సబ్ ఫీచర్

తెలుగింటి కోడలి వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ చరిత్రలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన రెండో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 1970వ సంవత్సరంలో ఇందిరాగాంధీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఆర్థిక శాఖను కూడా తనవద్దే పెట్టుకున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఇది. తొలి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా నియమితులైన మహిళగా చరిత్ర సృష్టించిన నిర్మల సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళల నేతృత్వంలో మహిళల సాధికారత కోసం కేటాయింపులు చేపట్టడంతో పాటు కొత్త ప్రతిపాదనలు చేశారు. పేద, మధ్యతరగతి మహిళలకు పెద్ద పీట వేశారు. ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ. లక్ష వరకు రుణం ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతేకాకుండా స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యత్వం ఉన్న మహిళలకు రూ. 5 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఇది పేద, మధ్య తరగతి మహిళలకు ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా వారివారి ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది.
ప్రతిపాదనలు ఇవే..
* మహిళలు స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) కార్యక్రమాన్ని అన్ని జిల్లాలకు విస్తరించడం..
* మహిళల్లో వ్యాపార దృక్పథాన్ని ప్రోత్సహించేలా ఎస్‌హెచ్‌జీలోని ప్రతి మహిళకు ముద్రా పథకం కింద రూ. ఒక లక్ష రుణ సదుపాయం..
* ఆ బృందంలో రిజిస్టర్ అయిన ప్రతి మహిళకు జన్‌ధన్ ఖాతాతో పాటు రూ. 5,000 ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యం..
* ముద్రా పథకం కింద 70 శాతం మంది లబ్ధిదారులు మహిళలేనని వెల్లడి..
* ఇప్పటికే ఏడు కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడి.. అలాగే ఉజ్వల యోజన కింద ఎనిమిది కోట్ల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తామని ప్రకటన..
* ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కింద 2019-2020 ఆర్థిక సంవత్సరానికి రూ. 27, 584 కోట్ల కేటాయింపులు..
* నారీ-నారాయణి కమిటీ ఏర్పాటు. దీని ద్వారా మహిళా సంక్షేమం.
మహిళల భాగస్వామ్యంతోనే పురోగతి సాధించగలమని తమ ప్రభుత్వం నమ్ముతోందని.. ఈ సందర్భంగా ‘మహిళల పరిస్థితి మెరుగుపడితే తప్ప ప్రపంచ సంక్షేమానికి అవకాశం లేదు.. ఆకాశంలో పక్షి ఎప్పుడైనా ఒక రెక్కతో ఎగరగలదా..?’ అంటూ వివేకానంద సూక్తిని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. అంతేకాదు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ చాణక్యనీతిని కూడా ప్రస్తావించారు. ‘కార్య పురుష కరేన.. లక్ష్యం సంపాదయతే’ అని చాణక్య నీతి చెబుతోంది. అంటే.. మానవ ప్రయత్నం కచ్చితంగా ఉంటే ఎలాంటి లక్ష్యాలనైనా పూర్తి చేయగలం అని అర్థం అంటూ చెప్పుకొచ్చారు సీతారామన్.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాట పుట్టి.. తెలుగింటి కోడలయ్యారు. సేల్స్ గర్ల్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. తండ్రి రైల్వే ఉద్యోగి అయినా సొంత కాళ్ల పైనే నిలబడడానికి ఎంతగానో శ్రమించారు. భర్త ఓ పార్టీ, ఆమె మరో పార్టీ. ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా రికార్డు సృష్టించారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి 1984లో నిర్మలా మాస్టర్స్ డిగ్రీ పొందారు. లండన్‌లోని రెజెంట్ స్ట్రీట్‌లో గృహోపకరణాల స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేశారు. తర్వాత యూకేలో అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 2003 నుంచి 2005 వరకు జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగానూ ఉన్నారు. 2014లో ఈమె సేవలను గుర్తించిన నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మోదీ తొలి ప్రభుత్వంలో రక్షణ శాఖామంత్రిగా పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖామంత్రిగా పనిచేసిన మహిళామంత్రిగా ఈ ఘనత సాధించారు.