సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒరే నీకంటె నేనే కైపు ఆపుకొని పడిపోకుండ ఉన్నాను! చూడు నా మజా!’’- తుదకొక సాధువు వచ్చి సమాధిమగ్నుడైన యొక మహనీయుడచట పడియుండెనని గ్రహించి యాతని చెంత గూర్చుండి పాదములొత్తనారంభించెను.
(నిజమైన మహత్త్వమును పవిత్రతను గ్రహింపకుండ మన లౌకిక ప్రవృత్తులిట్లు మనలను నిరోధించుచుండును)
పల్లెవాండ్ర దివ్యావేశము : అర్చకుని యన్నము
1063. అర్చకులనుగూర్చి శ్రీగురుదేవుడు చైతన్య చరిత్ర నుండి ఒక కథను జెప్పుచుండెడివాడు. భావసమాధి నిమగ్నుడై శ్రీచైతన్యుడు సముద్రమున బడినప్పుడు పల్లెవాండ్రు వలవేసి పైకి దీసిరి. శ్రీచైతన్యదేవుని శరీర సంస్పర్శచే వారికొక విధమైన పారవ్యము గలిగెను. అంతట వారు తమ పనులనన్నింటిని విడిచిపెట్టి హరినామస్మరణ చేయుచు పిచ్చివారివలె తిరుగసాగిరి. వారి బంధువులెట్లును ఈ విచిత్ర వ్యాధికి చికిత్స జేయజాలక, ఉపాయాంతరముగానక, తుదకు శ్రీచైతన్య దేవునియొద్దకే వెళ్లి మొరపెట్టిరి. శ్రీచైతన్యుడిట్లు పలికెను: ‘‘ఏ పూజారియింటికైనను బోయి కొంచెమన్నము దీసికొనివచ్చి వారి నోట బెట్టుడు. దానితో ఆ మైమరపు తగ్గిపోవును’’. వారటుల చేసినంతనే యా పల్లెవాండ్ల్రు పారవశ్యమును గోల్పోయి యథాస్థితికి వచ్చిరి.
(ఆత్మవికాసమును నిరోధించుటలో ఐహిక జీవనము యొక్కయు అపవిత్రత యొక్కయు ప్రభావమిట్టిది)
యజమానుడనని నటించిన సేవకుడు
1064. ఒక ధనికుడు తన ప్రధాన సేవకునకు ధనయాస్తినంతయు సంరక్షించు నధికారమొసగెను. ఎవ్వరైనను ఆ సేవకుని, ‘‘ఈ యాస్తి యెవరి’’దని యడుగనాతడు, ‘‘అయ్యా, ఇదంతయు నా సొత్తే, ఈ యిండ్లు, తోటలు-అన్నియు నావే’’యనువాడు. ఈ విధముగా జెప్పుచు, ఆతడహంభావముతో గన్నుమిన్ను గానక సంచరింపసాగెను. ఒకనాడాసేవకుడు తన యజమానుని యాజ్ఞకు వ్యతిరిక్తముగా తోటలోని చెఱువులో జేపలుపట్టుట తటస్థించెను. ప్రారబ్ధవశమున సరిగా నప్పుడే యజమానుడచటికి వచ్చి రుూ మాయలమారి చేయుచున్న పనిని జూచెను. సేవకుని యవిధేయతను అక్రమమును గాంచి యాతడు ఆగ్రహపడి, వెంటనే యుద్యోగమునుండి యాతని వెడలగొట్టుటయేకాక, నలువురును జూచుచుండ మొగము వాచునట్లు చీవాట్లుపెట్టెను; మఱియు నాతడార్జించిన దానిని గూడ నూడలాగికొనెను. పాపము, ఆ నిర్భాగ్యుడు తన సొంత సొత్తగు ప్రాత గినె్నలు, గుడ్డలు గల రేకుపెట్టెను గూడ దిగవిడిచి పోవలసిన వాడయ్యెను. దురభిమానమునకు ఫల మిటులుండును.
మంగలి: యేడు బంగారు గోతములు
1065. మంగలి యొకడు భూతము ఆవహించిన చెట్టుక్రిందనుండి పోవుచు, ‘బంగారుతో నిండిన యేడుగోతములు నీకు గావలయునా?’’ అను ధ్వనిని వినెను. - ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి