సబ్ ఫీచర్

మెతకవైఖరి ఫలితం ఇవ్వదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ పట్ల మెతక వైఖరిని అవలంభించినంత కాలం కశ్మీర్ సమస్య పరిష్కారం కాదనే వాస్తవాన్ని బి.జె.పి నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనిని భద్రతా దళాలు ఈ నెల 8 తేదీనాడు ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టిన మరుసటి రోజు నుండి కశ్మీర్ లోయ భగ,్భగ మండుతోంది. పాకిస్తాన్ ప్రేరిత అల్లరి మూకలు భద్రతా దళాలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి. కశ్మీర్ లోయ అశాంతికి నిలయంగా మారింది. కశ్మీర్ యువత భద్రతా దళాలతో రోజు వారీ యుద్ధం కొనసాగిస్తున్నారు. బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌లో మరణించటాన్ని పాకిస్తాన్ మరో అదనుగా తీసుకుని కశ్మీర్ లోయలో ఇస్లామిక్ తీవ్రవాద అగ్నికి ఆజ్యం పోస్తోంది. పాకిస్తాన్ ప్రోత్సాహిత వేర్పాటు సంస్థలు భద్రతా దళాలపై రాళ్లు రువ్వే ప్రతి యువకుడికి ప్రతి రోజు ఐదు వందల రూపాయల చొప్పున భత్యం చెల్లిస్తున్నాయి.
పాకిస్తాన్ పాలకులు వేర్పాటు ఉద్యమ నాయకులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయటంతోపాటు భద్రతా దళాలతో పోరాడే స్థానిక యువకులకు రోజు వారీ, నెల వారీ వేతనం చెల్లిస్తున్నారు. ఒక వైపు ఇస్లామిక్ తీవ్రవాదులకు ఆక్రమిత కశ్మీర్‌లో క్యాంపులు నిర్వహించటంతో పాటు వారికి ఆయుధాలు, మందుగుండు, ఆర్థిక సహా యం చేస్తూ మరోవైపు కశ్మీర్‌లోని వివిధ వేర్పాటు సంస్థల నాయకులను పోషిస్తూ యువతను భద్రతా దళాలపైకి ఉసిగొల్పేందుకు రక,రకాల ఎత్తులు వేస్తోంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై వ్యాఖ్యానిస్తూ కశ్మీర్ పాకిస్తాన్ అంతర్భాగం కావాలన్నది తన కల అంటూ చేసిన ప్రకటన చూస్తుంటే ఆయన తాజా ఆలోచన ఏమిటనేది కేంద్రానికి ఇంకా అర్థం కావటం లేదా? నవాజ్ షరీఫ్ కల ఏనాటికీ నిజం కాదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ గట్టిగా గడ్డి పెట్టింది. అయితే పాకిస్తాన్ పాలకులు మాటలకు మారుతారని ఆశించటం మన బుద్ధి తక్కువ పని అవుతంది.
పాకిస్తాన్ విషయంలో ఒక స్పష్టమైన కఠిన వైఖరిని అవలంభించనంత వరకు కశ్మీర్ పరిస్థితిలో మార్పు రాదు. లాహోర్‌కు అకస్మాత్తుగా వెళ్లి అల్పాహార విందులు చేయటం, అంతర్జాతీయ సమావేశాల్లో కలిసినప్పుడు కౌగిలించుకుని చర్చలు జరపటాన్ని పాకిస్తాన్ పాలకులు ఒక జోక్‌గా తీసుకుంటున్నారు. ఒక వైపు స్నేహం పేరుతో చర్చలు జరుపుతూనే మరో వైపునుండి ఇస్లామిక్ తీవ్రవాదం ద్వారా అనునిత్యం దాడులు కొనసాగిస్తున్న పాకిస్తాన్‌ను ఎక్కువ కాలం సహించటం మంచి విధానం కాదు. ఇటీవలి కాలంలో కాశ్మీర్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరగని రోజు లేదు. ప్రతి ఎన్‌కౌంటర్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులతోపాటు మన సైనికులు కూడా మరణిస్తున్నారు. పాకిస్తాన్‌కు కావలసింది కూడా ఇదే. వెయ్యి కోతలు (్థజెండ్ కట్స్) సిద్ధాంతంలో భాగంగా ఈ రావణ కాష్టం కాలుతూనే ఉండాలనేది పాకిస్తాన్ పాలకులు, సైన్యం వ్యూహం.
బుర్హాన్ వని భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మరణించిన మరుసటి రోజు నుండి కాశ్మీర్‌లో కొనసాగుతున్న గొడవల మూలంగా ఇంత వరకు దాదాపు యాభై మంది స్థానికులతోపాటు పలువురు జమ్మూకశ్మీర్ పోలీసులు సైతం మరణించారు. పోలీసు కాల్పుల్లో పెల్లెట్ల మూలంగా వందలాది మంది యువకులు గాయపడ్డారు. కశ్మీర్‌లో ప్రజా జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దుకాణాలు మూతపడ్డాయి. జూలై తొమ్మిదో తేదీనాడు మూతపడిన పాఠశాలలు, కాలేజీల తలుపులు ఇంత వరకు తెరుచుకోలేదు. దుకాణాలు, మార్కెట్లు మూతపడటంతో సగటు మనిషి జీవితం దుర్భంగా తయారైంది. కశ్మీర్‌లో ప్రజా జీవితం స్తంభించిపోవటానికి రాష్ట్రంలోని పి.డి.పి- బి.జె.పి ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం కూడా సమాన భాధ్యత వహించకతప్పదు. బుర్హాన్ వని కాశ్మీర్ ఉగ్రవాదులకు ఆరాధ్య దైవంగా మారాడనేది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బాగా తెలుసు. అతను ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే స్థానిక ప్రజలు తీవ్రంగా స్పందిస్తారనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందే ఊహించి ఉండవలసింది. బుర్హాన్ వని అంత్యక్రియలకు అనుమతి ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చే వారిని ఆపకుండా ఉండాల్సింది. ఆపే పక్షంలో వారిని ఎదుర్కొనేందుకు అవసరమైన బందోబస్తున ముందే చేసి ఉండాల్సింది.
వని మరణాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్‌లో తిష్టవేసిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ పెద్ద ఎత్తున వాడుకుని కశ్మీర్‌లో ఉద్రిక్తతను సృష్టిస్తాయనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఊహించలేకపోయాయి? కశ్మీర్‌లో పరిస్థితి విషమించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక ప్రతిపక్ష నాయకులు కూడా బాధ్యత వహించకతప్పదు. భద్రతా దళాలు బుర్హాన్ వనిని ఎన్‌కౌంటర్‌లో హతం చేయటం ద్వారా కశ్మీర్‌లో ఉగ్రవాదానికి మరింత ఊతం ఉచ్చారంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించటం సిగ్గుచేటు. బుర్హాన్ వని బతికి ఉండి చేయలేని పనిని మరణించి సాధిస్తారంటూ ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయటం కుళ్లు రాజకీయానికి పరాకాష్ట. భద్రతా దళాలు బుర్హాన్ వనిని ఎన్‌కౌంటర్‌లో ఏరివేయకుండా అతన్ని అరెస్టు చేసి ఉండాల్సిందని బి.జె.పి మిత్రపక్షమైన పి.డి.పి లోక్‌సభ సభ్యుడు సూచించటం సమర్థనీయం కాదు. భద్రతా దళాల పైకి కాల్పులు జరుపుతున్న ఇస్లామిక్ తీవ్రవాదులను కాల్చివేయకుండా అరెస్టు చేస్తే బాగుండేదనటం అర్థరహితం.