సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని వెంటనే యామె మానవ రూపమున కృష్ణుని గాంచుటకై తహతహలాడెను. ప్రాణేశ్వరుడగు కృష్ణుని గాంచుటకై యామె హృదయము పరితపింప సాగెను. కృష్ణుని గాంచనితో, జీవితము దుర్భర మనిపించెను. కాని (యామె కోరిక ప్రకారము) భగవదిచ్ఛయే జరుగవలసి యున్నది కదా! అందుచే కృష్ణుడు చాలకాలము వఱకు మఱల మానవ రూపమున ఆమెకు సాక్షాత్కరింపలేదు.’’
మానవత్వమును దైవత్వమును గురుదేవునందు సమ్మేళనమొందిన విధానము
1012. నా హృదయమునకు నిజముగా కంటకములవలె గ్రుచ్చుకొను మూడుమాటలు కలవు: అవి యివి- (1) గురువు, (2) కర్త, (3) బాబా (తండ్రి). భగవంతుడొక్కడే గురువు- జగద్గురువు. (చూ.638.) నాజగజ్జననియే సమస్త కార్యముల నొనర్చునది (కర్త్రి). నేనామె చేతిలోని ఉపకరణ మాత్రమను. సదా నేనామెబిడ్డనని భావించుకొనుచుందును.
1013. సుప్రసిద్ధుడైన యొక పండితునితో తన సమావేశమును గూర్చి శ్రీగురుదేవుడిట్లు పలికెను: ‘‘పండితుడు నన్ను జూచుటకై వచ్చుచున్నాడని విన్నంతనే భయపడితిని. ఏలన, నే గట్టుకొనిన బట్టను గూర్చియేనాకు స్మృతి లేదు. నాతో ఆతడు సంభాషించునెడ నేనేమి సమాధానము చెప్పవలయునో నాకు తోచలేదు. అంతట అమ్మతో నిట్లంటిని: ‘నిన్ను విడిచి నేనన్య మెఱుగను- ఈ శాస్తమ్రులు, గీస్తమ్రులు నాకేమియు తెలియవు. అందుచే నిచట నున్నవారితో నిట్లు చెప్పితిని: ‘మీరందఱును ఇచట గూర్చుండుడు. మీరిక్కడ నున్నారనిన నాకు ధైర్యము. పండితుడు సరిగా వచ్చిన పిమ్మట నా కింకను కొంచెము భయము వేయుచునేయుండెను. అతనివైపు తదేకముగా జూచుచు, అతని మాటల నాలకించుచు, నిశ్శబ్దముగా కూర్చుంటిని. అప్పుడే అమ్మ నాకు పండితుని మనస్సును పూర్తిగా విప్పి చూపుచుండుట గాంచితిని. వివేక వైరాగ్యములు లేని యెడల శాస్తమ్రులను ఊరక వల్లించిన నేమి లాభము? (తన శరీరమును జూపుచు) ఇచట నేదియో శిరస్సునకు ప్రాకిపోవుచున్నట్లు తోచెను. భయమంతరించినది, శరీర స్మృతియే సమసెను. ముఖ మెత్తితిని, నోటినుండి మాటలు ప్రవహింపసాగెను. వాగ్రూపమున వెలువడుచున్న నా భావముల నెవ్వరో మఱల మఱల పరిపూర్ణ మొనర్చుచున్నట్లు నాకు దోచెను. కామారిపుష్కరమున జనులు ధాన్యము గొలుచునపుడు ఒకడు వెనుకనుండి ధాన్యమును త్రోయుచుండ మఱియొకడు గొలుచుచుండును. ఇదియు నిట్టిదే. ఏయే విషయముల గూర్చి ప్రసంగించినో నాకే తెలియదు. నాకు గొంచెము బాహ్య స్మృతి వచ్చినంతనే పండితుని జూచుసరికి ఆతడు అశ్రువులతో శరీరము దడిసిపోవ నేడ్చుచుండెను. అప్పుడప్పుడు నాకీ స్థితులు గలుగుచుండును.
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
- ఇంకాఉంది