోసంగాని రోగాలు తెచ్చుకోవడానికి కాదు. ప్రభుత్వాలు పోటీ పడి ప్రజలనాకర్షించడమే గాక ఏర్పాట్లు తగ్గట్టు ఉండాలి. ఏదైనా ఉపద్రవం జరిగితే మచ్చ పుష్కరాలకి కలకాలం నిలిచిపోతుంది. ఇలా ప్రభుత్వం, ప్రజలు కూడా మనకి నీటినిచ్చే నదుల గురించి ఆలోచించడానికి పుష్కరాలు. పుష్కరాలంటే సంబరాలే కదా మనమెన్నో విషయాల్ని ఆలోచించాలని చెప్పే సందర్భాలు. ఇవన్నీ మనందరం గుర్తుంచుకుని కదలిననాడే పుష్కరాలు. చివరిగా ఒక మాట! పుష్కరకాలంలోనే ఆ నది గురించి ఆలోచించి, తర్వాత పనె్నండేళ్ళు పట్టించుకోకపోవడం.. సరైన పద్ధతా?

-డా. వేదగిరి రాంబాబు సెల్:9391343916