సబ్ ఫీచర్

మితిమీరిన స్వేచ్ఛ తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అనేక స్వాతంత్య్రాలలో ముఖ్యంగా చెప్పుకోవలసినది వ్యక్తి స్వాతంత్య్రం. అందువలన ఎవరైనా తన అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించుకోవచ్చును. అయితే కొందరు మేధావులు, రాజకీయ నాయకులు అభివ్యక్తి స్వాతంత్య్రానికి హద్దులు లేవనుకుంటున్నారు. అవాకులు, చవాకులు ప్రేలుతున్నారు. వ్యక్తి స్వాతంత్య్రానికి, అభివ్యక్తీకరణ స్వాతంత్య్రానికి కొన్ని హద్దులు, పరిమితులు సహజంగానే ఉంటాయి. రాజ్యాంగంలో పరిమితులను నిర్దేశించారు. దురదృష్టమేమంటే వీరు వాటిని పట్టించుకోరు. తన మాటల ద్వారా, చేతల ద్వారా ఇతరులకు హాని కలిగించరాదు. ఎవరిని బహిరంగంగా దూషించరాదు. రెండు సముదాయాలు లేదా రెండు వర్గాల మధ్య సంఘర్షణలకు దారితీసే ప్రసంగాలు చేయరాదు. ఏ సముదాయాన్ని తూలనాడరాదు. ఒక మతస్తుల ఉపాసనా పద్ధతులను, వారి దేవీదేవతలను చులకన చేస్తూ మాట్లాడరాదు. ఇతరుల హక్కులకు భంగం వాటిల్లేలా ప్రచారం చేయరాదు, ప్రసంగాలు చేయరాదు. ఇతరుల మాటలు లేదా చేతల ద్వారా నీకు క్రోధం కలుగుతుంది. అలాగే నీ మాటల ద్వారా వారికి క్రోధం కలుగుతుంది. అది గుర్తుంచుకోవడం ప్రతి ఒక్కరి విధి. మితిమీరిన వ్యక్తి స్వాతంత్య్రం దండనీయమైన అపరాధం.
భారతదేశం ధర్మాధారిత దేశం. అన్ని దేశాలలోనూ అన్ని మతాలకు వారి వారి ధర్మాలున్నాయి. ఇది ఎవరూ కాదనరు. హిందువులు వసుదైక కుటుంబకమ్, లోకాసమస్తా సుఖినోభవంతు అన్న ధర్మవాక్యాలకు కట్టుబడినవారు. వారు కలలోనైనా ఇతర మతాలను ద్వేషించరు. పరమత సహనం హిందూ మతంలో ఉన్నంతగా ఇతర మతాల్లో కనబడదు. భగవద్గీత తృతీయ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ధర్మం గురించి ఇలాగంటాడు. ‘‘చక్కగా ఆచరించబడిన పరమతం కంటె, స్వధర్మము కించిద్గుణ లోపము కలదైనను శ్రేష్ఠతరము. పరధర్మ జీవనము కంటె స్వధర్మాచరణమున మరణమే మేలు. స్వధర్మమువలన ఇహలోకమున కీర్తి, పరలోకమున స్వర్గము కలుగును. పరధర్మమువలన ఇహలోకమున నపకీర్తి, పరలోకమున నరకము కలుగును. కాబట్టి పరధర్మము హానికరము. ఈ ధర్మసూక్ష్మము ఒక్క హిందువులకే కాదు అన్ని ధర్మాలవారికి సమానంగా వర్తిస్తుంది. అందువలన ఎవరూ స్వధర్మాన్ని చులకన చేయడం హర్షణీయం కాదు. ఎవరికైనా వారి ధర్మము గొప్పదే, అలావారు భావించి నడుచుకోవాలి. హిందూ ధర్మము ఇతర ధర్మాలను కించపరచదు. అది పదహారణాల సత్యము.
హిందూ ధర్మంలోగల నీతినియమాలు, ఆదర్శాలు, నడవడికల గురించి భగవద్గీత 12వ అధ్యాయంలో 15నుండి 20వ శ్లోకంవరకు స్పష్టంగా చెప్పబడ్డాయి. ‘‘విశ్వమంతయు ఒకే భగవత్స్వరూపము. చరాచర ప్రాణికోట్ల యందెవరి పైనను ద్వేషము తగదు. నీవు నీవలనే ఇతరులను ప్రేమింపుము. నీవు ఎవరికీ క్షోభ కలిగించరాదు. నీవు ఎవరి వలనను క్షోభ పడరాదు. ఈ వ్యక్తి స్వాతంత్య్రమనేది వివేకం. నిగ్రహంలేని వ్యక్తికి విపత్తుల పాలవుతాడు. అందువలన ఆర్య ధర్మంతో వ్యక్తికి స్వాతం త్య్రం ప్రధానం కాదు. ధర్మం ప్రధానంగా పరిగణించినప్పుడు అమిత స్వాతంత్య్రం లేదా హద్దులు మీరే స్వాతంత్య్రం ఉండజాలదు. శాంతి, ప్రగతి, ఉత్తమగతికోసం ధర్మం. ఆ ధర్మంకోసం వ్యక్తిత్వాన్ని అదుపులో ఉంచుకోవడం ఆర్యుని ధర్మం. వ్యక్తి స్వాతంత్య్రం విశృంఖలమయితే హింసాత్మక చర్యలు చోటుచేసుకుంటాయి. కొందరు నిరపరాధులు మరణిస్తారు. కొందరికి శారీరకంగా క్షతివాటిల్లుతుంది. ఆస్తులు నష్టమవుతాయి. సమాజంలో సౌహార్ధం దెబ్బతింటుంది. ఒక వర్గాన్ని వేరొక వర్గం శత్రువుగా చూస్తుంది.
సగటు భారతీయునకు ధర్మానికి గ్లాని కలుగరాదనుకుంటాడు. మనిషి ఆచరణ ఎలా ఉండాలో భాగవతంలోని ఈ సుభాషితం తెలియజేస్తుంది. ఇతరులు తనకేదైనా కీడుచేస్తే తానెంతో బాధపడతాడు. అందువలన తాను ఇతరులకలాంటి కీడు తలపెట్టరాదు. అయితే విద్యాధికులమనుకునే కొందరు మేధావులు, కొందరు రాజకీయ నాయకులు తమ మాటలవలన వ్రాతలవలన తోటివారికి సంతాపం కలుగుతుందని ఆలోచించరు. అది వారి అసహన శీలత. భతృహరి కూడా ఇదే చెప్పాడు. ఎవరినీ నొప్పించకూడదని. ఈ మేధావివర్గం భారతదేశంలో పుట్టినవారు, హిందువులు ఇక్కడే విద్యాభ్యాసం చేసారు. అందరిలాగే ఇక్కడి వనరులను వారూ ఉపయోగించుకుంటున్నారు. ఈ భూమిమీద పంటలనే తింటున్నారు. ఈ దేశం నాకింత ఇచ్చిందే అన్న విశ్వాసం లేదు. సెక్యులర్ ముసుగులో హిందువులను దూషిస్తున్నారు. వారి పవిత్ర గ్రంథాలైన రామాయణం, భారతంలో వారికంతా చెడే కనిపిస్తుంది. వీరి వ్రాతలు తల్లిపాలు త్రాగి, ఆ రొమ్ము గుద్దడంతో సరిసమానం, వీరు ఈ స్థితికి దిగజారడానికి కొన్ని హేతువులు తప్పక ఉండాలి. ఆ హేతువులు ఇలా ఉంటాయి. 1) పరాయితనం మీద మక్కువ, స్వాభిమాన రాహిత్యం, 2) మన ధర్మాన్ని కుత్సిత కోణాల్లోచూస్తూ మన ధర్మాన్ని గౌరవాన్ని దెబ్బతీయాలనుకునే దుర్మార్గం, 3) మన సంస్కృతి, విద్యలు, వాటి స్వరూపస్వభావాలు తెలుసుకోలేని విద్యావ్యవస్థ, కుటుంబ వ్యవస్థ 4) క్షుద్ర ప్రయోజనాలకోసం పరధర్మంవైపు అర్రులుచాస్తూ స్వధర్మాన్ని అవగాహన లేక పతనవౌతున్న వైపరీత్యం వెరశి పెనవేసుకొని రాష్ట్ర ధర్మాన్ని, హిందు రీతి రివాజులను, వారు ప్రాణసమానంగా చూసుకునే ఆధ్యాత్మిక గ్రంథాలను తూలనాడడం పరిపాటిఅయింది.
కొందరు రాజకీయ నాయకులు సెక్యూలర్ ముసుగులో ఓటు బ్యాంకు ఆధారిత రాజకీయ ప్రయోజనాలకొరకు హిందుత్వాన్ని హిందూధర్మాన్ని సమర్ధించే సంస్థలను రాజకీయ పార్టీలను తూలనాడుతున్నారు. అలాగే కొందరు మేధావులు పవిత్ర గ్రంథాలను చులకన చేస్తున్నారు. వ్యక్తి స్వాతంత్య్రం వలన ఇతరులు బాధపడతారని ఆలోచించరు.
ఇలా విమర్శించే వారిని ఎలా ఎదుర్కొనడం? దీనికి ఒక రామబాణంలాంటి అస్త్రం ఉంది. ఈ ధోరణులను నిషేధించాలని గోలపెట్టనవసరం లేదు. ఎలాంటి విమర్శలనైనా ఎదుర్కొని నిలిచే సంస్కృతి మనది. నిషేధించడం, బహిరంగంగా వారితో కలబడడం అనాగరిక చర్యలు. రాజ్యాంగం ఆమోదించదు. అయితే న్యాయస్థానాలు అలాంటి వారిని శిక్షించగలవు. అది ధర్మపరమైనది, న్యాయపరమైనది. ప్రపంచంలో అన్నిరకాల అభిప్రాయా లు కలసి ప్రవహిస్తున్నాయి. వారివారి సంస్కారానికనుగుణంగా వాటిని తలో విధంగా గ్రహిస్తారు. మనం నమ్మినానమ్మకపోయినా కొన్ని సత్యాలుంటాయి. మనకు నమ్మకంలేనంత మాత్రాన అవి అభూతకల్పనలనడం సమంజసమా? ముందుగానే ఒక విపరీత ధోరణితో దోష దృష్టితో పరిశీలిస్తే అన్నీ దోషభూయిష్టంగానే ఉంటాయి. వీరి అరుపులు, వ్రాతలు ఎంతోకాలం కొనసాగవు.

- గుమ్మా ప్రసాదరావు