సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ బ్రాహ్మణుని దైన్యముచూచి యామె, ‘‘అయ్యో, పాపము! ఈ బ్రాహ్మణుడు చాలా దురవస్థలో నున్నాడు’’ అని జాలిపడెను. ఆ బ్రాహ్మణుడు వెంటనే యిట్లనెను: ‘‘నీవు బాబుగారితో నొక్కమాట చెప్పితివా నాకుద్యోగము దొరకును’’. ‘‘గోపమ్మ యా రాత్రియే ‘బాబుగారితో’ జెప్పెదనని వాగ్దానము చేసెను’’. విచిత్రము! మరునాటి యుదముననే బ్రాహ్మణుని యింటికి బంట్రోతు వచ్చి నాటి నుండియే యుద్యోగమున జేరవలసినదిగా ‘బాబుగారి’ యుత్తరువును విన్నవించిపోయెను. ఆ యుద్యోగస్థుడును ప్రధానోద్యోగితో బ్రాహ్మణుని గూర్చి యిట్లు సిఫారసు చేసెను: ‘‘ఈతడు చాలా యోగ్యత గలవాడు, పెద్ద పరీక్షల నిచ్చినవాడు. ఈతని సేవ మన ఆఫీసునకు జాల లాభకరముగా నుండునని యుద్యోగము నిచ్చినాను. తమ దయవలన జాల అభివృద్ధి నొందదగినవాడీతడు’’.
కామినీ వ్యామోహ ప్రభావమిటువంటిది. లోకమంతయు కామినీ కాంచన వ్యామోహములో మునిగితేలుచున్నది.
లోభి వర్తకుడు: గురువు
1070.ఒక పేద బ్రాహ్మణునకు ధనికుడగు నొక బట్టల వర్తకుడు శిష్యుడుగా నుండెను. స్వతస్సిద్ధముగా ఆ వర్తకుడు బహు లోభి. ఒకనాడా బ్రాహ్మణునకు దన దేవతార్చన గ్రంథమును గప్పుకొనుటకై యొగ గుడ్డ కావలసి వచ్చినది. ఆయన తన శిష్యుని యొద్దకుబోయి యడిగినాడు. వర్తకుడిట్లు పలికెను: ‘‘అయ్యో, రెండు గడియల క్రితము చెప్పిన పక్షమున మీకు గావలసిన గుడ్డ నిచ్చియుందును. మీకు బనికివచ్చెడు చిన్న గుడ్డముక్క యిప్పుడేదియులేదే! ఏమి దురదృష్టము! కానిండు, మీరడిగినదానిని జ్ఞప్తి నుంచుకొందును. ఐనను మీరప్పుడప్పుడు మాత్రము జ్ఞాపకము చేయుచుండుడు’’. పాపమా బ్రాహ్మణుడు నిరాశతో వెడలిపోయెను.
గురువుగారికిని ఈ శిష్యోత్తమునకును జరిగిన సంభాషణమును వర్తకుని భార్య తెరచాటున నుండి వినినది. ఆమె వెడలిపోవుచున్న యా బ్రాహ్మణుని వెంటనేలోనికి బిలిపించి, ‘‘స్వామీ! గృహ యజమానుని మీరడిగినదేమి?’’ యని విచారించెను. బ్రాహ్మణుడు జరిగిన వృత్తాంతమును దెలుప, ‘‘చిత్తము, మీరింటికి వెళ్లుడు; మీరు కోరిన గుడ్డ రేపు దయముననే మీకు జేరును’’ అని వర్తకుని భార్య పలికెను. రాత్రి వర్తకుడింటికి రాగానే, ‘దుకాణము మూసివేసేతిరా?’’ యని భార్య యడిగెను. ‘‘ఔను, విశేషమేమి?’’ యని వర్తకుడనెను. ‘‘ఇప్పుడే వెళ్లి మన దుకాణమున గలవానిలో నాణెమైన రెండు బట్టలు తీసుకొని రండు’’ అని భార్య పలికెను. వర్తకుడంత, ‘‘ఏమీ రుూ తొందర! రేపుదయమున నీయగూడదా? ఉన్న వానిలోనెల్ల మేలైన వానిని రేపుదయముననే యిచ్చెదను’’ అనెను. ‘‘అటుల కాదు, ఇప్పుడు రుూయవలెను, లేదా నా కక్కరయే లేదు’’ అని భార్య నొక్కి చెప్పెను.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది