సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ స్థితిలో మఱికొన్ని నాళ్లు గడచిన వెనుక లోకేశ్వరి యాజ్ఞ నాకిట్లు వినవచ్చెను: ‘‘లోకమునకు బోధించుటకై ‘భావముఖమున’(అనగా ద్వైత ప్రపంచ స్ఫురణము, ఆత్మావలోకనము నను రెంటికిని నడుమ- ద్వైత ప్రపంచ ద్వారమున)నుండుము.’’ నాటినుండి రక్తగ్రహణి ప్రారంభమయ్యెను. ప్రేవులను మెలిపెట్టి పిండుచున్నట్లు దుర్భర బాధ కలుగసాగెను. ఆఱునెలలు ఈవిధమైన బాధ మూలమున క్రమముగా మఱల శరీర స్మృతి కలుగనారంభించెను. అంతవఱకు స్వల్పావకాశము దొరికినప్పుడెల్ల మనస్సు (దానంతటదియే) రివ్వున పైకెగసి నిర్వికల్పస్థితిలో లీనమగుచుండెడిది.’’
987. ఈ (నా) మనస్సుయొక్క సహజప్రవృత్తి ఊర్ధ్వముఖము. అనగా నిర్వికల్ప సమాధిస్థితికి ఉన్ముఖమై యుండును. ఆ స్థితిని బొందినపుడిక క్రిందికి వచ్చుట కిచ్చగింపదు. మీ కోసము దానిని బలవంతముగా క్రిందికి లాగుచుండును. ఏదియో యొక చిన్న వాంఛ లేనిదే దానిని క్రిందికి లాగుట కష్టము. అందులకై ఏ హుక్కా పట్టుటయో, పానీయము త్రాగుటయో, ప్రత్యేకమైన యొక పదార్థమును దినుటయో, ఒకానొకని జూచుటయో- ఇట్టి వాంఛనొక దానిని గల్పించుకొని మనస్సునకు పదే పదే తెల్పుదును. అటుల చేసిననేకాని మనస్సు క్రిందికి (శరీరము మీదికి) రాదు. ఇట్లు వచ్చినను అంతలోనే మఱల మీదికి బోవుట కలదు. అపుడు దానిని అట్టివాంఛలచే మఱల క్రిందికి లాగవలసియుండును.
988. ‘ఓం తత్ సత్’ అనుమంత్రమునుండి ‘తత్’(‘అది’ అనగా బ్రహ్మము) అను పదము నుచ్చరించుట చేతనే శ్రీ గురుదేవుడు మహోత్తమమగు నిర్వికల్ప సమాధి స్థితిని బొందువాడు. ‘సత్’ (ఉనికి) అను పదము నుచ్చరించుటచే తద్వ్యతిరిక్తమగు ‘అసత్’అను భావము ఒకవేళ మనస్సునకు తట్టినను తట్టవచ్చును; పరమ పవిత్రమైన ఓంకారము గూడ ఇందులకు చాలనట్లుగనే తోచెను. కాని ‘తత్’అను పదమును గురుదేవుడుచ్చరించినంతనే ద్వైత ప్రపంచ భావములన్నియు నాతని మనస్సునుండి యదృశ్యమైపోయెడివి; పద సద్వి భేద మంతయు సంపూర్ణముగా సమసిపోయెడిది; సమస్తద్వంద్వాతీతమైన అద్వితీయ బ్రహ్మానుభవమున గురుదేవుడు లీనమై యొప్పువాడు.
989. ప్రశ్న: దేవా! తాము సమాధి స్థితిలో లీనమగునపుడు లేశమైనను తమకు ‘నే’నను స్ఫురణము ఉండునా?
ఉ. ఔను, సాధారణముగా కొంచెము ఉండును. బంగారు కణికపై చిన్న బంగారు రేకును అణుగదీసినప్పుడు పూర్తిగా అఱిగిపోకుండుట వంటిదిది. బహిఃప్రజ్ఞ యంతయు అదృశ్యమగును, కాని దైవము నేను బ్రహ్మానుభవము నొందుటకై అణుమాత్రమైన అహంత నుంచును.
కానియొక్కొక్కప్పుడు ఆతడు (భగవంతుడు) ఆ లేశమును గూడ నిర్మూలించును. ఇదియే మహోత్తమమైన (నిర్వికల్ప) సమాధి.

- ఇంకా ఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి