సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపమా నిర్భాగ్యుడేమి చేయగలడు? గురువుగారా, ఏవో మాయ మాటలతో- కల్లబొల్లి వాగ్దానములతో బంపివేయుటకు, ఆమె తన శయ్యామందిరపు గురవయ్యెను! ఇక నేమి చేయుట! ఈమె యాజ్ఞ అప్పటికప్పుడే చెలామణియై తీరవలయును. లేనిచో, ‘ఇంటిలోని పోరు ఇంతంత గాదయా!’ యనునట్లగును. తుదకా వర్తకుడు విధిలేక అర్థరాత్రి వేళ బోయి, కొట్టు తీసి భార్య కోసము బట్టలు తెచ్చినాడు. మరునాటి ఉదయముననే ఆ యిల్లా గురువుగారికి కావలసిన బట్టను బంపుచు నిట్లు కబురంపెను: ‘‘ఇకమీదట మా యొద్ద మీకేమైన గావలసిన పక్షమున నన్నడుగుడు, మీకు దొరకును’’
(కాబట్టి దయామయియగు లోకేశ్వరి శరణుజొచ్చి యామె వరప్రసాదమును గోరువారి ప్రార్థనలు, ఈషణ్మాత్రము కఠినమైన పితృభావన భగవంతునర్చించువారి ప్రార్థనలకంటె శీఘ్రముగ- సులభముగా- నెరవేరుటకు అవకాశలుగలదని గ్రహింపనగును).
కార్తికేయుడు
1071. భార్య యెడ గృహస్థ ధర్మమును నిర్వర్తింపకుండుటకు గారణమేమని యొకరు ప్రశ్నింప శ్రీ గురుదేవుడిట్లు సమాధానమొసగెను; ‘‘కార్తికేయుడొకనాడు పిల్లిని గిల్లినాడట. ఇంటిలోనికిబోయి చూచుసరికి దన దివ్యజననియగు పార్వతి చెంప గిల్లబడియుండుట గాంచి, ‘అమ్మా, నీ బుగ్గపై అసహ్యమైన రుూ గాయమెటుల గలిగినది?’అని యడిగెను. జగజ్జనని యిట్లు సమాధానమొసగెను: ‘ఇది నీ పనియే, నీ గోటి ఱక్కే యిది.’ కార్తికేయుడు నివ్వెఱపడి, ‘అదెట్లమ్మా! నేను నినె్నన్నడును గిల్లిన జ్ఞప్తిలేదే!’ అనెను.
‘నాయనా! నీ వీ యుదయము పిల్లిని గిల్లిన మాట మఱచిపోయితివా?’ అని యా తల్లి యడిగెను. కార్తికేయుడు, ‘ఔనమ్మా, నేను పిల్లిని గిల్లితిని. ఐనను నీ బుగ్గమీద గాయము పడుటెట్లు?’అనగా తల్లి యిట్లనెను: వెఱ్ఱినాయనా! ఈ జగమున నేనువినా ఏమియులేదు. సృష్టి జాతమంతయు నేనే. నీ వెవరిని హింసించినను ననే్న హింసించిన వాడవగుదువు. ఈ పలుకులాలకించి కార్తికేయుడత్యాశ్చర్యము నొంది తాను వివాహమాడరాదని నిశ్చయించికొనినాడట! ఏలన దానెవరిని బెండ్లియాడగలడు? ప్రతి స్ర్తియు దనకు దల్లియేకదా? ఇట్లు సమస్త స్ర్తిలయందును మాతృభావమును బొంది యాతడు పెండ్లియాడుట మానివేసెను. నేనును కార్తికేయుని వంటివాడనే. ప్రతి స్ర్తిని లోకేశ్వరిగనే భావింతును.’’
ఆత్మవికాసము మనసుపై నాధారపడి యుండును
ఇద్దఱు మిత్రులు
1072. ఆత్మవికాసము మనఃస్థితిపైనను భావములపైనను ఆధారపడి యుండును. వికాసము హృదయమువలన గలుగవలయును గాని ఏ బాహ్యకర్మముల వలనను గలుగదు.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి - ఇంకాఉంది