సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దఱు స్నేహితులు భాగవత కాలక్షేపము జరుగు తావునకు సమీపమునుండి పోవుచుండిరి. అందొకడు, ‘‘అదిగో, అచటికిబోయి కొంచెముసేపు పురాణమును విందము’’ అనెను.
రెండవవాడు, ‘‘ఎందుకోయి! భాగవతమును వినిననేమి లాభము? బోగమువాండ్ర యింటికి బోయి హాయిగా గాలక్షేపము చేయుదము’’ అనెను. మొదటివాడందులకు సమ్మతింపక భాగవత కాలక్షేపము జరుగుచోటికే వెడలెను. రెండవవాడు భోగముదాని యింటికి బోయెనుగాని, తానాశించిన యానందమును గనజాలక పోయెను. అందుచే దనలో దానిట్లనుకొనసాగెను: ‘‘అయ్యో! నేనిక్కడి కేల వచ్చినాను? శ్రీహరి లీలలను వినుచు నా స్నేహితుడెంత హాయిగా గాలక్షేపము చేయుచుండునోకదా!’’ ఇట్లాతడు తాను అపవిత్ర స్థలమున నుండియు హరిని గూర్చియే ధ్యానించెను. రెండవవాడో, భాగవత శ్రవణము చేయుచును గూడ అందానందము గనజాలక తన్ను దానిట్లు నిందించుకొనసాగెను: ‘‘ఆహా! ఎంత బుద్ధిహీనుడను! మిత్రునితోగూడ భోగముదాని యింటికి బోయి సుఖ మనుభవింప నైతినే! అతడెంత హాయిగా గాలక్షేపము చేయుచుండనోకదా!’’ ఇట్లీతడు భాగవతము పఠింపబడు తావున గూర్చుండెనన్న పేరే కాని, ‘‘చిత్తము శివుని మీద, భక్తి చెప్పుల మీద’’అనునట్లు వీని మనసంతయు బోగముదాని యింటి మీదనే యుండెను. ఇట్లు వీని మనస్సు అపవిత్ర సంకల్పములతో మలినమై యుండుటవలన, స్వయముగా వారి యింటికి బోకపోయినను పాపమునే పొందినాడు. ఇక భోగము దాని యింటికి బోయినవాడో, స్వయముగా తాను అపవిత్ర స్థలమున నున్నను వాని మనస్సంతయు భాగవత కాలక్షేపము మీదనే యుండుటవలన భాగవత శ్రవణము చేసిన పుణ్యమును బడసెను.
సన్న్యాసి: వేశ్య
1073. ఒక గుడి చెంత నొక సన్న్యాసి నివసించువాడు. ఎదురుగా నొక భోగము వారి యిల్లుండెను. విటులనేకులు నిరంతరము నామెయింటికి వచ్చుచు బోవుచుండుట గాంచి సన్న్యాసి యొకనాడామెను బిలిచి యిట్లు చీవాట్లు పెట్టెను: ‘‘నీవు మహాపాపివి. రేయింబవళ్లు నీవు పాపము చేయుచునే యున్నావు. నీకెట్టి ఘోర దుర్దశ రానున్నదోకదా!’’ పాపము, ఆ సాని, తన పాపకృత్యములకు జాల విచారించి తన పాపమును క్షమింపుమని భగవంతుని బ్రార్థించుచు, మనఃపూర్వకముగా పశ్చాత్తాపపడెను. ఐనను వ్యభిచార మామెకు వంశాచారమగుట చేతను జీవనోపాధికై మఱియొక వృత్తి నాశ్రయించుతెన్ను గానకుండుట చేతను, తన తనువు వ్యభిచరించినపుడెల్ల దన్నుదాను నిందించుకొనుచు, విశేషపశ్చాత్తాప పడుచు క్షమింపుమని భగవంతుని బ్రార్థించుచుండెడిది. ఆ సన్న్యాసి తానుచేసిన హితోపదేశము వ్యర్థమైనదిగదాయని విసుగుకొని తనలో దానిట్లనుకొనెను:

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది