Others

‘అమ్మఒడి’తో సర్కారీ బడుల మూత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో రూ.15 వేలు జమచేసేలా ‘అమ్మఒడి’ పథకం అమలు చేస్తానని వైకాపా అధినేత జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అనంతరం ఆ హామీని అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచన మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ‘అమ్మఒడి’ వర్తింపజేస్తామని అధికారులు ప్రకటించారు. పేదవర్గాల తల్లిదండ్రులకు ఇదొక వరమే. ఇది ప్రభుత్వానికి అదనపుభారం అని చాలామంది అనుకోవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ.300- 400 కోట్ల వరకు నిధులు విడుదలవుతాయి. ఆ లెక్కలను సమగ్రంగా పరిశీలిస్తే ఏ ఒక్క జిల్లాలో కూడా పూర్తిస్థాయిలో పాఠశాలలకు గ్రాంట్లు వినియోగించిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. అలాంటప్పుడు ఆ నిధులను అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు వినియోగించుకునే అవకాశం లేకపోలేదని నిపుణుల అభిప్రాయం. అమ్మఒడి పథకాన్ని ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకూ వర్తింపజేయడం వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మనుగడ కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాహక్కు చట్టప్రకారం దారిద్య్రరేఖకు దిగువన వున్న 25 శాతం విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుకోవాల్సి వుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే ఆ 25 శాతం మందికే ‘అమ్మఒడి’ని వర్తింపజేస్తే బాగుంటుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపే మధ్యతరగతి కుటుంబీకులైతే తాము చెల్లించే ఫీజులకు కొంత డబ్బు కలిసొస్తుందని ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు. పట్టణాలు, నగరాల్లో వున్న ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి ద్వారా అందే మొత్తం ఫీజులకు చాలకపోవచ్చు. గ్రామీణ స్థాయిల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఏడాదికి రూ. 15వేలకే ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివించే వారు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1700 కంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తగినంత మంది విద్యార్థులు లేక ఇప్పటికే చాలా పాఠశాలలు మూతపడి, లక్షలు విలువ చేసే భవనాలు నిరుపయోగంగా వున్నాయి. చాలా ప్రాంతాల్లో 10 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు లేకపోలేదు. అమ్మఒడి పథకం ద్వారా లభించే నగదు ప్రోత్సాహకాలతో గ్రామీణ ప్రాంతాల వారు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చించే పరిస్థితి వుంది. ఈ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడే అవకాశాలు లేకపోలేదు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే, అమ్మఒడి పథకం వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడే అవకాశాలున్నందున ముఖ్యమంత్రి ఆశయం ఎలా నెరవేరుతుంది?

-నల్లమాడ బాబ్‌జాన్ 73827 12780