సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇట్లాలోచించుచు, ‘‘ఇపుడు ఆకస్మికముగా నన్నొక పెద్దపులి వచ్చి గుటుక్కున మ్రింగెనా!’’ అని ఊహింపగనే క్షణములో గాండ్రుమని ఒక పెద్దపులి వానిపై నురికి మెడ కొరికి నెత్తురు పీల్చనారంభించెను. ఇటులాబాటసారి ప్రాణములు గోల్పోయెను.
సాధారణముగా లోకుల గతి యిట్లే పరిణమించుచుండును. కీర్తి గౌరవములను వాంఛించి భగవంతుని ప్రార్థించిన పక్షమున, మీ కోరికలు కొంతవరకు తప్పక సిద్ధించును. కాని వాని వెనుకనే పెద్దపులి దాగియున్నదని నమ్ముడు. రోగము, శోకము, ధనహాని, మానవహాని మొదలగు నీ పెద్దపులులు సజీవమైన పులికంటే వేయిరెట్లెక్కువ భయంకరములు కదా!
పూలమ్మువాని యిల్లు చేరిన పల్లెపడుచులు
1061. కొందరు పల్లెపడుచులు సంతనుండి ఇంటికి బోవుచు, దారిలో ప్రొద్దుగుంకి వడగండ్లవాన వచ్చినందున సమీపమునన్ను యొక పూలమ్మువాని యిల్లు చేరిరి. ఆ వర్తకుడు దయదలచి వారిని తాను పూవులు పెట్టుకొను వసారా గదిలో ఆ రాత్రి పండుకొననిచ్చెను. అందు పరిమళముగల పూవులు తట్టలకొలది యుండుటచే ఘుమఘుమ సువాసన వచ్చుచుండెను. కాని యా సువాసన పల్లెపడుచులకు దుర్భరమై వారికొక కునుకైనను బట్టనీయకుండెను. తుదకొకతె యందులకు నివారణోపాయము గనిపెట్టును. ఆమె యిట్లు పలికెను: ‘‘ఖాళీగా నున్న మన చేపల బుట్టలపై గొంచెము నీళ్ల చుక్కలు చల్లి వానిని మన దగ్గర బెట్టుకొందము. మనకు నిద్రపట్టకుండ జేయుచున్న రుూ పూలవాసన కిదియే విరుగుడు’’. పల్లెపడుచులందరును ఈ సదాలోచనకు సంతోషపూర్వకముగా సమ్మతించియటులనే చేసిరి. అరగడియలో వారందరును గుఱ్ఱుపెట్టనారంభించిరి.
అభ్యాసమెంత గొప్పదో! సంసారిక దుశ్చితలలో బుట్టి పెరిగి, పేడపురుగువలె ఆ మాలిన్యముననే జీవించు కలవాటుపడిన లౌకికుని గతియు నిట్టిదే. పవిత్రత, వైరాగ్యము, త్యాగము బ్రకాశించు తావున నట్టివాడు నిమిషమైనను మనజాలడు కదా! అట్టి వాతావరణమున నాతడు ఉక్కిరిబిక్కిరియై పోవునుగదా!
సమాధి నిమగ్నుడైన యోగి
1062. ఒక యోగి సమాధి నిమగ్నుడై బాటప్రక్కను బడియుండెను. ఒక దొంగ యా త్రోవను బోవుచు వానిని జూచి ‘‘వీడు దొంగయై యుండవలయును. రాత్రి కొన్ని యిండ్లు దోచి అలసటచే నిక్కడ పడి నిద్రపోవుచున్నాడు. పోలీసువారు వచ్చి త్వరలోనే వీనిని బట్టుకొందురు. కాబట్టి నేను త్వరగా నిక్కడినుండి పారిపోవుట మంచిది’’ అనుకొనెను. ఇట్లు ఆలోచించుచు వాడు పరుగెత్తెను. ఇంతలోనొక త్రాగుబోతు వచ్చి యోగిని జూచి యిట్లు పలికెను. ‘‘ఓహో! బావా! తప్ప తాగి రుూ మురికి కాలువలో బడిపోయినావా! ఊహు! నేనే నయము.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి