సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మజ్ఞాని
వివిధ ముక్త పురుషులు
932. ప్రకృతి శాస్తమ్రు పరిమిత జ్ఞానమును మాత్రమే ఒసగగలదని జనులు గ్రహింపజాలకున్నారు. అఖండమగు నాత్మ సామ్రాజ్యమును గూర్చి యది మనకెట్టి సందేశము నీయజాలదు. అట్టి సందేశమును పురాణ ఋషిసత్తముల వంటి బ్రహ్మద్రష్టలు మాత్రమే మనకు దెలిపియున్నారు. ‘‘బ్రహ్మతత్త్వ మిట్టిది’’ అని చెప్పుటకు వారికి మాత్రమే అధికారముకలదు.
933. సిద్ధులు (ముక్తపురుషులు) లోకమున నై దువిధములుగా గాన్పించుచున్నారు. ఎట్లన:
1) స్వప్నసిద్ధులు- కలలో ప్రబోధము నొంది ముక్తులగువారు.
2) మంత్రసిద్ధులు- మంత్ర (జప) మూలమున ముక్తులగువారు.
3) హఠాత్ సిద్ధులు- ఆకస్మికముగా నిధి నిక్షేపములను గనుగొనియో, శ్రీమంతురాలిని పెండ్లియాడియో, ధనికుడయిన పేదవానివలె అకస్మాత్తుగా ముక్తులగువారు. ఇట్లే పాపాత్ములు అనేకులు ఎట్లో ఆకస్మికముగా పునీతులై ఆత్మసామ్రాజ్యమును బొందుదురు.
4) కృపాసిద్ధులు- భగవత్కృపచే ముక్తులగు వారు. ఒక డడవిని నఱుకుచుండగా వానికొక ప్రాచీన సరస్సో, భవనమో కాన్పించుననుకొనుడు. ఆతడిక కష్టనష్టముల కోర్చి వానిని నిర్మించుకొననక్కఱలేదు గదా? ఇదే తీరున అత్యల్ప కృషితోడనే అదృష్టవశమున ముక్తులగువారు కొందఱుందురు.

- ఇంకాఉంది