సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

5) నిత్యసిద్ధులు- జన్మతః ముక్తులై యుండువారు, సొర, గుమ్మడి మున్నగు తీగలందు మొగ్గలు విచ్చుటకు పూర్వమే పిందెలు కానవచ్చును, అటులనే నిత్యసిద్ధులు జన్మముతోడనే సిద్ధులై యుందురు. సిద్ధిపొందుటకు వారు చేయుచున్నట్లు కాన్పించు యత్నమంతయు- సాధనలన్నియు- లోక సంగ్రహార్థమే- లోకమునకు మార్గదర్శకములుగా నుండుటకే.
934. శాక్తేయులు సిద్ధులను (ముక్తులను) కౌలులందురు; వేదాంతులు వారిని పరమహంసలందురు; బౌల సంప్రదాయక వైష్ణవులు సాయులని చెప్పుదురు.
935. మామిడిపండు తిని యెవరికైన దెలియునేమోయని పెదవులను బాగుగా తుడుచుకొనువారు కొందఱుందురు; మఱికొందఱో, తమకొక మామిడిపండు దొరకినంతనే ఇతరులను కేకవేసి పిలిచి వారితోగూడ దానిని పంచుకొని తిందురు. ఇట్లే కొందఱు బ్రహ్మసాక్షాత్కారము పొంది బ్రహ్మానందమునంతయు తామే యనుభవించుచుండ, మఱికొందఱు (సాక్షాత్కారమును బడసి) ఇతరులకు గూడ ఆ దివ్యానుభవమును గలిగించువఱకును శాంతినొందజాలరు.
సాక్షాత్కార సూచనలు
936. భగవంతుని గాంచిన మహనీయుడు నూతన వ్యక్తిత్వము నొందును- అపూర్వ పరిణామమునొందును,
937. కొందఱిదివఱకే ప్రబోధము నొందియున్నారు. వీరియందు కొన్ని లక్షణములు గాన్పించును. గంగాయమునాది నదులును సప్తసాగరములును జలప్రపూర్ణములై యున్నను వానిని ముట్టక చాతకపక్షి వాననీటికై పరితపించునట్లు వీరు భగవదితర విషయములను గూర్చి ప్రసంగింపనొల్లరు, విననొల్లరు. దప్పికచే నోరాఱిపోవుచున్నను చాతక పక్షి వర్షబిందువులనే కాని ఇతరమైన నీటిని త్రాగదు.
938. భగవత్సాక్షాత్కారమునకు సూచన లేవి? అరుణకాంతులు సూర్యోదయమును బ్రకటించునటుల స్వార్థత్యాగము, అమలత్వము, సచ్చీలము ననునవి స్వామి రాకను ముందుగ దెలుపును.
939. రాజు సేవకుని యింట విందారగింప బోవునపుడు తన భాండారములనుండియే ఆసనములు, అలంకారములు, భోజ్యపదార్థములు- సమస్తము- ముందుగ నచటికి బంపును. అపుడు సేవకుడు తన స్వామికి తగినటుల గౌరవ మర్యాదల నొనర్పగల్గును. అట్లే నారాయణుడు నరుని హృదయ సింహాసనము నధిష్ఠింపబోవునపుడు ముందుగనె భక్తిప్రపత్తులను శ్రద్ధను అందు పాదుకొల్పును.
940. అంతరంగమున ఆనందము భగవత్సాక్షాత్కార సూచనలలో నొకటి. సముద్రమున పై భాగమున మాత్రమే అలలు చెలరేగుచుండును, కాని గంభీరమైన అడుగు భాగము నిశ్చలముగ నుండును.
941. బ్రహ్మానందామృతపానముచే మత్తత గలుగును. అట్టివాడు మద్యపానము చేయనక్కఱలేదు; మద్య పాయివలెనే ఆతడు పూర్తిగా మత్తుడై కాన్పించును. నా దివ్య జనని పాదములను గాంచినంతనే నేను ఐదు బుడ్ల సారాయమును గ్రోలినంత మత్తుడ నగుదును.
942. పరిపక్వ హృదయుడగువాని స్థితి యెట్టిది? అగ్ని చే పరిపక్వమైన దుంపగాని, వంకాయ గాని బాగుగా మెత్తబడునట్లు జ్ఞానాగ్నిచే పరిపక్వ హృదయుడగువాడు నవనీత కోమల మానసుడై వినమ్రుడై యుండును.
సాక్షాత్కార లక్షణములు
943. ఎవ్వడు ఈ లోకమున జీవించి యుండి మృతుడై యుండునో, అనగా శవమునందువలె ఎవ్వని కామక్రోధాదులు నిర్మూలమగునో అట్టివాడే ఆత్మజ్ఞాని.
944. శ్రీగురుదేవుడు కేశవ చంద్రసేనునితో నొకప్పుడిట్లు పల్కెను: ‘‘వేదాంతము నవలంబించి నీవింకను ఉన్నత తత్త్వములను బోధింపనారంభింతువేని, మీ సంప్రదాయము అడుగంటును. జ్ఞాన దశలో సంప్రదాయములను నిర్మించుట అర్థరహితము- స్వప్న తుల్యము.’’
945. జ్ఞానప్రాప్తియైన పిమ్మట నరునకు భగవంతుడు దూరమున నెక్కడో కైలాసముననో, వైకుంఠముననో ఉన్నట్లు గోచరింపడు. అప్పుడు భగవానుడు, ‘అతడు’ అని గాక, ‘ఇతడు, ఇది- అంతరాత్మయని’ పొడకట్టును. భగవంతుడు సర్వాంతర్యామి; తన్ను వెదకు వారలకు భగవంతుడు గోచరించును.
- ఇంకాఉంది