సబ్ ఫీచర్

సనాతన సంస్కృతి అనుసరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మధ్య రెండు వారాల్లో కేరళ ప్రాంతంలో ఇద్దరు యువతులు మానభంగానికి గురై భయంకరంగా హత్యకు గురయ్యారు. ఇంకా మొన్నమధ్య హైద్రాబాదులో ఒక ఇంజనీరింగు అమ్మాయి యాక్సిడెంటులో చనిపోయిందని, కాదు హత్యేనని ఇంకా ఎటూ తేలలేదు. ఇలా రోజూ వార్తాపత్రికలు తెరవగానే కనీసం వారానికి రెండుమూడు ఇలాంటి సంఘటనలను చదవటం బాధపడటం జరుగుతోంది. ఏదైతేనేం మనుష్యులలోని అమానుషత్వానికి నిండు ప్రాణాలు, మానాలు బలైపోతున్నాయి. వారి బాధ, తల్లిదండ్రుల బాధ ఏ ప్రభుత్వమూ తీర్చలేనిది. 2012 చివరలో జరిగిన ‘నిర్భయ’ సంఘటనల లాంటివి ఈ మూడేళ్ళలో ఎన్ని వెలుగులోకొచ్చాయో గణాంకాలు చెప్పడంకన్నా అసలు దీనికి మూలం ఎక్కడుంది అనే ఆలోచన ఎవరూ చేయటం లేదు. మన దేశంలో భార్యకాక మిగిలిన స్ర్తిలంతా తల్లి, సోదరిలతో సమానమైన వారని మన సనాతన ధర్మాన్ని ప్రవచించి అలా ఆచరించే వి ధంగా మన సంస్కృతీ సంప్రదాయాలను ఏర్పరచి సమాజ రచన చేయబడింది. దానికనుగుణంగా కుటుంబ వ్యవస్థ, పిల్లల పెంపకం, విద్యావిధానం ఏర్పాటుచేయబడ్డాయి. ఎంత కట్టుబాటుఉన్నా ఎక్కడో ఎప్పుడో ఏదో ఒక దుర్ఘటన జరిగి ఉండవచ్చు. కాని తరుచూ ఇలాంటి విచ్చలవిడితనం మన దేశ చరిత్రలో ఎన్నడూ చదవలేదు. చరిత్రలో మన భారతీయ రాజులు బద్ధశత్రువుకు సంబంధించిన స్ర్తినైనా సకల మర్యాదలతో మళ్ళీ వారి స్వస్ణలాలకు సాగనంపారు. రామాయణ కాలంలో కూడ రావణాసురుడంతటి రాక్షసుడు బలాత్కారంగా సీతనెత్తుకువచ్చాడు కాని ఆమె సమ్మతి లేకుండ ఆమెను తాకను కూడ లేదు. అలాగే మహాభారత కాలం లో కీచకుడు లాంటి వాళ్ళు ఇలాంటి అఘాయిత్యాలకు తలపడ్డా దైవం అనుకూలించలేదు. అటువంటి పుణ్యభూమిలో దాదాపు వారానికి రెండుమూడు మానభంగాలు హత్యలు జరుగుతున్నాయి.
తురకరాజులు దండెత్తి వచ్చి మన స్ర్తిలపై అత్యాచారాలు, మానభంగాలు చేస్తున్నారని ఆ కాలపు సమాజం స్ర్తిలను ఎంతో కట్టుదిట్టంగా భద్రంగా కాపాడుకునే విధంగా బాల్య వివాహాలు స్ర్తిలు ఎక్కువగా సమాజంలో బయట తిరగకుండా ఉండే విధంగా అప్పటి పెద్దలు తమకు తోచిన రీతిలో సమాజాన్ని స్ర్తిలను కొంతవరకైనా కాపాడుకోగలిగారు. కాని ప్రస్తు త కాలంలో స్ర్తి అన్ని రంగాలలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. కాని ఆమెకు భద్రత పూర్తిగా కరువైపోయింది. ఎప్పుడైనా సామాజిక సమస్యలను ప్రభుత్వం, చట్టాలు పరిష్కరించలేవు. ఎప్పుడైనా సమస్య ఉత్పన్నమయ నప్పుడు ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వంలోని వారూ ప్రజలలోనుం చి వచ్చినవారే కనుక అందరూ కలిసి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించవలసి ఉంది. ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో గాని విద్యా విధానంలోగాని జీవితపు వౌలిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనిపిస్తోంది. తురక రాజుల రాజ్యపాలన తరవాత వచ్చిన బ్రిటీషు వారి పాలనలో పాశ్చాత్యుల జీవిత విలువలు మనకు భిన్నమైనవి. వారికి భౌతికానందమే కాని వ్యక్తిశీలం విషయంలో ప్రాముఖ్యత లేదు. వారి రెండు వందల సంవత్సరాల పాలనలో మన దేశ ప్రజలను, సమాజాన్ని పూర్తిగా మన సంస్కృతికి, సంప్రదాయాలకు, విలువలకు వ్యతిరేకంగా మార్చగలిగారు. మనకు స్వాతంత్య్రం వచ్చాక కూడ పాశ్చాత్య ప్రభావం కలిగి ఉన్నవారే మనకు పాలకులయినారు. దాంతో స్వతంత్రం వచ్చాకే మనం మన విలువలు కోల్పోయి, మనవైన సంస్కృతీ సాంప్రదాయాలు మర్చిపోయి, ఎవరన్నా పెదద్దవాళ్ళు చెప్పినా లెక్కచేయకుండా భ్రష్ఠుపట్టిపోయాము. సమాజంలో మళ్ళీ మన భారతీయ సనాతన సంస్కృతీ సాంప్రదాయాలను కాలానుగుణంగా మార్పులు చేర్పులతో పునరుద్ధరించుకోవటమే దీనంతటికి పరిష్కారమనిపిస్తుంది. సనాతన సంస్కృతిలో పరిష్కారం కాని సమస్య అంటూ ఉండదు.

- కౌస్త్భు