సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కొక్కప్పుడు తీవ్ర భగవద్విరహవేదనచే మొగము నేలనుబెట్టి రాచుకొన, గాయములై రక్తము వచ్చెడిది. ధ్యానముతో, ప్రార్థనలతో, భక్తిసాధనలతో, దినములు అట్టె నిముషములవలె గడచిపోవ, నాకపుడు వానిని గూర్చిన యెఱుకయే లేకుండెడిది. సంధ్యాసమయమును ఆలయమునుండి శంఖ ఘంటారవములు ఘోషింప పగలు గడచి రాత్రియగుచున్నదని నాకపుడు స్మరణకు వచ్చెడిది. ఆ యెఱుకతోబాటు నిరాశా దుఃఖము నన్నలముకొన నేలపై బడి పొరలాడుచు, మొగమును నేలను రాచుకొని యిట్లు బొబ్బలు పెట్టువాడను: ‘‘ఓ తల్లీ! ఒక దినము గడిచిపోయినది. నాకింకను నీవు ప్రసన్నవు గావైతిగదా!’’ హృదయము ఱంపముతో కోయబడినట్లు తోప నేలపై బొరలాడుచు, నేను పడువేదనను గాంచిన జనులు, ‘అయ్యో, పాపము! ఈతడేదియో శూలచే బాధపడుచున్నాడు కాబోలును’ అనుకొనెడివారు.’’
978. తన వివాహానంతరము గురుదేవుడు తిరిగి దక్షిణేశ్వరమునకు వచ్చినంతనే మఱల దివ్యోన్మత్తుడయ్యెను. ఆ దినములలో తన మనఃస్థితిని గూర్చి గురుదేవుడిట్లు పలికియున్నాడు. ‘‘నా మనశ్శరీరములనుభవించిన దివ్యపరిణామమున మఱెవ్వరైనను నాల్గవవంతు అనుభవించిననుగూడ ఈపాటికి పరమపదించియుందురు. (తన్నుద్దేశించుచు) ఈ శరీరమునకుగూడ ఆ గతియే పట్టెడిది; కాని యదృశ్టవశమున (ఆ దశలో) విశేష కాలము దివ్యమాతృదర్శనముచే గలిగిన బాహ్యవిస్మృతితో గడపితిని. అటుపైని ఆరేండ్ల పర్యంతము కంటికొక కునుకైనను రాలేదు- ఎంత ప్రయత్నించినను ఱెప్పలు మూతపడెడివే కావు. కాలమే అపుడు నాకు స్ఫురించెడిదికాదు; శరీరస్మృతి పూర్తిగా సమసిపోయెను. మనస్సు జగజ్జననిని విడిచి శరీరముమీదికి లేశము మఱలిననుగూడ ఘోర భయము నన్నావహించెడిది. నిజముగా నాకు పిచ్చియెత్తినదాయని తఱచు భయపడువాడను. అద్దము నెదుట నిలిచి కంటిని వ్రేలితో పొడుచుకొందునుగదా, మూతపడదే! స్పర్శానుభవమైన పొందదే! ఈ స్థితినిగాంచి భయభ్రాంతుడనై కన్నీరొలుక విలపించుచు జగజ్జనని నిట్లు ప్రార్థించువాడను; ‘అమ్మా! జగజ్జననీ! కేవలము నినే్న నమ్ముకొని యుండుటకును నా ప్రార్థనలన్నిటికిని ఇదియా ఫలము! నాకీ కుదురని వ్యాధిని దెచ్చిపెట్టితివా!’ కాని మరుక్షణముననే, ‘అమ్మా! నా శరీరమున కేగతిపట్టినను నీవు మాత్రము నన్ను విడనాడకుము! నీ సందర్శనమును కృపను నాకు బ్రసాదింపుము! తల్లీ! నీ దివ్య పాదారవిందములనే అనన్యగతిగా నమ్ముకొనియున్నానుగదా? నీకంటె నాకు దిక్కెవ్వరు?’ బాష్పములు ఒలుక నిట్లు వేడుకొన నా మనస్సునకు అపూర్వోత్సాహము గలిగెడిది; శరీరముపై పరమాసహ్యము జనించెడిది. అపుడు దివ్యమాతృదర్శనానందమున,- ఆమె నన్నోదార్చు వచనముల మైమఱచువాడను.’’
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి