సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సరి, దీని జీవిత కాలమున నిటుపై దీని యింటి కెందఱు విటులు వత్తురో చూచెదనుగాక,’’ నాటినుండి కొన్ని బొమ్మరాళ్లను బ్రోగుచేసికొని, యా సాని యింట విటుడు ప్రవేశించినపుడెల్ల సన్న్యాసి యొక బొమ్మఱాతిని దీసి యొకచోట వేయుచుండువాడు. రానురాను ఆ ఱాళ్లొక పెద్ద కుప్పగా బెరిగినవి. ఒకనాడాతడు సానికా కుప్పను జూపి, ‘‘చూచితివా, ఇది నీ పాపముల గుట్ట; నీ పాపకృత్యములను మానుమని నిన్ను నేను మందలించిన నాటినుండియు నీవు మానక వ్యభిచరించినపుడెల్ల నేనొక ఱాతిని గుర్తుగా బెట్టుచున్నాను; ఆఱాళ్లచే నేర్పడిన నీ పాప రాశి యిది! ఇంతటి నుండియైన నీ పాతకములను మానుమని చెప్పుచున్నాను. వీనిచే నీకెట్టి ఘోర దుర్గతి కలుగునో తెలియునా?’’ అని హెచ్చరించెను. పాపమానిర్భాగ్యురాలు తన పాపరాశిని జూచి గజగజ వణకుచు దన యశక్తతను గూర్చి, ‘‘్భగవంతుడా! నా రుూ ఘోర దుఃఖ జీవనమునుండి నన్ను రక్షింపవా?’’అని యంతరంగమున మొఱలిడసాగెను. ఆమె ప్రార్థనను భగవంతుడు వినినాడు. ఆనాడే మృత్యుదేవత యామెయింట బ్రవేశింప నామె రుూ ప్రపంచమును విడిచినది. అచింత్యమైన విధి వశమున సన్న్యాసియు నానాడే దేహత్యాగము చేసినాడు. యమదూతలు సన్న్యాసియొక్క జీవుని బాశములచే బంధించి నరక లోకమునకు గొనిపోయిరి; విష్ణుదూతలు వచ్చి పశ్చాత్తప్తురాలైన యా వేశ్యయొక్క జీవుని వైకుంఠమునకు గొనిపోయిరి. ఆ వేశ్యయొక్క యదృష్టమును గాంచి సన్న్యాసి యిట్లఱచెను:
‘‘ఇదియే కాబోలును భగవంతుని ధర్మసూక్ష్మత! జీవితమంతయు నేను కఠిన నిష్ఠలతో గడపితిని. నన్ను నరకమున కీడ్చుకొని పోవుచున్నారు! యావజ్జీవము మహాపాతకములు చేసిన యా వ్యభిచారిణి వైకుంఠమునకు బోవుచున్నది!’’ ఈ పలుకులు విని విష్ణుదూత లిట్లు తెలిపిరి: ‘‘ఓరుూ! విధాత యొక్క నిర్ణయములెప్పుడును న్యాయముగనే యుండును; సంకల్పానుగుణముగనే ఫలము గలుగుచుండును. పేరుప్రతిష్ఠల నాశించి జీవితమంతయు నీవు బాహ్యాడంబరముతోడను, అహంభావముతోడను గడిపితివి. అందులకు భగవంతుడు నీకు విధించిన ఫలమిది. నీవెన్నడును మనఃపూర్వకముగా భగవత్ప్రాప్తికై పరితపింపవైతివి. తనతనువు పాపము చేసినను, ఈ వేశ్య యహర్నిశము హృదయ పూర్వకముగా భగవంతుని బ్రార్థించినది. అదిగో లోకమున నీ శరీరమునకెట్టి గతి కలుగుచున్నదో ఆమె శరీరమున కెట్టిగతి కలుగుచున్నదో చూడుము. శరీరముతో నీవెన్నడును పాపము చేయలేదు. కాన నీ శరీరమును వారు పూలమాలలతో నలంకరించి, మేళ తాళములతో నూరేగించుచు పుణ్యనదిలో విడువబోవుచున్నారు. కాని రుూ వేశ్యయొక్క శరీరము పాపము చేసియున్నది కాన, ఈ క్షణమున గాకులచేతను, గద్దల చేతను జీల్చివేయబడుచున్నది.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి