సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను’కాదు, ‘నేను’కాదు, అంతయు ‘నీవే’.
996. సత్యవ్రతుడగువాడు భగవత్సాక్షాత్కారము నొందుట నిశ్చయము. సత్యమున లక్ష్యము లేని వానికో, సర్వము క్రమముగా నశించును. నేనీస్థితిని (బ్రహ్మసాక్షాత్కారమును) బొందిన పిమ్మట పుష్పాంజలినై తల్లి కిట్లు విన్నవించువాడను: ‘‘అమ్మా! నీ జ్ఞానాజ్ఞానములను, నీ శౌచాశౌచములను, నీ శుభాశుభములను, నీ పుణ్యపాపములను అన్నింటిని నీవే గైకొని నాకు వినిర్మలభక్తిని మాత్రము ప్రసాదింపుము.’’ ఐనను నేనిట్లు అమ్మతో పలికినప్పుడు, ‘నీ సత్యాసత్యములను గూడ నీవే గైకొనుము’’ అని పలుక జాలకపోతిని. అమ్మకు నేనన్నిటిని మఱల అర్పించినను సత్యమును మాత్రము అర్పింపజాలనైతివి.
కీడు మేళ్లలో సమానముగనే భగవంతుడు కలడు
997. భగవత్సాక్షాత్కారముతో సమస్త కర్మములును తొలగిపోవును. నా పూజా కలాపము ఈ విధముగానే అంతమొందినది. కాళీ దేవాలయములో నేను పూజ చేయువాడను. సమస్తము చిన్మయమని ఆకస్మాత్తుగా ఒకనాడు నాకు విదితమైనది. పూజా పాత్రములు, వేదిక, ద్వారము- సర్వము చిన్మయమై గోచరించినవి. మానవుని, మానవులు, మృగములు, పక్షులు- సర్వము చిన్మయమే. నేనపుడు పిచ్చివానివలె నలువైపులను పూలను వెదజల్లనారంభిచితిని.చూచినదాని నెల్ల పూజించితిని.
శివార్చన చేయుచు, ఒకనాడు శివలింగముపై వజ్రము నుంచునుండగా, విశ్వమంతయు శివుడేయని నాకు గోచరించినది. అది యెట్లని నేను తర్కింపలేదు కాని నా హృదయమున ఈయనుభవము మెఱుపుదీగవలె మెఱసినది. నాటితో నా శివవిగ్రహారాధనము అంతమొందినది. ఒకప్పుడు పూవులను గోయుచుండగా, ప్రతి మూల మొక్కయు భగవంతుని విశ్వరూపము నలంకరించుచున్న పూగుత్తివలె గాన్పించినది. పూవులను గోయుటకదియే నాకు కడసారి.
998. ఒకసారి నాకొక దృశ్యము కానవచ్చినది. ఒకే ద్రవ్యము విశ్వరూపమును ధరించి సమస్త జీవరాసులతో నిండి యున్నట్లు కాన్పించినది. అయ్యది మనుష్యులు, పశువులు, తోటలు, బాటలు మున్నగు నన్నిటితోడను గూడిన మైనపుటిల్లువలె గోచరించెను. అన్నియు మైనముతో నిర్మాణమైనవే, సర్వము మైనమే!
999. నాకేమి కనబడునో తెలియునా? భగవంతుడే సర్వము నైనట్లు కాన్పించును. నరులుగాని, యితర జంతువులు గాని తలలు ఊపుచు, కాలుసేతుల నాడించుచుండు తోలుబొమ్మలలాగున కాన్పించును. భగవంతుడే వానిలోపల నుండువాడు.
1000. అమ్మ నన్ను భక్తుని స్థితిలో- విజ్ఞాని స్థితిలో- నుంచినది. అందుచేతనే రాఖాలు (బ్రహ్మానందస్వామి) తోడను ఇతరుల తోడను పరిహాసము చేయగలుగుచున్నాను. నేనే గనుక జ్ఞాని స్థితిలో నున్న పక్షమన, ఇయ్యది సాధ్యము కాకుండెడిది.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి