సబ్ ఫీచర్

ఎస్సీల వర్గీకరణ అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈదేశంలో అత్యంత పీడిత జాతులకు చెందిన వారు దళితులు. ఈ దేశ మూలవాసులు. మొదట్నుంచీ తాము అంటరానివారిగా ముద్రవేయబడి పీడనకు, సామాజిక వేదనకు గురిచేయబడినవారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వీరు యాభైతొమ్మిది కులాలుగా విభజింపబడ్డారు. అం దులో మాల, మాదిగ కులాలకు, ఉపకులాలకు చెందినవారే అత్యధిక సఖ్యలో ఉన్నారు. ఈ కులాల్లోంచి వచ్చినవాడే అంబేద్కర్. భారతరత్న, పీడితజాతుల తాత్వికుడు. భారతదేశంలో కుల వ్యవస్థతో బాధితులైన, సామాజిక న్యాయానికి దూరమైన దళిత, బీసీ కులాల వారికోసం, కుల నిర్మూలన కోసం జీవితాన్ని అంకితం చేసాడు అంబేద్కర్. సవర్ణులతో మడమతిప్పని పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించాడు. రాజ్యాంగ నిర్మాత అవడమే కాకుండా రా జ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరిచాడు. జనాభా ప్రాతిపదికన దళితులకున్న పదిహేను శాతం రిజర్వేషన్లను సమానంగా పంచుకోవాలన్నాడు. కుల నిర్మూలన జరగాలన్నా డు. రాజ్యాధికారానికి రాని జాతి అంతరించిపోతుందని దళితలు రాజ్యాధికారానికి రావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాడు.
అంబేద్కర్ స్ఫూర్తితో, రిజర్వేషన్లు, ఇతరత్రా తమకు లభించిన అవకాశాలతో దళితులు కొంతమంది చదువుకున్నారు. జీవితాలను గెలుచుకున్నారు. రాజకీయ నాయకులుగా, ఆచార్యులుగా, రచయితలుగా, జర్నలిస్టులుగా, మేధావులుగానూ ఎదిగారు. ఊరూరా అంబేద్కర్ సంఘా లు వెలిసాయి. దళిత వాడల్లో కొంత చైతన్యం పెరిగింది. రిజర్వేషన్ సౌకర్యాలను ఉపయోగించుకోవడం మెట్లుమెట్లుగా ఎదగడం ప్రారంభమైంది. ఇందులో కొంత చైత న్యం ఎక్కువగా ఉన్న కులాలు ఒక్కో చోట కొంత ఎక్కువ ఎదగడం సహజమే. ఎదిగారు కూడ. దాంతో కులాల్లో చైతన్యం పెరిగింది. చదువులూ పెరిగాయి. తమ హక్కును ఉపయోగించుకునే చైతన్యమూ పెరిగింది. పీడనకు వ్యతిరేకంగా పోరాటాలూ జరిగాయి. భాగ్యరెడ్డి వర్మ లాంటి వాళ్లు ఆది హిందూ సమాజాన్ని స్థాపించి దళితులే ఆదిమజాతీయులని దళిత హక్కుల కోసం పోరాడారు. దళిత స్ర్తిలకోసం పాఠశాలలను నిర్మించారు. అంటరానితనంతో గుడి ప్రవేశానికి ఊరు ప్రవేశానికి కూడా దూరమైన దళితులకు, స్ర్తిలకు పాఠశాలలను నిర్మించి చైతన్యం రగిల్చిన మొదటి దళిత సంస్కరణ వాది భాగ్యరెడ్డి వర్మ.
కోస్తా ప్రాంతంలో మాలలు చేసిన ఉద్యమాలు అంబేద్కర్ భావజాలాన్ని విశేషంగా ప్రభావితం చేయడమే కాకుండా దళితుల్లో చైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచాయి. అలాగే కృష్ణమాదిగ నడిపిన, నడుపుతున్న ఎమ్మార్పీఎస్ ఉద్యమం పీడిత కులాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తమ కులం ఏ కులానికి తక్కువ కాదన్న ఆత్మగౌరవాన్ని పెంచిం ది. పోరాట పటిమను పెంచింది. ఎమ్మార్పీఎస్ కేవలం వర్గీకరణ కోసమే కాకుండా తెలుగు సమాజాన్ని అనేకరంగాల్లో ప్రభావితం చేసింది. వికలాంగులకోసం అంగలాచ్చింది. 108 సేవలు రావడానికి కారణమైంది. ఆరోగ్యశ్రీ రావడంలో పరోక్ష పాత్ర వహించింది. తెలంగాణ అమరజీవుల కడుపుకోతను పట్టించుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ముఖ్యమైన సందర్భంలోనూ ప్రధాన పాత్ర వహించింది. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది.
స్వాతంత్య్రానంతరం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోకి ప్రవేశించిన అంబేద్కర్ భావజాలం పీడిత జాతులను ముందుకు నడిపించింది. దళిత రాజ్యాధికార భావనకు పునాదిరాయయింది. అందుకే కాబోలు కాన్షీరామ్ ఉత్తరప్రదేశ్ తర్వాత దళిత రాజ్యాధికారం వచ్చేది అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోనే అన్నాడు. అందుకు తగ్గట్టుగానే దళిత బహుజన చైతన్యం తెలుగు సమాజమంతటా విస్తరించినా అనుకున్న స్థాయలో లేదు.
తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేక పోరాటాలు, కుల వ్యతిరేకోద్యమాలు బలపడి దళిత రాజ్యాధికార ఉమ్మడి పోరాట దిశగా అడుగులు పడే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇరవై ఒకటవ శతాబ్ది మొదటి పాతికేళ్లలో దళిత రాజ్యాధికార భావనను దూరం జరుపుతున్నారు. తమలోని వైరుధ్యాలనే దూరం చేసుకోకుండా బీసీలతో, మైనారిటీలతో, గిరిజనులతో, ఐక్య ఫ్రంటుగా ఏర్పడి రాజ్యాధికారాన్ని సాధించడం ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఎచట తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు? అనే పరిస్థితి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అందుకు కారణం వర్గీకరణమా? కాకూడదు. ఒకవేళ అదే అయితే ఆ చిన్న సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి. ఇప్పటికే విలువైన ఇరవైరెండేళ్ల సమయం ఉమ్మడిగా దళితులంతా కలిసి చేయాల్సిన పోరాటాలను ఈ చిన్న వైరుధ్యం దూరం జరిపింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల్లోని పైన పేర్కొన్న దళిత ప్రముఖులతో పాటు ఇతర ప్రజాస్వామ్య వాదులు, దళిత ప్రేమికులు, ఇతర రాజకీయ, సామాజిక, దళిత ప్రముఖులు ప్రయత్నించాలి.వర్గీకరణ జరిగితే ఆయా రాష్ట్రాల్లోని దళిత కులాల జనాభా ప్రాతిపదికన 15 శాతం రిజర్వేషన్లను సమానంగా పంచడం జరుగుతుంది. అవసరమయితే మరోసారి దళిత జనాభా గణన చేయాల్సి ఉంది. తమ జనాభాననుసరించి రిజర్వేషన్లు తమకు లభించినప్పుడు ఎవరికైనా జరిగే నష్టమేంటి? అన్నదమ్ముల వాటా ను సమానంగా పంచుకోవడానికి పంచాయతులెందుకు?
అంబేద్కర్ దళితులకు ప్రసాదించిన 15 శాతం రిజర్వేషన్లు అనే ఆస్తిని దళిత కులాలవారు జనాభా ప్రాతిపదికన సమానంగా పంచుకోవడమే వర్గీకరణ. దీనికోసం సుదీర్ఘ పోరాటం నడుస్తోంది. ఎస్సీలు, ఉమ్మడి పోరాటాలు చేస్తూ దళిత రాజ్యాధికార భావనను ముందుకు తీసుకెళ్లడానికి సమయం లేకుండా చేస్తున్నదీ సమస్య. ఇప్పుడీ పోరాటం ఢిల్లీకి చేరింది. గత రెండు,మూడు వారాలుగా ఢిల్లీలో ఈ సమస్యపై నిర్విరామ పోరాటం నడుస్తోంది. కత్తి పద్మారావు, గద్దర్ లాంటి వారు, కవులు ఇరు రాష్ట్రాల్లో అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న దళిత నాయకులు అనేకమంది వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించినవారే. వీళ్లంతా ఇప్పుడు ఢిల్లీకి పో యి ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తే ఎంతో బాగుంటుంది. అలాగే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణను సమర్థించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణను సమర్థించి అసెంబ్లీ ద్వారా కేంద్రానికి పంపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేలా చూడాలి.
ముసుగులో గుద్దులాటలా ఉన్న వర్గీకరణ మిత్ర వైరుధ్యానికి తెరపడాలంటే మాలలు వర్గీకరణకు బహిరంగ మద్దతివ్వాలి. మాల మాదిగల మధ్య ఇంకేమైనా వైరుధ్యాలుంటే చర్చలద్వారా పరిష్కరించుకోవచ్చు. ఢిల్లీలో, మాల, మాదిగలు వర్గీకరణ ఒకరు వద్దని, ఒకరు కావాలని ధర్నాలు చేయడం కాదు కావలసింది. ఇద్దరూ వర్గీకరణ కావాలని, ఎవరి వాటా వారికి చెందాలని ధర్నాలు చేయాలి. ఆ తర్వాత దళిత రిజర్వేషన్లు పెంచాలని, దళిత రాజ్యాధికారం కావాలని, చేసే పోరాటాలకు ఈ విజయం నాంది అవుతుంది.

-డాక్టర్ కాలువ మల్లయ్య సెల్: 98493 77578