సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

952. యూదులు శిలువపై ఏసుక్రీస్తును మేకులు గొట్టి బంధించినపుడు అతడు అంతటి బాధకు గురియైనను, ‘‘వారు క్షమింపబడుదురుగాక!’’ అని యెట్లు ప్రార్థింపగలిగెను? గునపముతో కొబ్బెర బోండమును ఒలుచునపుడు గునపము లోపలి ముక్కలోనికి గూడా దిగవచ్చును. కాని కురిడీకాయ సంగతి వేరు. కురిడీ చిప్పనుండి వేరుపడి లొటలొటలాడుచుండును. అపుడు గునపముతో డొక్కలను ఒలిచినను కురిడీని అది తాకజాలదు. ఏసుక్రీస్తు కురిడీ కాయవంటివాడు. ఆతని ఆత్మ శరీరమను చిప్పనుండి విడిపోయినది. కాబట్టి శరీర బాధ యాతనినంటలేదు. శరీరమున మేకుల సమాంతరముగా గొట్టినను అతడు పరమ శాంతముగా శత్రువుల క్షేమార్థము ప్రార్థ చేయగల్గినాడు.
ముక్తుని సంగరాహిత్యము
953.కొబ్బెరమట్ట పడిపోవునపుడు చెట్టుమీద ఆనవాలు నిలుచును, దానిని బట్టి అక్కడనొక మట్ట యుండెడిదని గుర్తింపగలుగుదుము. అదేవిధముగా బ్రహ్మ సాక్షాత్కారము నొందినవానియందు కామక్రోధముల మచ్చలు మాత్రముండును. అట్టివాని నైజము పనివాని నైజమును బోలియుండును. పసివాని నైజము సత్త్వ రజస్తమోగుణములు బలపడియుండని కారణమున, అతడొకదానియందు ఎంత శీఘ్రముగా ఆసక్తుడగునో, అంత శీఘ్రముగనే దానిని విడిచిపెట్టును.
వానియొద్ద చాల విలువగల రుమాలున్నదనుకొనుము. దానినిమ్మని నీవు వానిని అడిగినయెడల, ‘‘నేను దీనిని ఎవరికిని ఈయను, మా నాన్న నాకీ రుమాలు కొనిపెట్టినాడు’’అని పట్టుదలతో మొట్టమొదట చెప్పిననుగూడ, దమ్మిడీ ఖరీదు చేయని బొమ్మనిచ్చి నీవు దానిని సంగ్రహింపగల్గుదువు. పసివానికి అందరను సమానులే. ‘‘వీరు కులీను’లియు ‘వీరు కులహీనులనియు వానికి భేదభావము ఉండదు. అందుచే వానికి జాతిభేదము ఉండదు. వాని తల్లి యింకొకని జూపి, ‘వాడు నీయన్న’ అని చెప్పిన జాలును, వాడు వడ్రంగివాని కొడుకైనను సరియే- ఒక్క కంచములో వానితోగూడ భుజించుట కొడంబడును. వానియందు ద్వేషముగాని, శుచి, అశుచియునను బేధభావముగాని యుండదు.
954. ముక్తపురుడు లోకమున నెట్లు మెలగును? అతడు నీటి కాకివలె మెలగును. అది నీటిలో మునిగినను నీరు దానిరుూకలను తడుపజాలదు; ఒకవేళ దాని శరీరమునకు నాలుగు చుక్కలు అంటుకొనినను, అది ఱెక్కలను టపటపలాడించినంతనే అవి జల జల రాలిపోవును.
955, 956. కప్పపిల్ల తోక రాలిపోయినప్పుడు నీటిలోను మెట్టమీద గూడ నివసింపగల్గును. భ్రాంతి గొలుపు అజ్ఞానమను తోక రాలిపోయిన మానవుడు ముక్తుడై స్వతంత్రుడగును.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి