సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇకనాతడు కేవలము భగవంతుని సేవించుటలో- వాని యాజ్ఞను బరిపాలించుటలో- ఆనందము గాంచుచుండును. ఇతర వ్యాపారములు ఆతనికిక నెంతమాత్రము రుచింపవు. ఆతడిక దైవసంసర్గమునవలన గలుగు నానందపారవశ్యమును బోగొట్టుకొన నొల్లడు.
972. భగవత్ సాక్షాత్కారము నొందినపిమ్మట ప్రపంచము మిథ్యగా గాన్పింపదు. భగవద్దర్శనము నొందిన వానికి ఈ జీవజగత్తులన్నియు భగవత్స్వరూపములుగనే గోచరించును. అట్టివాడు తన బిడ్డలను పోషించుచు, గోపాలునే పోషించుచున్నట్లు భావించును; తల్లిదండ్రులను లక్ష్మీనారాయణులనుగా గాంచుచు, వారలను సేవించును. భగవత్సాక్షాత్కారమును పొందినయనంతరము ఎవ్వడేని గృహస్థుడుగ నుండి సంసారముచేయుచున్నను భార్యతో సంభోగింపబోడు. భార్యాభర్తలిరువును భక్తులై ప్రార్థనాదికములతో కాలము గడపుచుందురు. సర్వభూతములందును భగవంతుని గాంచుచు, వారు సర్వభూతసేవ చేయుచుందురు- అన్నిటియందును భగవంతునే పూజింతురు. ఇరువదవ ప్రకరణము
శ్రీ గురుదేవుని కొన్ని దివ్యానుభవములు
బాల్యదశానుభవములు
973. చదువునుగూర్చి యశ్రద్ధచేయుచుండెనని బాల్యమున తనయన్న రామకుమారుడొకప్పుడు తన్ను మందలింప, శ్రీగురుదేవుడిట్లు సమాధానమొసగెను: ‘‘అన్నా! ఈ పొట్టకూటి చదువు నాకెందులకు? ఇందులకు బదులు ఆత్మవికాసమును గలిగించి శాశ్వతానందము నొసగు జ్ఞానమును నేనార్జింపగోరుదును.’’
974. పారమార్థిక జీవితమున ప్రారంభ దశలో శ్రీ గురుదేవుడు రాత్రి కాలమున ఏకాంత వనప్రదేశమున దిగంబరుడై, యజ్ఞోపవీతమును గూడ విసర్జించి ధ్యానించుచుండుట గురుదేవునకు వరుసను కుమారుడగు హృదయుడు కనుగొని ‘‘్ధ్యనమునకు దిగంబరత్వ మెందుల’’కని ప్రశ్నించెను. గురుదేవుడిట్లు సమాధానమొసగెను: ‘‘బంధ రహితుడై సాధకుడు ధ్యానింపవలయును. పుట్టినదాది మానవుడు అసహనము, లజ్జ, అభిజాత్యము (అనగా గొప్ప వంశమున జన్మించితినను గర్వము), సంఘమర్యాద, భయము, ప్రతిష్ఠ, కులాభిమానము, అహంకారముననునట్టి యెనిమిది విధములైన సంకెలలచే బద్ధుడగుచున్నాడు. ‘జందెముగూడ బంధమే- ఇది యహంకార చిహ్నము- తాను బ్రాహ్మణుడననియు ఇతరులందరికంటె నధికుడననియు గర్వింపజేయును. కాబట్టి జగజ్జనని ధ్యానించునపుడు ఈ బంధములనన్నిటిని త్రోసిరాజని బంధరహితుడై యుండవలయును.’’
975. శ్రీ గురుదేవునకు భగవత్పరితాపము తీవ్రముకాజొచ్చెను- భగవత్ సాక్షాత్కారము లేని జీవితము దుర్భరమై తోచెను. ఆతడిక హతాశుడై జీవితము నంతమొందించుకొన బ్రయత్నించునంతలో అకస్మాత్తుగా సాక్షాత్కారము లభించెను.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి