సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

982. మహమ్మదీయ మత సాధనల నాచరించినప్పుడు తన మనఃస్థితిని వర్ణించుచు శ్రీగురుదేవుడిట్లు తెల్పెను. ‘‘నేనపుడు అల్లా నామ స్మరణము చేయుచు, మహమ్మదీయులవలెనే బట్టలను ధరించుచు, యథావిధిగా నమాజుచేయుచుండెడివాడను. మనస్సునుండి హిందూ భావములన్నియు పూర్తిగా పలాయనమగుటచే హిందూ దేవతలకు నేను నమస్కరింపకుండుటయేకాక, వారిని దర్శింపవలయునని నాకపుడు బుద్ధికూడ పుట్టెడిది కాదు. ఈ విధముగా మూడునాళ్లు సాధనచేసిన పిమ్మట ఆ సాధన గమ్యమును బొందితిని.’’
983. ఒకప్పుడు నేను హిందూ మతము, మహమ్మదీయ మతము, క్రైస్తవ మతము మొదలగు వివిధ మతముల నవలంబించుటయేకాక, హిందూ మతమున మఱల వైష్ణవశాక్తేయ వేదాంతాది సంప్రదాయముల నవలంబించి సాధనలు చేసితిని. వివిధ మార్గముల ననుసరించుచున్నను అన్నియు ఒకే గమ్యమును బొందుచున్ననని కనుగొంటిని.
984. తనకు ప్రియుడును తనయన్న కుమారుడునగు అక్షయుని మరణమును గాన్పించినప్పుడు శ్రీగురుదేవుడు మనుజుడెట్లు మరణించునో ప్రత్యక్షముగాగాంచెను. ఈయనుభవమును గూర్చి శ్రీ గురుదేవుడిట్లు పలికియున్నాడు. ‘‘అక్షయుడు నాకట్టెదుటనే మరణించెను. అందులకు నేనెంతమాత్రము విచారింపలేదు. ప్రక్కను నిలుచుండి నేను మనుష్యులెట్లు మరణించురో చూచితిని. అది ఒఱనుండి కత్తిని పైకిదీయుటవంటిది.
కత్తియెప్పటికదే, కాని ఒఱ మాత్రము దిగవిడువబడినది. ఈ దృశ్యమును జూచి నేనానందమున నవ్వుచు, పాడుచు, నృత్యముచేసితిని. వారు కళేబరమును దీసికొనిపోయి దహనమొనర్చిరి. కాని మఱునాడు నేనక్కడ (తన గదిప్రక్కనున్న వసారాను జూపుచు) నిలిచియుండగా, అక్షయుని మరణమునకై నాకు దుర్భరమైన వేదన కలిగినది- తడిబట్టను పిండునట్లు ఎవ్వరో నా హృదయమును మెలిపెట్టి పిండుచున్నట్లు అఖండ బాధపడితిని. ఆశ్చర్యపడి, నాకు జగజ్జనని బుద్ధిచెప్పుచున్నదని తలచితిని. ఈ శరీరము తోడనే నాకు ప్రమేయములేదే! ఇక నా సోదరుని కుమారుని తోడనా నాకు సంబంధము! ఐనను వాని మరణమునకై నేనే యింత బాధపడినప్పుడు తమ యాప్తులు గతించినపుడు గృహస్థులెంతగా కుందుదురోకదా!’’
నిర్వికల్పానుభవము
985. తన నిర్వికల్ప సమాధ్యనుభవమును వర్ణించుచు శ్రీ గురుదేవుడిట్లు తెల్పెను. ‘‘ఉపదేశానంతరము దిగంబరుడు అద్వైత వేదాంత సిద్ధాంతములను నాకు బోధింపమొదలిడెను. సర్వ విషయములనుండియు మనస్సును ఉపసంహరించుకొని ఆత్మలో నిమగ్నుడవుకమ్మని చెప్పెను. కాని నేనెంత ప్రయత్నించినను నామరూప ప్రపంచమును దాటి నిరుపాధిక స్థితికి మనస్సును దీసికొని పోజాలక పోతివి.

- ఇంకా ఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి