సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

946. నీట ముంచిన కడవకు లోపలను వెలుపలను గూడ జలముండును. అట్లే భగవంతుని యందు లయ మొందిన జీవునకు బాహ్యాభ్యంతరములందు అఖండాత్మయే గోచరించును.
947.భగవత్ సాక్షాత్కారము నొందిన పిమ్మట భగవంతుడు సర్వత్ర, సర్వమునందును గోచరించును. కాని మరి ఏ ఇతర వస్తువునందు కంటెను నరునందు భగవంతుడు విశేషముగా ప్రకాశించుచుండును;
అన్నిటియందుకంటెను ఎక్కువగా సత్త్వగుణ ప్రపూర్ణులగు భక్తులయందు- కామినీ కాంచనమోహము లేశమునులేని మహనీయులందు- వాని ప్రకాశము దేదీప్యమానమై యొప్పును.
948.ఏమైనను భగవత్ సాక్షాత్కరము నొందిన పిమ్మట భక్తుడు భగవానుని లీలను సందర్శింపగోరుచుండును. రావణ వధానంతరము శ్రీరామచంద్రుడు రాక్షసుల నడుమ బ్రవేశించినంతనే నికాశ రాక్షసి (వృద్ధురాలయ్యును) పరుగెత్తనారంభించెను. అది గని లక్ష్మణుడు శ్రీరామచంద్రునిట్లు ప్రశ్నించెను: అన్నా! ఏమిది? ఈ రక్కసి యింత వృద్ధురలాయ్యును, పుత్రులను బోగొట్టుకొని యింత పుత్రశోకము ననుభవించియు, ప్రాణాపాయమునకు వెరచి పరుగెత్తుచున్నదే?’’ రాముడామెకు అభయమొసగి, దగ్గరకు రమ్మని, పరుగెత్తుచున్నందులకు కారణమడిగెను. రాక్షసి యిట్లు సమాధానము చెప్పెను. ‘‘ఓ రామచంద్రా! నేనింతకాలము జీవించియున్నందువలననే నీ లీలను కన్నులార గాంచగల్గితిని. నీ లీలను ఇంకను సందర్శించుటకై మరికొంతకాలము జీవింపగోరెదను.’’
949. ముక్తునియందు మాయ యుండునా? మేలిమి బంగారముతో నగలను జేయుట పొసగదు. అందేదో కొంత కలితీ ఉండవలయును. నరునకు శరీరమున్నంతవరకు (అన్నపానాది) శరీర ధర్మములను నిర్వహించుటకైనను కొంత మాయ యుండవలయును. పూర్తిగా మాయావిముక్తడగువాడు ఇరువది యొక్క దినములకంటె బ్రదుకడు.
950. శరీరమునుండి మేక తలను ఖండించినపిమ్మట మొండెము కొంతసేపు అటునిటు దొరలాడుచుండును. దానిచే శరీరమున నింకను ప్రాణమున్నదని తెలియవచ్చును. అటులనే ముక్తునియందు అహంకారము ఛేదింపబడినను అతడు తన శరీర ధర్మములను సాగించుటకు జాలినంత మాత్రము అహంకార శక్తి నిలచియుండును. కాని యది వానిని మరల సంసారబద్ధుని జేయజాలదు.
951. ‘పుట్టుట గిట్టుటకొరకే’ యనునట్లు నిర్మాణమైన రుూ శరీరము నశింపక తప్పదు. కాని ఆత్మకు మరణము లేదు. పోక కాయ పండినప్పుడు పైడొక్కనుండి పోకవేరుపడును; పచ్చిగానున్నప్పుడో, దానిని వేరుచేయుట బహుకష్టము. బ్రహ్మప్రాప్తియైనంతనే ఆత్మ శరీరముకంటె భిన్నమను జ్ఞానము ఉదయించును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి