సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు చైతన్య స్వరూపుడగు భగవంతుడు చైతన్యమునకే సాక్షాత్కరించును.
సమాధి సంజనితమైన విజ్ఞానము
927. సమస్త ప్రకృతినుండియు వేఱుపఱిచి ఆత్మను దెలిసికొనుటయే జ్ఞానము. విచారముచే ప్రకృతిని తొలగించుటచే సమాధిస్థితి లభించును; అపుడు ఆత్మసాక్షాత్కారమగును.
విజ్ఞానమనగా పరిపూర్ణముగా దెలిసికొనుటయని భావము, కొందఱు జున్నునుగూర్చి కేవలము వినియుందురు, మఱికొందఱు కేవలము చూచియుందురు, ఇక గొందఱు రుచి చూచియుందురు. దానిని గూర్చి కేవలము వినియున్నవాడే అజ్ఞాని. చూచియున్నవాడో, జ్ఞాని; ప్రత్యక్షముగా రుచి చూచినవాడు విజ్ఞాని, అనగా ఆతడు పరిపూర్ణమైన జ్ఞానమునొందినవాడు. భగవంతుని దర్శించి, ఆప్తునితోవలె వానితో ఆంతరంగిక సంబంధము గలిగియుండుటయే విజ్ఞానమనబడును.
మొదట నీవు ‘నేతి, నేతి’-‘ఇది కాదు, ఇది కాదు’అనునట్టి విచార మార్గము నవలంబింపవలయును. బ్రహ్మము ఈ పంచభూతములును కాదు, ఇంద్రియములును కాదు, మనస్సును కాదు, బుద్ధియును కాదు, అహంకారమును కాదు- బ్రహ్మము ఈ తత్త్వములన్నిటికిని అతీతము. మేడ నెక్కవలయుననిన, ఒకటి వెంబడి నొకటిగా మెట్లను విడువవలయును. మెట్లే మేడ కావనుట నిజము. కాని నీవు మేడ నెక్కినంతనే ఏ యిటుకలు, సున్నము, ఇసుక మొదలగు వానితో మెట్ల వరుస నిర్మింపబడియున్నదో వానితోడనే మేడయు నిర్మింపబడియున్నదని కనుగొందువు; ఎయ్యది బ్రహ్మమో అ యేతత్త్వజ్ఞులు దెలుపు నిరువదినాలుగు తత్త్వములతోగూడిన జీవజగత్తులైయున్నది. ఏది ఆత్మయో అదియే పంచభూతములైయున్నది. ఆత్మనుండి వెలువడిన యెడల ఈ భూమి యింత గట్టిగా నెందులకున్నదని మీరడుగవచ్చును. ఈశ్వర సంకల్పమునకు సాధ్యముకాని దేదియు లేదు. శుక్ల శోణితములనుండి ఆస్థులును మాంసమును నిర్మితమగుటలేదా? సముద్రపు నురుగు ఎంత గట్టిపడుచున్నదో చూడుడు!
విజ్ఞానమునొందిన పిమ్మట మానవుని సంసారియై మనినను మనగలడు. ఏలన, ఆతడప్పుడు చరాచర ప్రపంచమంతయు బ్రహ్మమేయనియు బ్రహ్మము ప్రపంచమునకు బాహ్యముగా లేదనియు విస్పష్టముగా గాంచును. శ్రీరామచంద్రుడు విజ్ఞానమునుబొంది సంసారమున నుండ నిరాకరించినప్పుడు వసిష్ఠుడు ఇట్లుపల్కెను: ‘‘రామా! ప్రపంచము బ్రహ్మమునకు బాహ్యముగానున్న పక్షమున, నీవు దానిని పరిత్యిజింపవచ్చును.’’ అంత రామచంద్రుడు మాటాడక ఊరకుండెను. ఏలన, బ్రహ్మమునకు బాహ్యముగా నేమియులేదని రామచంద్రుడు లెస్సగా గ్రహించియుండెను.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి