సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది వర్ణింప నలవికానిది- జీవుడు బ్రహ్మముగా మాఱునట్టి యఖండ పరిణామము. ఉప్పుబొమ్మ సముద్రపు లోతును గనుగొనుటకై అందు దుమికినదట కాని యది నీటిని తాకినంతనే కరగిపోయినదట! అపుడిక సముద్రము ఎంత లోతున్నదో వచ్చి చెప్పువారెవ్వరు!
గురుదేవుని నిరంతర బ్రహ్మానుభూతి
990. ‘‘స్వామీ! మీరు భగవంతుడు కలడని నమ్మెదరా!’’ అని యొకరు ప్రశ్నింప, ‘‘ఔను, నమ్మెద’’నని శ్రీ గురుదేవుడు సమాధానమొసగెను.
‘‘కలడని మీరు ఋజువు చేయగలరా?’’- ‘‘ఆహా!’’
‘‘ఎట్లు?’’- నిన్నిక్కడ నేనెట్లు చూచుచున్నానో అట్లే- ఇంతకంటె వేయి రెట్లు విస్పష్టముగా- భగవంతుని నేను చూచుచున్నాను గావున.’’
991. ఒక తార్కికుడు వచ్చి, ‘‘జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము లనగా నేని?’’ అని ప్రశ్నింప, గురుదేవుడిట్లు సమాధానించెను: ‘‘మహాశయా! నాకీ పాండిత్యపు గొడవ లేనియు- ఈ తల వెండ్రుక చిక్కులేవియు- తెలియవు. నాలో నున్న ఆత్మ, నాజగజ్జనని- నాకు తెలిసిన వివి రెండే.’’
992. నా శరీర స్థితిని జూచి హృదయుడిట్లనువాడు: ‘‘అంత బక్క శరీరమున అంత పారమార్థిక సంపదను- అంత దివ్య జ్ఞానమును- నే నెన్నడును కనలేదు!’’ శరీరము బలహీనముగానున్నను ఇతరులతో భగవత్ప్రసంగము చేయుటనే నెన్నడును మానలేదు. ఒకప్పుడు నేను కేవలము శల్యావశిష్టముగ నుంటిని; అప్పుడును పారమార్థిక విషయములను గూర్చి- శరీర స్పృహయే లేకుండ- గంటలకొలది ప్రసంగించువాడను; నాకిది బాగుగా జ్ఞప్తి.
గురుదేవుడెట్లు ప్రార్థించెను?
993. జగజ్జననిని ఈ విధముగా ప్రార్థించువాడను. ‘‘అమ్మా! ఆనందమరుూ! నీవు నాకు సాక్షాత్కరింపక తప్పదు.’’ మఱియొకప్పుడిట్లు వేడుకొనువాడను. ‘‘ఓ దీనబంధూ! ఓ దీనదయాళూ! నేను నీ విశ్వమునకు వెలియైతినా? జ్ఞాన హీనుడను, భక్తిహీనుడను, తపశ్శక్తి హీనుడను. నే నేమియు నెఱుగను. ప్రభూ! నీ కృపాకటాక్షమున నాకు నీవు దర్శనమీక తప్పదు.’’
994. అమ్మా! జగజ్జననీ! నాకు లోకులవలన గౌరవము వలదు, ఇంద్రియ భోగములు వలదు; గంగాయమునా శాశ్వత సంగమమువలె నాయాత్మ నీయందు లయించుగాక! - ఇదియే నేను గోరునది. అమ్మా! నేను భక్తిహీనుడను, యోగ హీనుడను, దీనుడను, నిస్సహాయుడను. నాకొకరి మెప్పు వలదు; నీ దివ్య పాదారవిందములయందే నా మనస్సు నిరంతరము నిలుచుగాక!
995. తల్లీ! నేను యంత్రమను, నీవు యంతవు; నేను గృహమను, నీవందుండుదానవు; నేను ఒరను, నీవు కత్తివి; నేను రథమను, నీవు సారథివి. నీవెటుల చేయించిన నే నటుల చేయుదును; నీ వెటుల పలికించిన నేనటుల పలుకుదును; నీ వెట్లు నడిపించిన నేనట్లు నడుతును;
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి