సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి శరీర విషయమై (ఏమనిగాని) ప్రార్థించుట నాకు అసాధ్యము.
1008. గురుదేవుని వ్యాధి తీవ్రమైనప్పుడాతడెట్టి యాహారమును తినజాలకుండెను; మాటలాడుట కూడ మిక్కిలి కష్టముగానుండెను. ఆ స్థితిలో నాతడిట్లు వచించెను: ‘‘నేనిప్పుడనేకముఖముల మూలమున మాటలాడుచు, భుజించుచున్నాను. సర్వాత్మలకు నేను ఆత్మను, నాకు అనంతముఖములున్నవి. నేనఖండాత్మను, ఈ యాత్మ మానవ చర్మముచే గప్పబడియున్నది. అందొకానొక తావున గొంతులో పుండు బయలుదేరినది. శరీరము రోగగ్రస్తమైనప్పుడు మనస్సును బాధించును. వేడి నీరు పడి శరీరము బొబ్బలెక్కినప్పుడు మనము, ‘ఈ నీరు నన్ను కాల్చినది’అని నీటిని దిట్టుదుము, కాని కాల్చునది వేడిమికాని నీరు కాదు. బాధయంతయు వ్యాధియంతయు శరీరమునందే, శరీరమునకే; కాని ఆత్మ సమస్తబాధాతీతము, సమస్త రోగాతీతము- వ్యాధులును బాధలును దానినంటజాలవు.’’
1009. (వ్రణ బాధ కలిగిన కంఠమును జూపుచు) దీని మూలమున గ్రుక్కెడు పాలైనను మ్రింగజాలకున్నాను. కావున కొంచెము ఏమైనను తినగలుగునట్లు చేయుమని అమ్మను ప్రార్థించితిని. కాని, అమ్మ యందఱను జూపుచునిట్లు వచించెను: ‘‘ఏల? ఇందఱ ముఖముల మూలమును నీవు భుజించుటలేదా!’’ అమితమైన లజ్జచే నేనిక మాటాడలేదు.
1010. శరీరమునకు అపరిమిత బాధ సంభవించినను నరుడెట్లు ఆత్మవిచారము చేయవలయునో, ఆత్మజ్ఞానమున నెలకొని యుండవలయునో, బోధించుటకై అల జగన్మాత నాకీ వ్యాధిని గల్పించినది. ప్రాణములను తోడివేయు బాధ చేతను భరింపరాని యాకటిజిచ్చు చేతను శరీరము సంకటపడుచున్నను, కాసంత యుపశాంతి గల్గించుట మానవశక్తికి అసాధ్యమైనను గూడ ఆత్మయే శరీరాధిపతియని అమ్మ నాకు దెల్పుచున్నది. ఆత్మ ఇంద్రియాతీతమగు పరంజ్యోతియని, ఆత్మజ్ఞాన మొక్కటియే వాస్తవమని, సిద్ధత్వమును సాధించినప్పుడే సమస్త బంధవిమోచనమగునని విశ్వాసహీనులకును సంశయాత్ములకును నమ్మకము గలుగజేయుటకై దివ్యమాత శరీరమునకీ వ్యాధి గల్పించినది.
1011. అంత్య దశలో శ్రీగురుదేవునకు వ్యాధి సంభవించినప్పుడు శిష్యులు వ్యాధి నివారణార్థమై భగవానుని ప్రార్థింపుడని- తమకొఱకేనియు మఱికొంత కాలము శరీరము నిలుచుటకై భగవానుని వేడుకొనుడని- మనఃపూర్వకముగా బ్రార్థింప గురుదేవుడిట్లు పలికెను: ‘‘సరే కాని, రుూ విఊయమై నేను దేవునకు నివేదించిన లాభములేదు. పరమేశ్వరేచ్ఛయే జరుగుకాక! నేనును నా జగదీశ్వరియు శాశ్వతముగా నేకమైతిమని నాకిపుడు విస్పష్టముగా గోచరించుచున్నది. కృష్ణునితో రాధ యిట్లు పలికెను: ‘ప్రాణప్రియా! నీవిక నా హృదయముననే నెలకొని ననే్నలుకొనుము, నీ మానవ రూపమున నాకిక గోచరింపకుము.
- ఇంకాఉంది