సబ్ ఫీచర్

క్లాపే.. ఆశీస్సు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ రోజు రామకృష్ణ-చంద్రకళ నటించిన ‘నోము’ చిత్రం చూశారు గోపాలకృష్ణ. అందులో కనిపించింది జయసుధ. తన పాత్రకోసం అమాయకమైన అమ్మాయిలా కనిపించే హీరోయిన్ కావాలి. జయసుధ అయితే బాగుంటుందని నిర్మాతలకు చెప్పారు గోపాలకృష్ణ.

అలా అనేకమంది దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో తర్ఫీదు పొందారు ఎన్.గోపాలకృష్ణ. అతనిలోని ప్రతిభను గమనించిన నిర్మాత గౌతమీ వెంకటరత్నం దర్శకత్వ అవకాశం ఇవ్వటానికి ముందుకు వచ్చారు. మరాఠీలో విజయవంతమైన ‘లక్ష్మణ రేష’ చిత్రాన్ని తెలుగులో రూపొందించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రానికి దర్శకుడిగా బాధ్యతలు నిర్వహించమని గోపాలకృష్ణను అడిగారు. అందుకు ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. కథ ప్రకారం జడ్జి పాత్రకోసం గుమ్మడిని ఎంపిక చేసుకున్నారు. ఇక మిగతా అన్ని పాత్రలకూ నటీనటులను మీరే ఎంపిక చేసుకోండి అని నిర్మాత స్వేచ్ఛనిచ్చారు. ఇదో పెద్ద సవాల్‌గా మారింది. మొదట వాణిశ్రీ, లక్ష్మి, భారతి తదితరులను హీరోయిన్ పాత్రకోసం సంప్రదించారు. కానీ వారు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో చాలా బిజీగా వున్నాం అని చెప్పారు. ఆ తరువాత ప్రభను అడిగితే, గంగాధరరావు కాంట్రాక్టులో వున్నాను అనడంతో మళ్లీ ప్రశ్నకు జవాబు దొరకని విధంగా తయారైంది. ఓ రోజు రామకృష్ణ-చంద్రకళ నటించిన ‘నోము’ చిత్రం చూశారు గోపాలకృష్ణ. అందులో కనిపించింది జయసుధ. తన పాత్రకోసం అమాయకమైన అమ్మాయిలా కనిపించే హీరోయిన్ కావాలి. జయసుధ అయితే బాగుంటుందని నిర్మాతలకు చెప్పారు గోపాలకృష్ణ. నిర్మాతలు మీ ఇష్టం అన్నారు. వెంటనే జయసుధ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సంప్రదించారు. హీరోయిన్ అవకాశమంటే వద్దంటామా అని వారు ఆశ్చర్యపోయారు. విజయా గార్డెన్స్‌లో మ్యూజిక్ సెట్టింగ్స్ ఉంటాయి, రమ్మన్నారాయన. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో జయసుధను హీరోయిన్‌గా ఎంపిక చేశామని గుమ్మడికి చెప్పారు గోపాలకృష్ణ. వెంటనే ఆయనకు చాలా కోపం వచ్చింది. సినిమా కథంతా ఈ అమ్మాయిపైనే కదా.. కొత్తమ్మాయిపై అంత భారం ఎలా వేస్తావు? అని గుమ్మడి అనడంతో అప్పటికి ఏదో చెప్పి జయసుధను, వారి తల్లిదండ్రులను పంపేశారు. పెద్ద హీరోయిన్‌ను పెట్టుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. కనుక ప్రస్తుతం లీడింగ్‌లో వున్న హీరోయిన్ అయితే బావుంటుందని గుమ్మడి సలహా ఇచ్చాడు. పైగా జయసుధకు తెలుగు సరిగా రాదు కదా అని ఎలా చేయిస్తావని ప్రశ్నించారు. చివరికి అనేక సంప్రదింపులు పూర్తయ్యాక జయసుధకే అవకాశం దక్కింది. సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ విచ్చేసి తొలి క్లాప్ ఇచ్చి ఆశీర్వదించారు. జయసుధను ఆయనకు పరిచయం చేస్తే, ఇలాంటి హీరోయిన్లు రావాలని తమ పక్క యువ కథానాయికల అవసరం చాలా వుందని కితాబిచ్చారు ఎన్టీఆర్. దాదాపు ఆరు రీళ్ల చిత్రం పూర్తయింది. నిర్మాత వద్ద డబ్బులు అయిపోయాయి. సినిమా ఆగిపోయింది. ఏం చేద్దామా అని అనుకుంటున్న సమయంలో కాకినాడ శ్రీదేవి థియేటర్ అధినేత భాస్కర్‌రెడ్డి వచ్చి ఆ చిత్రాన్ని టేకప్ చేస్తామన్నారు. మొదట ఒక్క జిల్లాకే తీసుకున్న ఆయన, సినిమా చూశాక అన్ని జిల్లాలు తానే తీసుకుంటానని ముందుకు వచ్చారు. దీంతో ఆయన పెట్టుబడితో సినిమా మళ్లీ ప్రారంభం అయింది. ఈలోపు జయసుధ కోరికపైనే చిత్రీకరించిన ఆరు రీళ్ల సినిమాను కె.బాలచందర్‌కు చూపించారు. ఆయన మెచ్చుకుని జయసుధకు మంచి భవిష్యత్తు వుందని, తన చిత్రంలో అవకాశమిచ్చారు. అదే ఆరురీళ్ల చిత్రాన్ని రామానాయుడు చూసి, సోగ్గాడు చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇవన్నీ చూసిన గుమ్మడి, తన అనుమానం పటాపంచలైందని, గోపాలకృష్ణ నిర్ణయం సరైనదేనని మెచ్చుకోవడం ఆనందించదగ్గ విషయమని ఆయన అంటారు. పంజు అరుణాచలం తమిళం, తెలుగులో రూపొందిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించమని గోపాలకృష్ణను అడిగారు. ‘స్వర్గానికి నిచ్చెనలు’ కథ సిద్ధమైంది. గోపాలకృష్ణ హీరోగా శోభన్‌బాబును ఎంపిక చేయాలనుకున్నారు. నిర్మాత మాత్రం నటుడు రామకృష్ణను ఎంపిక చేశారు. కారణం బడ్జెట్ ఎక్కువవుతుందని. ఆ చిత్రం విడుదలయ్యాక గోపాలకృష్ణకు మంచి పేరు వచ్చింది. మళ్లీ మూడో చిత్రానికి తొలి చిత్ర నిర్మాత షణ్ముఖం చెట్టియార్ దగ్గరకే వెళ్లారు గోపాలకృష్ణ. నువ్వు నిర్మాతగా మారతానంటే నేను సినిమా తీస్తానని ఆయన అన్నారు. కథను సిద్ధం చేయమన్నారు. అపుడు తొలి అడుగులు వేస్తున్న దర్శకుడు జంధ్యాలను మంచి కథ చెప్పమని గోపాలకృష్ణ అడిగారు. నా కథలు నాకే నచ్చవు, మీకేం నచ్చుతాయని ఆయన చమత్కరించారు. చివరికి గోపాలకృష్ణ రాసుకున్న కథతోనే ప్రభ, మురళీమోహన్, మోహన్‌బాబు, జయమాలిని ప్రధాన తారాగణంగా ‘మరో సీత కథ’ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం విజయవంతమైంది. మళ్లీ చంద్రమోహన్-జయసుధ జంటగా ‘్భలే కాపురం’ చిత్రం కూడా గోపాలకృష్ణను మంచి దర్శకుడిగా పరిశ్రమలో నిలబెట్టింది. అలా చిన్నారి చిట్టిబాబు, పార్వతి మళ్లీ పుట్టింది, రాజస్థాన్ రౌడీలు, ఫిలిం స్టార్, భలే అమ్మాయిలు, కామధేనువు లాంటి చిత్రాలు రూపొందించారు. దాదాపు 50 సినిమాలకుపైనే కోడైరైక్టర్‌గా పనిచేశారు.
లక్ష్మణరేఖతో జయసుధ టాప్ హీరోయిన్‌గా ఎదగడంతో అనేకమంది తమను పరిచయం చేయమని అడగడం ప్రారంభించారు. అలా అడిగినవారిలో శ్రీలక్ష్మి, జయసుధ చెల్లెలు సుభాషిణి, సంగీత దర్శకుడు మాస్టర్ వేణు తనయుడు భానుచందర్‌లతోపాటు చిరంజీవి కూడా వుండడం విశేషం. తొలి రోజుల్లో అవకాశంకోసం ప్రయత్నించిన ఆయన ఆ తరువాత గోపాలకృష్ణతో కలిసి ఓ చిత్రం చేద్దామనుకున్నారు. అలా షణ్ముఖం చెట్టియార్ నిర్మాణంలో 1976లో కృష్ణమూర్తి అనే దర్శకుడిని తీసుకుని ‘వడ్డికాసులవాడు’ అనే చిత్రాన్ని ప్రారంభించారు. కానీ దర్శకుడు సినిమా తీసే పద్ధతి నచ్చక షూటింగ్ ఆపేశారు. నిర్మాత గోపాలకృష్ణ దర్శకత్వంలోనే ఆ సినిమా పూర్తిచేయమని అడిగారు. నాలుగు నీళ్ళు పూర్తయిన ఆ చిత్రం కోసం బాలు పాడిన ఓ పాట చిత్రీకరణ కూడా జరిగింది. ఆగిపోయిన ఆ చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్లీ చేద్దామని చిరంజీవిని అడిగారు గోపాలకృష్ణ. మీరు చేస్తే బానే వుంటుంది. నాకేం అభ్యంతరంలేదు. అయితే మార్పులు చేర్పులు మీరు చేసేదానికన్నా మనిద్దరంకలిసి ఓ కొత్త చిత్రం చేస్తే మరింత బాగుంటుంది అని చిరంజీవి అనడంతో ఆ ప్రాజెక్టు కాస్త అటకెక్కింది. అలా చిరంజీవితో చిత్రం చేసే అవకాశం కొద్దిలోనే చేజారింది.
ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక గోపాలకృష్ణను ప్రత్యేకంగా పిలిచి ప్రభుత్వానికి సంబంధించిన పది డాక్యుమెంటరీ చిత్రాలను రూపొందించే బాధ్యతను అప్పగించారు. విశేషమేమిటంటే, అలా రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాలన్నింటికీ నంది అవార్డులు వచ్చాయి. నాపై ఆయన అంత నమ్మకం వుండేదని గుర్తుచేసుకుంటారు గోపాలకృష్ణ. ఆ తరువాత భాగ్యనగర్ స్టూడియో ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్రారంభించి అనేకమంది కొత్త నటీనటులను తీర్చిదిద్ది పరిశ్రమకు పరిచయంచేశారు. ఎందరో మహానుభావులు పేరుతో గొప్పవారి విశేషాలను 15 ఎపిసోడ్లు రూపొందించారు డాక్యుమెంటరీలుగా. ఆవు భారతదేశపు సంపద అన్న ఆలోచనతో కామధేనువు చిత్రాన్ని లక్ష రూపాయలతో చిత్రీకరించారు. ఆ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. గోమాతపైనే దాదాపు ఏడు పుస్తకాలు రాశారాయన. అవన్నీ టిటిడివారు వందేగోమాతరం పేరుతో అచ్చువేశారు. ఆధ్యాత్మికతపై దాదాపు 30 గ్రంథాలు రాశారు. మహిళా స్వాతంత్య్రయోధుల కథలతో ఫ్రీడం పార్క్ పేరుతో డాక్యుమెంటరీలు రూపొందించారు. అవయవదానం, కాలుష్యనివారణ, భారత కీర్తిమూర్తులు పేరిట పింగళి వెంకయ్య, బంకించంద్ర ఛటోపాధ్యాయ, రవీంద్రనాథ ఠాగూర్‌లపై డాక్యుమెంటరీలు రూపొందిస్తే నంది అవార్డులు దక్కించుకున్నారు. ప్రస్తుతం గోతులాభారం, గోకళ్యాణం, గోసీమంతం అంటూ ఓ ఉద్యమంలా గోవు గురించి పనిచేస్తున్నారు. భారతదేశ ఆర్థిక సంపద గోవు అని తెలియజెప్పే ప్రయత్నంలో ఉన్నానంటారాయన. ఇండియన్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన రూపొందించిన వరల్డ్ ఫిలిం ఫ్లాగ్ నమోదైంది. భారతీయ సినిమా మహనీయలు అనే గ్రంథంతోపాటు పయనీర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా, ది బర్త్ ఆఫ్ సినిమా లాంటి ఇంగ్లీషు గ్రంథాలు కూడా తెలుగు పరిశ్రమకు అందించారాయన. జాతీయంగా అంతర్జాతీయంగా అనేక ఫిలిం ఫెస్టివల్స్‌లో పదవులు నిర్వహించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తాను రూపొందించిన గోవుల చిత్రాల గురించి, గ్లోబల్ ఫిలిం ఫెటర్నిటీ జెండా గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడమే తన బాధ్యత అంటూ ముగించారాయన.

-సరయు శేఖర్, 9676247000