సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఱియు సిగ్గు బిడియములను విడిచి యత్యాడంబరముగా శృంగారించుకొని బాహాటమైనచోట విలాసముగా గూర్చుండియుండు భోగకాంతలను గాంచినప్పుడును అల జగజ్జననియే వారియందు మఱియొక రూపమున క్రీడించుచున్నట్లు నాకు దోచును.
1005.
కాని మీరు ఇంకొక మెట్టు పైకెక్కిన యెడల మీకు బ్రహ్మజ్ఞానము లభించును. ఈ స్థితిలో నాకు సర్వము బ్రహ్మమే యైయున్నట్లు గోచరించును- ప్రత్యక్షముగా గాన్పించును. హేయముగాని, ఉపాదేయముగాని (పరిత్యజింప వలసినదిగాని పరిగ్రహంపవలసినదిగాని) యపుడిక నేమియునుండదు! ఎవ్వరిమీద నైనను కోపపడుట నాకపుడు అసాధ్యము.
ఒకప్పుడొకచోటికి బండినెక్కి వెడలుచుండగా, మేడముందరి వసారాలో నిలుచుండియుండిన యిద్దఱు భోగము పడతులను జూచుట తటస్థించినది. కాని, వారియందు నాకు సాక్షాజ్జననియే కాన్పించుటచే వారికి నమస్కరించితిని.
నాకీస్థితి కలిగినప్పుడు నేనిక కాళీమాత కేమియు అర్పింపజాలనైతిని. పూజనే చేయజాలనైతిని, అది చూచి దేవాలయ నిర్వాహకుడు నన్ను దూషింప నారంభించెను. కాని వాని దూషణలకు నాకెంతమాత్రము కోపమురాలేదు, సరికదా, నవ్వు వచ్చెను.
1006. ప్రపంచ వాస్తవ స్థితిని తనకెఱుకపరచిన యొక దివ్యదృశ్యమును వర్ణించుచు ‘శ్రీగురుదేవుడిట్లు పలికెను:
‘‘నాకిప్పుడేమి కాన్పించినదో మీకు తెలియునా? ఒక దివ్యదృశ్యము- జగజ్జనని దర్శనము! ఆమె గర్భిణీస్ర్తివలె గాన్పించినది, బిడ్డనుగని యామె ఉత్తరక్షణముననే మ్రింగివేసినది. మ్రింగునపుడు బిడ్డయందెం భాగము నోటిలోనికి బోయినదో అంత భాగమును శూన్యమైపోయినది! సర్వము శూన్యమని అమ్మ నాకు (ఇట్లు) తెల్పినది. మఱియు, నామె, ‘ప్రళయమా! రమ్ము, రమ్ము’అని యాహ్వానించుచున్నదాయనునట్లు కాన్పించినది.
తన వ్యాధిని గూర్చి గురుదేవుని యభిప్రాయము
1007. (అంత్యదశలో కంఠమునందలి వ్రణముచే) శ్రీగురుదేవుడు జబ్బుపడినప్పుడు శశధర పండితుడు సందర్శించి యిట్లు ప్రశ్నించెను: ‘‘రోగగ్రస్తమైన భాగమున మనస్సును కేంద్రీకరించి మీరేల నివారణ పొందరాదు?’’
గురుదేవుడు: భగవానునికర్పించిన నా మనస్సును రక్తమాంస పంజరమగు ఈ తుచ్ఛ కళేబరముపైకి ఎట్లు మఱల్పగలను?
శశధరుడు: పోనిండు, వ్యాధి నివారణార్థము అమ్మను మీరు ప్రార్థింపరాదా?
గురుదేవుడు: నా జగన్మాతను స్మరించినంతనే స్థూల శరీరము నా దృష్టినుండి తొలగిపోవును- అపుడిక దానితో నాకు సంబంధమేయుండదు, ప్రమేయమే యుండదు.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకా ఉంది