సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వింత చెలికానితో ఇట్లు భోజనమైన పిమ్మట ఆ సాధువు కాళీదేవాలయమును జొచ్చి, ఆలయములోనివారికెల్ల గగుర్పాటొదవునటుల మహాభక్త్యావేశముతో దేవిని ప్రార్థింపసాగాను. కొంతసేపటికి ప్రార్థనను ముగించి యాతడు వెడలిపోవుచుండుట గాంచి, శ్రీగురుదేవుడు తన శిష్యుడగు హృదయుని అతని వెంట బోయి యాతనితో సంభాషించి రమ్మని పంపెను.
హృదయుడు ఆతని వెంట కొంత దూరము పోవుసరికి ఆ సాధు సత్తముడు వెనుకకుదిరిగి, ‘‘నీ వేల నన్నసరించుచున్నావు?’’ అని యడుగగా, ‘‘స్వామీ! నాకేమేని బోధ చేయుడు’’ అని హృదయుడు కోరెను. ఆ మహనీయడిట్లు బోధించెను. ‘‘ఈ మురికిగుంటలోని నీరును ఆ పావనగంగాజలమును నీకెప్పడు సమమై తోచునో, వేణుగానమును అల్లరిమూకలగోలయు నీకెన్నడు సమానముగా తోచునో అపుడు నీవు బ్రహ్మజ్ఞానము పొందినవాడవగుదువు’’. హృదయుడు మరల వచ్చి యా వాక్కులను వినిపింప శ్రీగురుదేవుడిట్లు వచించెను. ‘‘ఆతడు బ్రహ్మజ్ఞానమును - సమాధి స్థితిని- బొందిన మహనీయుడు. ‘బాలోన్మత్త పిశాచవత్’ అనునట్లుసిద్ధుడు (అనగా ముక్తుడు) బాలునివలె, పిచ్చివానివలె, పిశాచమువలె- అనేక విధములుగా తిరుగాడుచుండును. అనేక విధముగా నటించుచుండును’’.
963. పరమహంస స్థితి పసిబాలుని స్థితిని బోలును. ఐదేండ్ల బాలునికివలె వానికి స్ర్తికిని పురుషునకును భేదమే తోచదు. ఐనను లోకులకు మార్గదర్శకుడుగా నుండుటకై యాతడు స్ర్తిల విషయమై జాగరూకుడై మెలగవలయును.
964. ఒకప్పుడొక సన్న్యాసి జనకుని కొలువ కూటమునకు వచ్చెను. ఆమె ముఖము నవలోకింపకుండ రాజామెకు వంగి నమస్కరించెను. అది గని సన్న్యాసిని ఇట్లు పల్కెను. ‘‘జనకా! నీకింకను స్ర్తిని గూర్చి యింత భయముండుట ఎంత విచిత్రము!’’ బ్రహ్మజ్ఞానము నొందినవాని నైజము కేవలము పసివాని నైజము బోలును- అతడు స్ర్తి పురుషులకు భేదమును పాటింపడు.
965. (సరేకాని) జ్ఞానియందీలోకమున గోచరించు స్వల్ప దోషములు అంతగా గమనింపదగినవి కావు. చంద్రమండలమున గోచరించు మచ్చలు చంద్రుడు తన కాంతులను వెదజల్లుటకు అడ్డువచ్చుట లేదు గదా!
966. పరుసవేదిని తాకిన ఉక్కు కత్తి బంగారు కత్తిగా మారును. అపుడు దాని యాకారము మారకున్నను దాని వలన దేనికిని హాని కలుగజాలదు. అట్లే భగత్పాదారవిందములను స్పృశించిన మనుజుని రూపు మారకున్నను అతడేదుష్కారమును జేయజాలడు.
967. దివ్యమగు నద్వైతజ్ఞానమును నీ కొంగున ముడివేసికొని నీ యిచ్చవచ్చిన కార్యముల నొనర్పుము. నిజమగు నద్వైతజ్ఞానివై యున్నపుడు నీవలన నేదుష్కార్యమును జరుగనేరదు.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది