సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ స్థితిలో నాకు అమ్మ (కాళి)యే సర్వము నైయున్నట్లు కాన్పించుచున్నది. సర్వత్ర ఆమెయే- లోకేశ్వరియే- నాకు గోచరించుచున్నది. దుష్టులు కూడ- భాగవత పండితుని సోదరుడు కూడ- అమ్మయే యైయున్నదని కాళికాలయమున నాకు గోచరించినది. నేనెంత ప్రయత్నించి నను రామలాల్ తల్లిని దూషింపలేక పోతిని. అమ్మయే మఱియొక రూపమున ఆమెయై యున్నదని నాకు గాన్పించినది. బాలకలందు అమ్మ కానవచ్చుట చేతనే నేను వారిని పూజింతును. నా భార్య నా పాదము లొత్తును, కాని తరువాత నేనామెకు నమస్కరింతును. అమ్మ నన్నీ స్థితిలో నుంచుట చేతనే మీరు నమస్కరించినపుడు మఱల మీకు నమస్కరించుచుందును- నమస్కరింప వలసియున్నది. దుష్టుని గూడ నేనలక్ష్యము చేయజాలను. ఒక్క తులసీ దళమును- ఎంత చిన్నదై యున్నను, ఎండిపోయి యున్నను- భగవానునికి సమర్పింప వచ్చును.
1001. జగత్తు నాకెట్లు గోచరించునో తెలియునా? చెట్లు, పాదులు, మనుష్యులు. పశువులు, గడ్డిగాదము- మొదలైన వన్నియు తలగడగ లేబులవలె గోచరించును- ఇందు కొన్ని మృదువైనవి, మఱికొన్ని ముదుకవి; కొన్ని గుండ్రనివి; మఱి కొన్ని నలుచతురమైనవి. కాని, రుూ గలేబు లన్నిటిలోనుండునది ఒకే వస్తువు- దూది. ఇటులనే జగత్తులోని వస్తువులన్నియు అఖండ సచ్చిదానందమయిచే పూరింపబడియున్నవి.
అట్లా జగజ్జననియే అనేకమైన వలువలను దాల్చి ఈ యావరణము లన్నిటినుండియు తొంగి చూచుచున్నట్లు నాకు గోచరించును. నేనొకప్పుడు అనుక్షణము ఈ దృశ్యమును గాంచుస్థితిలో నుంటిని. ఈ నా స్థితిని గ్రహింపకుండ జనులు నన్నో దార్చుటకై వచ్చువారు. రామలాల్ తల్లి విలపించినది. ఆమెను జూడగా ఆలయములని అమ్మయే రుూ రూపమును దాల్చినట్లు నాకు తోచెను. నవ్వు ఆపుకొనలేక నేలపైబడి దొరలాడుచు నేనిట్లంటిని: ‘‘ఎంత చక్కని వస్తమ్రులను దాల్చినా నమ్మా!’’ ఒకప్పడు నేను కాళికాలయములో జగజ్జనని గూర్చి ధ్యానించుచుండ, ఆమె రూపమును అనుసంధానము చేయుట నాకు అసాధ్యమనిపించినది. కొంత సేపైన తర్వాత ఆమె యొక పూజా పాత్రము ప్రక్కనుండి చూచుచుండుట నాకు గానవచ్చినది. రూపమున నామె యిచటి ఘట్టమునకు స్నానమునకై వచ్చు రమణియను వేశ్యను బోలియుండెను.
నేనాశ్చర్యముతో నవ్వుచు నిట్లంటిని: ‘‘బాగుగనే యున్నది! ఈ దినము నీవు రమణివి కాగోరితివా! కానిమ్ము. నేటి యారాధనము ఈ రూపముననే స్వీకరింపుము’’. ఈ విధముగా అమ్మ నాకిట్లు బోధంచినది: ‘వ్యభిచారిణి గూడ నేనే. నా కంటె మఱేదియు లేదు.’’

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
- ఇంకా ఉంది