సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఆ మంగలి యిటునటు చూడగా నెవ్వరును గానరాలేదు. ఏడు గోతముల బంగారము నిచ్చెదనను శబ్దమెటులైనను వానికి బేరాసను గల్గింపనాతడు, ‘‘ఆహా! తీసికొందు’’నని గట్టిగా నఱచెను. ‘‘ఇంటికి బొమ్ము, నేనాగోతములను నీ యింటికి జేర్చినాను’’ అను ప్రతివచనము వెంటనే వినవచ్చెను. ఈ విచిత్రమెంతవఱకు నిజమో కనుగొందమను నాత్రముతో నాతడింటికి బరుగెత్తెను. ఇల్లుచేరి చూచుసరికి గోతములు కట్టెదుటనుండెను! వానిని విప్పిచూడ నొకటి తప్ప మిగిలినవన్నియు బంగారు నాణెములతో నిండియుండెను. మంగలి మనస్సులో నిపుడొక తీవ్రమైన కోరిక పుట్టినది. ఏడవ గోతమును గూడ దాను నిండింపవలయుననియు, లేనిచో దనయానందమునకు వెలితి కలుగుననియు నాతడు తలచెను. అందుచేనాతడు తన యింటిలోని వెండి నగలను బంగారు నగలను అన్నిటిని అమ్మివైచి వానిని వరహాలుగా మార్చి యాగోతములో వేసెను. కాని యాగోతము నిండదే! అది యెప్పటి యట్లే యుండెను. అందువలన మంగలికి జాల ఆరాటము గలిగెను. తానును కుటుంబమును తిన్నగా దిండి తినక, మాడి మఱికొంత ధనము ప్రోగుచేసి యాగోతములో వేసెను. కాని విచిత్రమైన యాగోత మెప్పటివలె అసంపూర్ణముగనే యుండెను. అందుచే నాతడొకనాడు రాజును సందర్శించి తన రాబడి కుటుంబ పోషణకై చాలకున్నదని చెప్పి తన జీతము హెచ్చుచేయింపుడని కోరెను. ఈ మంగలి మీద రాజునకు అభిమానముండుటచే, ఆతడు గోరగనే రాజు వాని జీతము రెట్టింపు చేసెను. ఈ జీతమంతయు మంగలి కూడబెట్టి గోతములో వేయుచుండెను గాని యా విచిత్రపు గోతము నిండదే! తుదకామంగలి యింటింటికి దిరిగి తిరిబిచ్చమెత్తనారంభించి యా సొమ్మును తన నెల జీతమును అంతయు ఆ వింత గోతములో బడవేయసాగెను. కానియది యెప్పటివలెనే యుండెను- అది నిండు సూచన లేమియు గాన్పింపవయ్యె. నెలలు గడుచుచుండెను, కాని యేడు గోతముల భాగ్యముగలిగిన యానిర్భాగ్యపు మంగలి దుఃఖము నానాటికి హెచ్చుచుండెను. రాజు వాని దైన్యమును దురవస్థను గనిపట్టి యొకనాడిట్లు ప్రశ్నించెను: ‘‘ఓరీ! నీ జీతమిప్పుడున్న దానిలో సగమై యున్నప్పుడే ఎంతో ఆనందముగను, ఉల్లాసముగను ఉండెడివాడవే. కాని యిప్పుడు రెట్టింపు జీతము సంపాదించుకొనుచున్నను అతి దీనముగా, బిక్కమొగము వేసికొని యుండుటకు కారణమేమి? నీకేమియు కీడు వాటిల్లలేదుకద? ఒకవేళ ‘ఆ యేడు గోతములు’ను నీకు తటస్థపడినవా యేమి?’’ ఈ మాటలు విని మంగలి యులికిపడి, ‘‘మహాప్రభూ! ఎవరా సంగతిని ఏలినవారికి వినిపించినారు?’’అనెను. రాజిట్లు పలికెను: ‘‘నీకు దెలియదా? ఎవరి కాయేడు గోతములను యక్షుడు దత్తము చేయునో వానియందీ లక్షణములు కాన్పించును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి