సబ్ ఫీచర్

రా రమ్మని...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్కరాలు రానే వచ్చాయి. భక్తులూ
తరలివస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు
రారమ్మంటూ కృష్ణాతీర ప్రాంతవాసులు
తమవారిని ఆహ్వానిస్తున్నారు. అటు
ప్రభుత్వమూ సకలసన్నాహాలు పూర్తి చేసింది. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఘాట్లు ముస్తాబయ్యాయి. విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి.
**
సంగమం...సోయగం
మహబూబ్‌నగర్ జిల్లాలో మూడుచోట్ల నదీసంగమ ప్రాంతాలున్నాయి. ఇక్కడకి భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ప్రముఖ శక్తిపీఠం అలంపూర్‌కు అతిసమీపంలోని గుందిమళ్ల ఘాట్‌లో ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్ రావు కృష్ణా పుష్కరాలను ప్రారంభించనున్నారు. తంగిడి వద్ద భీమా, కృష్ణా.. గుందిమళ్ల దగ్గర తుంగ, కృష్ణా నదులు, సోమశిల దగ్గర సప్తనదులతో కృష్ణమ్మ సంగమిస్తోంది. ఈ ప్రాంతాలకు భక్తుల తాడికి ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాలో 52 ఘాట్లు ముస్తాబు చేశారు. తంగిడి నుండి దాదాపు 300 కిలోమీటర్ల పొడవున, పాతాళగంగ ప్రాంతం వరకు వరకు జిల్లాలో కృష్ణమ్మ ప్రవహిస్తోంది. ప్రధాన ఘాట్లలో కృష్ణా, పస్పుల, జూరాల, నది అగ్రహారం, బీచుపల్లి, రంగాపూర్, సోమశిల, గుందిమళ్ల, పాతాళగంగా ఘాట్లకు ప్రత్యేక విశిష్టత ఉంది. బీచుపల్లి పుష్కరఘాట్‌కు పుష్కరాల సమయంలో ప్రతిరోజు లక్షకు పైగా భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. రంగాపూర్ పుష్కరఘాట్ విద్యుత్ దీపాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది.
నల్లగొండ జిల్లాలో..
దాదాపు126 కిలోమీటర్ల మేరకు కృష్ణమ్మ ఈ జిల్లాలో ప్రవహిస్తోంది. 28 పుష్కర ఘాట్‌లు సిద్ధం చేశారు. దాదాపుగా కోటిన్నర మంది భక్తులు రావచ్చన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా వాడపల్లి, మట్టపల్లి, నాగార్జున సాగర్ ఘాట్‌లకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా. భక్తుల పుణ్య స్నానాల కోసం నాగార్జున సాగర్ నుండి 50 వేల క్యూసెక్కులు నీటిని వదిలారు. గత కృష్ణా పుష్కరాలు 2004లో 43లక్షల మంది భక్తులు రాగా 5మండలాల పరిధిలో 11 పుష్కర ఘాట్‌లు మాత్రమే ఉండగా ఈ దఫా 500 కోట్లు వెచ్చించి వాటి సంఖ్య బాగా పెంచారు.
గత పుష్కరాల్లో 552మీటర్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయగా ఈ దఫా 2,562 మీటర్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. భక్తులు అధికంగా రానున్న వాడపల్లి వద్ద ముఖ్యమైన ఎనిమిది ఘాట్‌ల విస్తీర్ణం 771 మీటర్లుకాగా ఇక్కడ రోజుకు 5లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. మట్టపల్లి శద్ధ 365మీటర్ల ఘాట్‌లు ఏర్పాటు చేయగా ఇక్కడ రోజుకు 3.75 లక్షల మంది రావచ్చని అంచనా. సాగర్‌లో శివాలయం, అంజనేయ ఘాట్, పొట్టిచెల్మ ఘాట్‌లను 230 మీటర్లతో 2లక్షల భక్తుల స్నానాల అంచనాతో నిర్మించారు. 100నుండి 120మీటర్ల విస్తీర్ణంతో 1లక్ష మంది భక్తుల రాక అంచనాతో నేరడుచర్ల మహంకాళిఘాట్, వజినేపల్లి, కిష్టాపురం, అడవిదేవులపల్లి, ఉట్లపల్లి, అజ్మాపూర్, పెద్ధమునిగల్ ఘాట్‌లను ఏర్పాటు చేశారు.