సబ్ ఫీచర్

లాల్ త్యాగానికి సెల్యూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నతండ్రి ఇక లేడని తెలిసినా గుండె దిటవు చేసుకుని దేశం కోసం ఆడింది పంతొమ్మిది సంవత్సరాల భారత హాకీ క్రీడాకారిణి లాల్‌రెమ్సియామీ. మిజోరం రాష్ట్రానికి చెందిన లాల్‌రెమ్సియామీ భారత హాకీ మహిళల జట్టులో సభ్యురాలు. గత ఆదివారం ఈ జట్టు జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన హాకీ ఎఫ్‌ఐహెచ్ సిరీస్‌లో ఆతిథ్య జపాన్‌పై గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరి 2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అయితే ఫైనల్ మ్యాచ్ జరగడానికి రెండు రోజుల ముందు అంటే గత శుక్రవారం లాల్‌రెమ్సియామీ తండ్రి లాల్‌తన్సంగాజోత్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం లాల్‌రెమ్సియామీకి తెలిసినా స్వదేశానికి రాలేదు. తండ్రి ఆఖరిచూపుకు కూడా వెళ్లకుండా తన జట్టుకోసం పోరాడింది. 3నన్ను చూసి నా తండ్రి గర్వపడాలంటే నేను ఇక్కడే ఉండి టోర్నీ ఆడాలి2 అని తన కోచ్‌కు చెప్పిందట. అలా గుండెల్లో బాధను దాచుకునే జట్టుకోసం పోరాడింది. ఆమె త్యాగం వృథా కాలేదు. దేశం గర్వించేలా ఆ జట్టు హాకీ సిరీస్‌లో విజయ దుందుభి మోగించింది. అందుకే ఈ విజయాన్ని లాల్‌రెమ్సియామీ తండ్రికి అంకితం చేశారు జట్టు కెప్టెన్ రాంపాల్. నిన్న మెన్నటి వరకు లాల్‌రెమ్సియామీ ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ తండ్రి మరణాన్ని దిగమింగుకుని దేశం కోసం ఆడిన వనితగా నేడు ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకం. మంగళవారం స్వగ్రామానికి చేరుకుని, ఏడుస్తూ తల్లిని హత్తుకుంది లాల్‌రెమ్సియామీ.