సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామమే బంధ కారణము
‘సంసారము నంటని సంసారి’
1067. సంసార మాలిన్యము నంటకుండ సంసారమున నుండుట గృహస్థులకు సుసాధ్యమేయని నవనాగరిక విద్యాధికుడొకడు శ్రీ గురుదేవునితో వాదింపసాగెను. అప్పుడు గురుదేవుడు వాని కిట్లనియెను: ‘‘సంసారము నంటని నేటి నీ సంసారి’యనగా నెట్టివాడో నీకు దెలియునా? తాను సంసారమాలిన్యము నంటనివాడు కావున, డబ్బుతో దానెట్టి జోక్యము పెట్టుకొనడు కావున, తన గృహకృత్యములను ఆదాయమును వ్యయమును అన్నిటిని భార్యయే పరిపాలించుచుండును. అందుచే నెవ్వడైన నొక బీదబ్రాహ్మణుడీ ‘గృహాధిపతి’ని యాచింపవచ్చిన పక్షమున నీతడిట్లనును: ‘అయ్యా! నేనెన్నడును ధనము తాకను; నన్ను యాచింపవచ్చి నీవెందులకు వృథా కాలయాపన చేసెదవు?’ ఆ బ్రాహ్మణుడు అతి దీనముగా ప్రార్థించుచు, పీడించువాడైన పక్షమున, ‘సంసారము నంటని రుూ సంసారి’ విసుగుకొని తనలో దానిట్లనుకొనును: ‘వీనికేదైన నిచ్చినగాని వీనిపోరు తప్పించుకొను సూత్రము లేదు.’ అందుచే నాతడు, ‘సరే, రేపు రావయ్యా, వీలైనంతవఱకు జూచెదను’అనును. ఈ ‘లోకాదర్శగృహస్థుడు’ లోనికి బోయి భార్యతో నిట్లనును: ‘ఇటు చూడు, ఒక బీద బ్రాహ్మణుడు చాల అవస్థపడుచున్నాడు. వానికొక రూపాయి నిత్తము.’
‘రూపాయి’యను మాట చెవిని బడగనే భార్య రుద్రరూపము దాల్చి సాపేక్షముగా, ‘ఆహా! ఏమి ఔదార్యమండి! వెనుకముందు జూడకుండ బారవేయుటకు రూపాయలు మీకు పులివిస్తరాకులో, ఱాళ్లో!’ ఆ గృహయజమానుడు నట్టుచు, ‘అబ్బే! ఆ బ్రాహ్మణుడు చాల పేదవాడు, అంతకంటె దక్కువిచ్చిన బాగుండదు’అని ప్రార్థనా పూర్వకముగా మనవి చేయును. ‘వీలుకాదు, ఒక్క బేడకంటె ఎక్కువ ఇచ్చుటకు వీలుకాదు. ఇదిగో బేడ. మీకిష్టమువచ్చిన దీని నీయవచ్చును’అని భార్య ‘నిర్మొహమాటముగా’ బలుకును. కాని యా ‘బాబు’ సంసారమాలిన్యము నంటని సంసారి కావున తన భార్య యిచ్చిన దానినే స్వీకరించును. మఱునా డాయాచకునకు దక్కున దాబేడయే.
‘‘సంసారము నంటమని చెప్పుకొను మీ సంసారులు నిజముగా స్వాతంత్య్రహీనులు- తెలిసినదా? కుటుంబ వ్యవహారములను స్వయముగా జక్కబెట్టుకొనరు కావున జాలయోగ్యులమనియు పావనులమనియు తలపోయుచుండు వీరు నిజముగా భార్యచే జీకటి మొట్టికాయలు తిను భార్యాదాసులు. కాబట్టి వీరు సామాన్య మానవులనిపించుకొనుటకు గూడ దగరు.’’
గోవింద దేవాలయార్చకులు
1068. పూర్వపు జయపురమందలి శ్రీ గోవింద దేవాలయార్చకులు పెండ్లి చేసికొనువారుకారు. అప్పుడు వారాత్మ తేజోవిరాజితులై యుండెడివారు.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి