సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

979. శ్రీగురుదేవుని పరిశుద్ధమానసమే యాతనికి ప్రథమ గురువై, ప్రధాన గురువై యొప్పెను. ఇన్విషయమునుగూర్చి శ్రీగురుదేవుడిట్లు వచించియున్నాడు; అవసరమైనప్పుడెల్ల నా శరీరములోపలి నుండి సరిగా నావలెనే కాన్పించునొక బాలసన్న్యాసి వెలువడి నాకు సర్వము బోధించువాడు. ఈ విధముగా నాతడు వెలువడ నొక్కొక్కప్పుడు కొంచెము బాహ్యస్ఫురణ గలిగియుండెడివాడను. మఱియొక్కొక్కప్పుడు ఆతని సాన్నిధ్యమును చేష్టలను కనిపట్టుట తప్ప. ఇతరమైన బాహ్యస్ఫురణమును పూర్తిగాగోల్పోవువాడను. ఆతడు మఱల నా శరీరమున బ్రవేశించినంతనే బహిఃప్రజ్ఞ నొందువాడను. పూర్వము ఆతనివలన వినిన బోధలనే బ్రాహ్మణి వలనను శ్రీ తోతాపురిషలనను తదితరులవలనను వినియున్నాను. ఆతడు నాకుపదేశించిన తత్త్వముచే పిమ్మట ఈ గురువులందఱి వలనను గ్రహించినాను.’’
తాంత్రికాది సాధనలు
980. భైరవీబ్రాహ్మణియొక్క గురుత్వమున తా నభ్యసించిన తాంత్రిక సాధనలనుగూర్చి శ్రీగురుదేవుడిట్లు వచించెను: ‘‘బ్రాహ్మణి పగలు దక్షిణేశ్వరమునుండి యెచ్చటెచ్చటికో వెడలి తంత్ర శాస్తమ్రున సాధనకు ఆవశ్యకమని చెప్పబడిన వివిధ వస్తువులను సేకరించెడిది. చీకటి పడుచుండగా ఆమె నన్ను నియమితమైన యొక ఆసనము కడకు రమ్మని పిలిచెడిది. నేను వెడలి కాళీపూజ నొనర్చి యామె యుపదేశముననుసరించి ధ్యానింప నారంభించువాడను. జపమాలను చేపూని జపింపబోవుదునుగదా. దివ్యావేశ పరవశుడనై సమాధి నిమగ్నుడనయ్యెడివాడను. అందుచే జపమునకు ప్రారంభముననే స్వస్తియగుచుండెడిది. అపుడు నాకెట్టి యద్భుత దివ్యదర్శనములు గలిగెడివో యిపుడు వివరింపజాలను. అయ్యని ఒకదాని వెంబడి అతి త్వరితముగా భాసించెడివి. ఆ సాధనల ఫలితమపుడు నాకు వెంటనే ప్రత్యక్షమగు చుండెడిది. ముఖ్యమైన అణువది నాలుగు తంత్ర ములందును జెప్పబడిన వివిధ సాధనలన్నిటినీ బ్రాహ్మణి నాచే జేయించెను. వీనిలో అనేకము అత్యంత దుస్సాధ్యమైన సాధనలు. ఏలన సాధారణముగా సాధకులనేకులు వీని నాచరింపబోయి భ్రమప్రమాదములకు లోనగుచుందురు- పతితులగుచుందురు. కాని, అమ్మ కృపాకటాక్షమున వీనినన్నిటిని నిరపాయముగా, నిష్కళంకముగా ఆచరింపగల్గినాను.’’
981. కుండలినీ ప్రబోధమును వర్ణించుచు శ్రీగురుదేవుడిట్లు వచించెను. ‘‘ఈ యనుభవము పొందినపుడు సరిగా నావలెనే గాన్పించునొక వ్యక్తి వెలువడి నా యిపింగళాసుషుమ్నా నాడులను పూర్తిగా గదల్చివైచువాడు. షడ్చక్రములందరి పద్మములను ఆతడు తన నాలుకతోనాక, వాలియున్న యవి ఒక్కుమ్మడి తలలెత్తును. తుదకు సహస్రారకమలము పూర్ణవికాసమునొందును.’’

- ఇంకా ఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి