సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడాతడు భగవంతునియందును సంసారమునందును కూడా సమానముగనే నెలకొనియుండగలడు.
957.గాలి మంచిగంధపు వాసనను, క్రుళ్లి కంపుగొట్టు శవము యొక్క దుర్గంధమును కూడా సమానముగనే వహించును, కాని యది వానితో మిళితము కాదు. ఇటులనే ముక్త పురుషుడు సంసారమున జీవించుచుండియు దానితో మిళితము కాడు- బద్ధుడు కాడు.
958. పరుసవేది తాకున బంగారముగా మారిన యినుమును నేలలో పాతిపెట్టినను, పెంటకుప్పలో పారవేసినను సరియే, బంగారముగనే యుండును. పూర్వస్థితికి దిగదు. ఒక్కసారియైనను భగవత్పాదారవిందములను స్పృశించిన మానవోత్తముని విషయము కూడా నిట్టిదే. అతడు లౌకిక వ్యవహారాడంబరములోనున్నను, ఏకాంతమగు వన ప్రదేశముననున్నను నిర్లిప్తుడై యుండును- ఏ కళంకమును వాని నంటదు.
959. పాలకు నీటి చేరిక గలిగించినయెడల వెంటనే రెండును కలిసిపోవును. కాని పాలను వెన్నగా మార్చితిమా, నీటిలో కలియుటకు బదులు దానిపై తేలియాడును. అటులనే జీవాత్మ బ్రహ్మ భావమును బడసెనా, నిరంతరము, అనుక్షణము, అపరిశుద్ధాత్ములతో సంసార బద్ధులతో సహవాసము చేసినను ఆ దుష్ట సాంగత్యముచే అణుమాత్రమున మాలిన్యము నొందదు.
960. జీవుడును జగత్తును బ్రహ్మముతో అభిన్నమని యెవ్వడు స్వానుభవముచే గ్రహించునో అట్టివానిని పుణ్య పాపములంటవు.
పుణ్య పాపములకు ముక్తుడు అతీతుడు, కాని పాము చేయడు
961. బయలున నిలిచియున్నవాడు అల్పమగు గడ్డిని, ఉన్నతమగు మఱ్ఱిచెట్టును జూచి, ‘‘ఆహా! ఈ చెట్టెంత గొప్పది! ఆ గడ్డి యెంత అల్పమైనది!’’ అనుకొనును. కాని యాతడే కొండనెక్కి యెత్తగు దాని శిఖరమునుండి చూచునపుడు గడ్డియు వృక్షమును కూడా హెచ్చుతగ్గుల గుర్తింపరాని ఒకే పచ్చిక బయలుగా గాన్పించును. ఇదేవిధముగా ప్రాపంచికుల దృష్టికి పనులలో ఉచ్ఛనీచములు గోచరించుచుండును. ఒకడు మహారాజని, మరియొకడు మాదిగవాడని, ఒకడు తండ్రియని, మరియొకడు కొడుకని ఎన్నియో భేదములు చూచుచుండును. కాని దివ్యదృష్టి- ఆత్మదృష్టి ప్రాప్తించినవానికి సర్వము సమమై తోచును. శుభాశుభములు, ఉచ్ఛనీచములు నను తారతమ్యములు రూపుమాసిపోవును.
962.్భగవదున్మత్తుడగు నొక సాధువు శ్రీగురుదేవుడు నివసించుచుండిన కాళికాలయమునకు వచ్చెను. ఒకనాడాతనికి భోజనము దొరకలేదు; ఆకలిగానున్నను ఆతడెవరిని యాచింపలేదు. సంతర్పణానంతరము ఓక వీధి మూల పారవేయబడిన ఎంగిలి యాకులను నాకుచున్న యొక కుక్క కడకు పోయి అతడు, ‘‘అన్నా! నాకు పాలీయకుండా నీవొక్కడవే తినుచున్నావా?’’ అని యా కుక్కను కౌగిలించుకొని దానితో గూడ తిననారంభించెను.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి