సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకును యక్షుడీగోతములను దీసికొమ్మని రుూయబోయెను; కాని యాధనము, ‘దాచుకొనుటకా, వ్యయించుటకా?’యని నేనడుగగా, యక్షుడు మాఱు పలుకకుండ బాఱిపోయినాడు. ఆ ధనము ఎవరును వాడుకొనదగినది కాదని నీకు తెలియదా? అది చేచిక్కినవారికి దానినింకను గూడబెట్టవలయుననియే కాని వ్యయింపవలయునని బుద్ధిపుట్టదు. తత్ క్షణమే పోయి యాధనమును తిరిగి యిచ్చివేయుము’’ఈ సదుపదేశమును విని మంగలి బుద్ధితెచ్చుకొని యక్షుడావహించిన యాచెట్టు కడకుబోయి, ‘‘ఓ యక్షుడా! ఇదిగో, నీ బంగారము. నీవే తీసికొనుము’’అనెను. ‘‘సరే’’యని యక్షుడు మాఱుపలికెను. మంగలి యిల్లుచేరి చూచుసరికి ఆ యేడు గోతములును ఎంత విచిత్రముగా వచ్చెనో అంత విచిత్రముగనే అదృశ్యమైపోవుటయేగాక, వానితోపాటు తాను యావజ్జీవము పాటుపడి సంపాదించిన ధనముకూడ ఎగిరిపోయినది!
లోకమున గొందఱి స్థితి యిటులుండును. నిజమైన యాదాయమేదియో, వ్యయమేదియో తెలియనివారికున్న దంతయు నాశనమగును.
మేకపిల్ల: తంగేడు పువ్వులు
1066. వైశాఖ మాసమున నొక చిన్న మేకపిల్ల తన తల్లికడ నాటలాడుకొనుచుండెను. ఉల్లాసముగా అదియొక కుప్పిగంతువైచి తల్లితో నిట్లనియెను: ‘‘అమ్మా! అమ్మా! అవిగో, తంగేడు చెట్లు. వాని పూలను నేను గడుపార మేయుదును.’’ అందులకు తల్లి యిట్లనియెను: ‘‘బిడ్డా! ఆ పూలను నీవు మేయగలుగుట యంత తేలికయైన పనికాదు. తంగేడు పూవులు నీకు జిక్కుటకు ముందనేక గండములు గడవవలసి యున్నది. రాబోవు భాద్రపదాశ్వయుజ మాసములు నీకంతగా శుభదినములు కావు! ఎవరేని నినె్నత్తుకొనిపోయి దుర్గాదేవికి బలి రుూయవచ్చును. అది తప్పిన, భయంకరమైన కాళీపూజ వచ్చును; అదృష్టవశమున ఆ గండము కూడ తప్పినను, ఇంకను జగద్ధాత్రిపూజ యున్నది. ఆ సమయమున మన జాతిలో మిగిలియున్న మగ సంతతినంతయు నించుమించుగా జాతరలో గడతేర్తురు. మహాదృష్టవశమున నీవీ గండములన్నిటిని గడచి బ్రదికి పెద్దవాడవైన యెడల, దీపావళినాటికి తంగేడు పూల విందారగింతువు గాని లెమ్ము! అపుడు మంచి తంగేడు పూవులు దొరకగలవు కూడాను.’’
ఈ కథలోని మేకపిల్లవలె మన నవవనోత్సాహమ కల్పించు మనోరథములన్నిటికిని తలలూపరాదు-వానిని దీర్చుకొందమను అత్యుత్సాహము కూడదు. మఱియేమన, జీవయాత్రలో సంభవించు గంతములనేకములని మదినుంచుకొని గొంతెమ్మ కోరికలను సాధ్యమైనంతవఱకు జంపుకొనుటయే మేలు.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి