సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన దివ్యానుభవమును శ్రీగురుదేవుడిట్లు వర్ణించెను: తలుపులతో, కిటికీలతోగూడ ఆ గదియు ఆలయమును నాచుట్టునున్న సమస్తము క్షణములో అదృశ్యమయ్యెను. ఇక నేమియు లేనట్లు తోచెను. దేదీప్యమానమగు ననంత చైతన్యసాగరము మాత్రమే నాకు గోచరింపసాగెను. ఏ వైపు జూచినను- అన్ని దిశలనుండియు- ఆ దివ్యసాగర మహోత్తుంగ తరంగములు నావైపు ఉవ్వెత్తుగ వచ్చుచుండెను. అచిరకాలముననే యవి నాపైబ్రసరించి నన్ను ముంచివేసెను. దానిచే శ్వాసలు కట్టువడ బాహ్యస్మృతి రహితుడనై పడిపోయితిని.’’ ఈ యనుభూతినే తెలుపుచు మఱియొకప్పుడిట్లు పలికెను: ‘‘ఆ దివ్యసాక్షాత్కారముచే పరవశుడనై గదిలో నేలపై బడిపోయితిని. బాహ్యలోకమున నేను జరుగుచుండెనో నాకపుడు స్ఫురణయే లేదు-నాడును మఱునాడును ఎట్లు గడచెనో నాకు ఎఱుకయే లేదు. నాయంతరంగమున అనిర్వచనీయానంద సాగరము- అంతకు ముందునేనెన్నడనుభవింపని దివ్యానందము- ప్రసరించుచుండెనని మాత్రమే నాకు అపుడు ఎఱుక. ఐనను నా దివ్యజనని భవ్యసాన్నిధ్యము మాత్రము నా హృదయాంతరాళమున భాసించుచునే యుండెను.’’
976. కాని రుూ భగవదనుభవము గురుదేవునకు నిరంతర బ్రహ్మానుభూతిని గల్గింపజాలదయ్యె. దివ్యానుభవ రహితుడై, పరితప్త హృదయుడై యాతడు దినములు గడపవలసి వచ్చెను. నిరంతర బ్రహ్మానుభూతికై యాతడు అఖండా వేదనతో బాష్పధారలు ప్రవహింప వెక్కివెక్కి యేడ్చుచు తన దివ్యజననిని ప్రార్థింపసాగెను. ఆ సమయమున దన మనఃస్థితిని దెలుపుచు గురుదేవుడిట్లు పలికియున్నాడు; ‘‘జనులు నా చుట్టును (రోదన చేతను ప్రార్థనల చేతను ఆ కృష్ణులై) మూగిన యెడల వారు కేవలము నాకు నీడలవలెను తెరపై వ్రాయబడిన బొమ్మలవలెను- అంత మిథ్యగా- అంతమాయగా- దోచెడివారు: అందుచే నాకెట్టి లజ్జయు గలిగెడిదికాదు. కాని దుర్భరావేదనచే బాహ్యస్మృతి రహితుడనైనపుడెల్ల, ఉత్తర క్షణముననే దేదీప్యమానమగు స్వరూపమున దివ్య మాతృదర్శనము లభించెడిది. ఆ భవ్యరూపము ఒకప్పుడు నవ్వుచు, ఒకప్పుడు నాతో సంభాషించుచు, మఱియొకప్పుడు నాకు సదుపదేశం లొనర్చుచు, నన్నోదార్చుచు సాక్షాత్కరించెడిది.’’
977. తీవ్ర భగవత్పరితాపమున గడచిన యా దినములను వర్ణించుచు శ్రీ గురుదేవుడిట్లు వచించువాడు: ‘‘ఆ సమయమున శరీర శౌచమును గూర్చిన మాటయే నాకు గుర్తులేకుండుటచే తలవెండ్రుక లెదిగి ధూళితో గూడుకొని జడలు కట్టుకొనిపోయెను. ధ్యానమున గూర్చుండునపుడెల్ల తీవ్ర చితె్తైకాగ్రతచే శరీరము నిశ్చలమై కఱ్ఱవలె కొఱడువాఱి పోయెడిది. శరీరమును స్థాణువనుకొని పక్షులు నిర్భయముగా వచ్చి తలపై వ్రాలి ఆహారముకోసము జడలను వెదకుచు పొడుచుచుండెడిది.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి